చలికాలంలో ఈ తప్పులు చేస్తే మీ చర్మం దెబ్బతింటుంది జర జాగ్రత్త..
చలికాలంలో చర్మ సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. ఇవి పూర్తిగా తగ్గిపోవాలంటే కొన్ని తప్పులను అసలే చేయకూడదు. అవేంటంటే..

చలికాలంలో చర్మ ఆరోగ్యం పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ సీజన్ లోనే చర్మ సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. ఉష్ణోగ్రతలు పడిపోతున్నప్పుడు చర్మం పొడిగా మారుతుంది. అలాగే చికాకు పెడుతుంది. ఈ సీజన్ లో వీచే గాలుల వల్ల చర్మం బయటిపొరతో పాటుగా లోపలి పొర కూడా దెబ్బతింటుంది. దీనివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. అయితే కొన్ని చిట్కాలతో చర్మ సమస్యలను తొలగించొచ్చు. ఇందుకోసం చర్మ సంరక్షణ విషయంలో ఈ తప్పులు చేయకండి.
వేడినీటితో స్నానం చేయకండి
వేడి నీటితో స్నానం చేస్తే చర్మంలోని సహజ నూనెలు తొలగిపోతాయి. దీనికి తోడు వేడి నీరు చర్మ చికాకును కలిగిస్తుంది. అందుకే వేడినీటితో స్నానం చేసిన తర్వాత చర్మం ఎర్రగా కనిపిస్తుంది. అందుకే నీరు మరీ వేడిగా ఉండకుండా చూసుకోండి. నీటి ఉష్ణోగ్రతను తగ్గించండి.
సరైన మాయిశ్చరైజర్ ఉపయోగించండి
వేసవి తేమ మీ చర్మం తక్కువ నీటిని కోల్పోయేలా చేస్తుంది. కానీ శీతాకాలం మాత్రం మీ శరీరంలోని నీటిని పూర్తిగా ఖాళీ చేస్తుంది. ఇది లిపిడ్లు, ప్రోటీన్లను దెబ్బతీస్తుంది. దీంతో మీ చర్మం మరింత సున్నితంగా మారుతుంది. కోల్పోయిన లిపిడ్లను భర్తీ చేయడంలో సహాయపడటానికి నూనెలను ఉన్న మాయిశ్చరైజర్ ను ఎంచుకోండి. కోల్పోయిన చర్మ నూనెలను భర్తీ చేయడానికి సహాయపడే జోజోబా, పొద్దుతిరుగుడు, అవోకాడో, ఆముదం, కొబ్బరి, సెరామైడ్లు, స్క్వాలేన్ వంటి బొటానికల్ నూనెలను వాడటం మంచిది.
కఠినమైన క్లెన్సర్లను ఉపయోగించకండి
శీతాకాలంలో స్నానం చేసేటప్పుడు తేలికపాటి క్లీనర్లను మాత్రమే ఉపయోగించండి. చేతలను సబ్బుతో కడిగిన తర్వాత ఏవైన సబ్బు అవశేషాలు ఉంటే అవి లిపిడ్లను పీల్చడం, చర్మ ప్రోటీన్ కు హాని కలిగిస్తాయి. అందుకే తేలికపాటి నురుగు లిక్విడ్ హ్యాండ్ సబ్బులను మాత్రమే ఉపయోగించండి.
హైడ్రేటెడ్ గా ఉండకపోవడం
ఈ జీవైనా సరే బతకాలంటే ఖచ్చితంగా నీటిని తాగాల్సిందే. మీ చర్మానికి తగినంత నీరు లభించకపోతే చర్మం డీహైడ్రేట్ అవుతుంది. దీంతో చర్మం పొడిగా, బిగుతుగా, పొరలుగా మారుతుంది. పొడి చర్మం ముడతలకు ఎక్కువగా గురవుతుంది. అంతేకాదు శరీరంలోంచి విషదార్థాలు సరిగా బయటకు పోవు. అందుకే ఆరోగ్యకరమైన చర్మం కోసం ప్రతిరోజూ కనీసం 8 గ్లాసుల (2 లీటర్లు) నీటిని తాగాలని సలహానిస్తుంటారు. డీహైడ్రేషన్ వల్ల మన పెదవులు పగిలిపోయే అవకాశం కూడా తగ్గుతుంది.
తగినంత సన్స్క్రీన్ ను పెట్టకపోవడం
యూవీ రేడియేషన్ అకాల వృద్ధాప్యం, ఎండ వల్ల వచ్చే మచ్చలు, చల్లని గాలులు, వేడి గాలులు సంవత్సరం పొడవునా చర్మానికి హాని కలిగిస్తాయి. చలికాలంలో యువి రక్షణ అవసరం లేదని చాలా మంది అనుకుంటుంటారు. ఎందుకంటే ఈ సీజన్ లో యువికిరణాల ప్రభావం తక్కువగా ఉంటుందని అనుకుంటారు. కానీ ఈ సీజన్ లో కూడా యువికిరణాలు చర్మానికి హాని కలిగిస్తాయి. ఇంటి నుంచి బయలుదేరే ముందు బ్రాడ్-స్పెక్ట్రం సన్స్క్రీన్ ను తప్పకుండా అప్లై చేయండి.
skin care
చర్మ సంరక్షణను సరిగ్గా మెయింటెయిన్ చేయకపోవడం
మొదట చేయవలసిన ముఖ్యమైన విషయం హైడ్రేట్ గా ఉండటం. మీ ముఖాన్ని కడగడానికి మాయిశ్చరైజింగ్ చేసే తేలికపాటి క్లెన్సర్ ను ఉపయోగించండి. మేకప్ వేసుకునే వారు ముఖాన్ని శుభ్రం చేసుకోవడానికి మైసెల్లార్ నీటిని ఉపయోగించాలి. తర్వాత చర్మాన్ని తేలికగా మాయిశ్చరైజ్ చేయాలి. 24 నుంచి 72 గంటల ఆర్ద్రీకరణ సామర్థ్యాలు ఉన్న సహజ ఉత్పత్తులను ఎంచుకోండి. పొడి నుంచి సాధారణ చర్మం కోసం క్రీమ్ ఆధారిత మాయిశ్చరైజర్, జిడ్డుగల చర్మం కోసం జెల్ ఆధారిత మాయిశ్చరైజర్ ను ఉపయోగించండి. స్క్రబ్ చేయడానికి, ఎక్స్ఫోలియేట్ చేయడానికి కూడా ప్రయత్నించండి. ఆ తర్వాత సన్స్క్రీన్ ను వాడండి.