Skin Care Tips: వీటిని తింటే మొటిమలే కాదు.. మొటిమల మచ్చలు కూడా పోతాయి..
Skin Care Tips: టీనేజ్ లో మొటిమలు రావడం సర్వ సాధారణం. కానీ ఇవి చికాకును పుట్టిస్తాయి. అయితే కొన్ని రకాల ఆహారాలను తింటే మొటిమలు తగ్గడమే కాదు.. మొటిమల వల్ల అయిన మొండి మచ్చలు కూడా పోతాయి..
సాధారంగా మొటిమలు టీనేజర్లలోనే ఎక్కువగా వస్తాయి. ఇక మొటిమలతో పాటుగా వాటివల్ల ముఖంపై నల్లని మచ్చలు కూడా ఏర్పడతాయి. ఇవి అందాన్నంతా పాడుచేస్తాయి. అయితే ఈ మొటిమలు హార్మోన్లలో మార్పులు వచ్చినప్పుడు ఏర్పడతాయి. దీనికి తోడు వాతావరణ కాలుష్యం, చెడు ఆహారపు అలవాట్ల వల్ల కూడా మొటిమల సమస్య వస్తుంది. అయితే మొటిమలను, మొటిమల వల్ల కలిగే మచ్చలను తొలగించడంలో కొన్ని రకాల ఆహారాలు ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
కొబ్బరి నీరు (coconut water)
కొబ్బరి నీళ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. అంతేకాదు రెగ్యులర్ గా కొబ్బరి నీళ్లను తాగడం వల్ల మొటిమలు, నల్లని మచ్చలు వాటంతట అవే వదిలిపోతాయి. బాడీ కూడా హైడ్రేట్ గా ఉంటుంది.
దోసకాయ (Cucumber)
ఎక్కువ కారంగా ఉండే లేదా ఆయిలీ ఫుడ్స్ ను తిన్నా ముఖంపై మొటిమలు ఏర్పడతాయి. అయితే వీటిని తొలగించేందుకు కీరదోస ఎంతో సహాయపడుతుంది. కీరదోసను తీసుకోవడం వల్ల శరీరంలోని విష పదార్థాలు బయటకు పోతాయి. చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. దీనివల్ల శరీరానికి కావాల్సిన నీరు అందుతుంది.
lemon
నిమ్మకాయ (lemon)
నిమ్మకాయలో విటమిన్ సి ఎక్కువ మొత్తంలో ఉంటుంది. రెగ్యులర్ గా నిమ్మకాయను సలాడ్ రూపంలో గానీ.. నిమ్మరసం రూపంలో గానీ తాగితే.. ఇమ్యూనిటీ పవర్ పెరగుతుంది. అలాగే చర్మం నిగనిగా మెరిసిపోతుంది. మొటిమలు కూడా చాలా తొందరగా తగ్గిపోతాయి.
పప్పు ధాన్యాలు (Pulses)
పప్పుల్లో ప్రోటీన్లు, విటమిన్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. అందుకే వీటిని తరచుగా తినాలని డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. పప్పు దినుసులను తినడం వల్ల సెబమ్ ఉత్పత్తి స్థాయి నియంత్రణలో ఉంటుంది. దీంతో మొటిమలు తొందరగా తగ్గిపోతాయి. అయితే పప్పును ఎక్కువ నూనెతో ఉడికించకూడదు.
బ్రోకలీ (Broccoli)
బ్రోకలీ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, విటమిన్ ఎ లు పుష్కలంగా ఉంటాయి. ఆకుపచ్చ కూరగాయలను రెగ్యులర్ గా తినడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉండటంతో పాటుగా శరీరంలో అదనపు నూనె ఉత్పత్తి కాదు. అయితే బ్రోకలీని నూనెతో గానీ.. పచ్చిగా కానీ అస్సలు తినకూడదు. వీటిని ఉడికించి మాత్రమే తినాలి. అప్పుడే దీని ప్రయోజనాలు అందుతాయి.