హెయిర్ ఫాల్ సమస్యకు ఇలా చెక్ పెట్టండి..
hai fall: హెయిర్ ఫాల్ సమస్య నుంచి బయటపడటానికి జీడిపప్పులు, బాదం పప్పులు, పిస్తాలు ఎంతో సహాయపడతాయి. వీటిని రోజూ గుప్పెడు తిన్నా.. హెయిర్ ఫాల్ సమస్య నుంచి మీరు ఉపశమనం పొందినట్టే.

hair fall
hai fall: ప్రస్తుత కాలంలో హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్స్ ఎక్కువవుతున్నాయి. కారణం పెరుగుతున్న వాతావరణ కాలుష్యం, పోషకలేమి ఆహారం, మన జీవన శైలి. ఇవన్నీ మన హెల్త్, జుట్టు ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి.
హెయిర్ ఫాల్ సమస్య నుంచి గట్టెక్కించడంలో కొన్ని రకాల ఆహార పదార్థాలు ఎంతో ఉపయోగపడతాయి. వాటిని క్రమం తప్పకుండా తీసుకుంటే జుట్టు రాలే సమస్యకు చెక్ పెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు.
కురుల ఆరోగ్యానికి డ్రై ఫ్రూట్స్ ఎంతో మేలు చేస్తాయి. అందులో జీడిపప్పులు, బాదం పప్పులు, పిస్తాలల్లో పోషకాలు మెండుగా ఉంటాయి. వీటిని ప్రతిరోజూ గుప్పెడు తిన్నా.. హెయిర్ ఫాల్ సమస్య నుంచి ఈజీగా బయటపడతారు. అంతేకాదు వీటిని ప్రతిరోజూ తినడం వల్ల మీ ఆరోగ్యం కూడా బేషుగ్గా ఉంటుంది.
జుట్టు పెరిగేందుకు, రాలిపోకుండా ఉండేందు పోషకాహారం ఎంతో అవసరం. కిడ్నీ బీన్స్, శనగలు, బ్లాక్ బీన్స్ లల్లో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. వీటిల్లో ఉండే Plant based protein హెయిర్ గ్రోత్ కు ఎంతో సహాయపడుతుంది. కాబట్టి వీటిని మీరు రోజు వారి ఆహారంలో చేర్చుకోండి.
పాలకూర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని మనకు తెలుసు. అయితే వీటిలో ఉండే విటమిన్ ఎ, సి, ఫొలేట్, ఐరన్ లు జుట్టుకు ఎంతో మేలు చేస్తాయి. ఈ పాలకూరతో జుట్టు పొడుగ్గా పెరుగుతుంది. కాబట్టి ఈ కూరను వారానికి మూడు రోజులు తినేలా చూసుకోండి.
కేశాల నిగారింపుకు, పెరుగుదలకు ఉసిరి దివ్య ఔషదంలా పనిచేస్తుంది. ఎందుకంటే ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయి.
జుట్టు ఆరోగ్యానికి ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఎంతో సహాయపడతాయి. ఈ ఆమ్లాలు చేపల్లో ఎక్కువ మొత్తంలో ఉంటాయి. కాబట్టి చేపలను ఎక్కువగా తినండి. కాగా సాల్మాన్ చేపలు కేశాల పెరుగుదలకు ఎంతో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు.
దాల్చిన చెక్క ఫుడ్ కు రుచిని ఇవ్వడమే కాదు మన ఆరోగ్యానికి మేలు కూడా చేస్తుంది. ఇది మన బాడీలో బ్లడ్ సర్క్యూలేషన్నుపెంచుతుంది. అంతేకాదు జుట్టు ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన పోషకాలను అందిస్తుంది. అలాగే కుదుల్లకు అవసరమైన ఆక్సిజన్ అందడానికి ఈ దాల్చిన చెక్క ఎంతో అవసరం.
చిలకడ దుంపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో బీటా కెరోటిన్ పుష్కలంగా లభిస్తుంది. ఇది మన శరీరంలోకి వెళ్లి విటమిన్ ఎ ఉత్పత్తికి సహాయకారిగా ఉంటుంది. కాగా కురులు పొడిబారకుండా ఉండేందుకు, మృదువుగా మారేందుకు సెబమ్ ఎంతో అవసరం. ఈ సెబమ్ తయారీకి విటమిన్ ఎ ఉపయోగపడుతుంది. కాబట్టి చిలకడదుంపను తరచుగా తినండి.