నిద్రతోనే అందమైనా..! ఆరోగ్యమైనా..!
Health Tips: నిద్రే సర్వరోగ నివారిణి అంటారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే నిద్రలేకుంటే ఎన్నో రోగాలు చుట్టకునే ప్రమాదం ఉంది. అంతేకాదు.. అందం కూడా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.

Health Tips: నిద్ర మన శరీరానికి అత్యవసరం. అలసి సొలసిన శరీరానికి నిద్రతోనే విశ్రాంతి లభిస్తుంది. తిరిగి శక్తిని పుంజుకుంటుంది. అయితే నేడు చాలా మంది పనుల్లో ఒత్తిడి, రాత్రుళ్లు సెల్ పోన్స్, టీవీ, ల్యాప్ టాప్ లను తెల్లవార్లూ చూడటం, నిద్రలేమి వంటి సమస్యల వల్ల సరిగ్గా నిద్రపోలేకపోతున్నారు.
కానీ కంటినిండ నిద్రలేకపోవడం వల్ల మన శరీరానికి ఎంతో హాని జరుగుతుంది. నిద్రపోకపోతే ఆరోగ్యమే కాదు.. చర్మం కూడా దెబ్బతింటుంది. అసలు నిద్రకు.. అందానికి సంబంధమేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. అయితే మనం నిద్రపోతే మన శరీరంలో Cardinal levels తగ్గుతాయి. అలాగే మెలటోని లెవెల్స్ పెరుగుతాయి. ఇది అందాన్ని పెంచడంతో పాటుగా జట్టు కణాలను ఆరోగ్యంగా ఉంచడానికి, శరీరం శక్తిని పుంజుకోవడాని అవసరమైన పోషకాలు అందుతాయి.
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మనం ఖచ్చితంగా 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి. ఇలా నిద్రపోతేనే మీరు ఆరోగ్యంగా ఉండటంతో పాటుగా అందంగా కూడా ఉంటారు. రోజుకు 6 గంటల కంటే తక్కువ నిద్రపోతే ఆరోగ్యం దెబ్బతినడంతో పాటుగా అందం కూడా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. 6 గంటల కంటే తక్కువ నిద్రపోతే ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..
పెద్ద వయసు వారిలా కనిపిస్తారు: చాలా కాలంగా మీరు 6 గంటల కంటే తక్కువ రోజులు నిద్రపోతున్నట్టైతే.. మీ చర్మంపై ముడతలు, కళ్ల చుట్టూ నల్లటి వలయాలు, చర్మం ఉబ్బడం, స్కిన్ పై గీతలు, చర్మం పేలవంగా మారడం వంటి వృద్ధాప్య లక్షణాలు కనిపిస్తాయి. ఎందుకంటే నిద్రలేమి వల్ల ఒత్తిడి పెరుగుతుంది. దీంతో కార్డిసాల్ రిలీజ్ అయ్యి కొల్లాజెన్ విచ్ఛిన్నం అవుతుంది. దీంతో చర్మం సాఫ్ట్ నెస్ ను కోల్పోతుంది. అలాగే చర్మం సాగుతుంది. ఇవన్నీ మీరు వయసు మళ్లిన వారిలా కనిపించేలా చేస్తాయి.
మెమోరీ పవర్ తగ్గుతుంది: నిద్ర బ్రెయిన్ పై కూడా చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. ఎందుకంటే శరీరానికి అవసరమైన నిద్రలేకపోతే మెదడు కణజాలాలు ప్రభావితం అవుతాయి. దీంతో మెమోరీ పవర్ తగ్గడం ప్రారంభమవుతుంది. విషయాలను గుర్తించుకోకపోవడం, పేర్తను మర్చిపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి.
వెయిట్ పెరుగుతారు: నిద్రలేమి బరువుపై కూడా ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా రోజుకు 6 గంటల కంటే తక్కువ సేపు నిద్రపోతే ఆకలి పెరిగే అవకాశం ఉంది. ఇలాంటి వారు మోతాదుకు మించి తింటారు. చివరకు వీరు ఊబకాయం బారిన పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అనారోగ్య సమస్యలు: అలసి సొలసిన శరీరానికి నిద్ర చాలా అత్యవసరం. ముఖ్యంగా కంటికి సరిపడా నిద్రలేకపోవడం వల్ల గుండె ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. గుండె జబ్బులు, హార్ట్ ఎటాక్, స్ట్రోక్, క్యాన్సర్, డయాబెటీస్ వంటి ప్రమాదకరమైన రోగాలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.