Beauty Tips: పెళ్లిళ్ల సీజన్ వచ్చేసింది అమ్మాయిలూ.. ఈ చిట్కాలతో బ్రైట్ గా కనిపించండి!
Beauty Tips: పెళ్లిళ్ల సీజన్ వచ్చేసిందంటే హడావుడి అంతా అమ్మాయిలదే. అయితే అప్పటికప్పుడు రెడీ అవ్వటం కన్నా ముందు నుంచి ప్రిపేర్డ్ గా ఉంటే పెళ్లిళ్లలో మీరే హైలెట్ అవుతారు. అలాంటి చిట్కాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

పెళ్లిళ్ల సీజన్ వచ్చిందంటే అంటే హడావుడి అంతా అమ్మాయిలదే. తలకి పెట్టుకునే క్లిప్పు దగ్గరనుంచి కాళ్ళకి వేసుకునే చెప్పుల వరకు ప్రతిదీ ఎంతో శ్రద్ధ తీసుకుంటారు. పెళ్లికూతురని మించి పోయేలాగా తయారవ్వాలని అనుకుంటుంది ప్రతి అమ్మాయి. అందుకోసం ముందుగా మీ ముఖం అందంగా కనిపించే లాగా చూసుకోండి.
ఈ చిట్కాలతో మీ ముఖాన్ని బ్రైట్ గా మార్చుకోండి. పోషకాలతో కూడిన ఆహారం చర్మాన్ని మెరిసే లాగా చేస్తుంది. ముదురు రంగు ఆకుకూరలు మీ భోజనంలో ఎక్కువగా తీసుకోవడం వలన మీ చర్మంపై ఆరోగ్యకరమైన మెరుపు కనిపిస్తుంది.
ఎందుకంటే ముదురు ఆకుకూరలలో వయసుతో పోరాడే ఫైటో కెమికల్స్ పుష్కలంగా ఉంటాయి. అలాగే చర్మం పొడిబారి పోకుండా ఎప్పటికప్పుడు ముఖానికి మాయిశ్చరైజర్ రాసుకుంటూ ఉండండి. అలాగే మేకప్ తీసేసిన తర్వాత కచ్చితంగా పడుకునే ముందు మాయిశ్చరైసర్ రాసుకోండి.
ఇలా చేయటం వలన మీ స్కిన్ డ్రైనెస్ తగ్గుతుంది. అలాగే శరీరం డిహైడ్రేషన్ కి గురికాకుండా తరచుగా మంచినీళ్లు తాగుతూ ఉండండి. మంచినీళ్లు తాగటం వలన శరీరం కాంతివంతంగా కనిపిస్తుంది అనే సంగతి అందరికీ తెలిసిందే. అలాగే మెరిసే చర్మం కోసం ముఖాన్ని రోజు శుభ్రం చేసుకోవటం ఎంతో అవసరం.
చలికాలంలో మాయిశ్చరైజింగ్ క్లీన్జర్ వాడటం వలన చర్మాన్ని హైడ్రేట్ చేయడంలో ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే చర్మాన్ని ఎక్కువగా ఎక్స్పోలియేట్ చేయవద్దు. కంటి నిండా నిద్రపోవటం అనేది ముఖం కాంతివంతంగా కనిపించడానికి ఎంతో అవసరం.
అలాగే ఎప్పటికప్పుడు ముఖానికి ఆల్కహాలిక్ టోనర్ ని ఉపయోగించడం అవసరం. ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా సన్ స్క్రీన్ లోషన్ అప్లై చేసుకోండి. ముఖాన్ని ఎప్పటికప్పుడు చల్లని నీటితో క డుక్కోవడం వలన మీ ముఖం ఎప్పుడూ కాంతివంతంగా కనిపిస్తూ ఉంటుంది. వీటన్నింటికీ తోడు మంచి డ్రెస్ లైట్ మేకప్ తోడైతే పెళ్లిళ్లలో మీరే హైలైట్.