Kitchen Tips: ఇలా చేశారంటే జిడ్డుగా ఉన్న మిక్సీ జార్.. తళుక్కుమనాల్సిందే.
ప్రతీ ఒక్కరి ఇంట్లో మిక్సీ కచ్చితంగా ఉండాల్సిందే. ఒకప్పుడు కేవలం కొందరి ఇళ్లలో మాత్రమే కనిపించిన మిక్సీలు ఇప్పుడు ప్రతీ ఒక్కరి ఇంట్లో ఉంటున్నాయి. ఇదిలా ఉంటే వీటిని ఉపయోగించే క్రమంలో జిడ్డుగా మారుతుంటాయి. అయితే వీటిని కొన్ని సింపుల్ స్టెప్స్ కొత్తవాటిలా తళుక్కుమనేలా చేయొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..

మిక్సీలు, మిక్సీ జార్‌లను ఉపయోగించే క్రమంలో జిడ్డుగా మారుతుంటాయి. వంట గదిలో వచ్చే పొగ కారణంగా కాలక్రమేణ మిక్సీలు నల్లగా మారి చూడ్డానికి అదోలా కనిపిస్తాయి. అయితే వీటిని మళ్లీ శుభ్రంగా చేయడానికి నానా కష్టాలు పడాల్సి వస్తుంది. అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే కొత్త వాటిలో చేసుకోవచ్చు.

ఇందుకోసం ముందుగా మిక్సీలో ఎక్కడెక్కడ అయితే రంధ్రాలు ఉంటాయో వాటిలోకి నీరు వెళ్లకుండా ప్లాస్టర్‌తో మూసేయాలి. అనంతరం ఒక కప్పులో కొంత పేస్ట్, డిష్‌వాష్ లిక్విడ్‌తో పాటు కాస్త వెనిగర్‌ను వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక పాత బ్రష్‌ను తీసుకొని అంతకు ముందు తయారు చేసుకున్న లిక్విడ్ మిశ్రమాన్నిమిక్సీకి బాగా అప్లై చేయాలి. ఎక్కడెక్కడైతే నల్లగా జిడ్డుగా మారిందో అక్కడ బ్రష్‌తో బాగా రద్దాలి. ఆ తర్వాత ఒక మంచి క్లాత్‌ను తీసుకొని తుడి చేయాలి. అంతే జిడ్డుగా మారిన మిక్సర్ తళుక్కుమనడం ఖాయం.
ఇక మిక్సీ జార్‌లను కూడా సులభంగా శుభ్రం చేసుకోవచ్చు. మిక్సీ జార్ వెనక భాగంలో జిడ్డుగా మారుతుంది. దీనిని శుభ్రం చేసేందుకు జార్‌ను బోర్లించి అందులో వంట సోడ, డిష్ వాష్ లిక్విడ్, కాస్త వెనిగర్‌ను వేసి పాత బ్రష్‌తో రుద్దాలి. అనంతరం నీటితో బాగా కడిగేస్తే సరిపోతుంది. జిడ్డుమటుమాయం కావడం ఖాయం.
మిక్సీ జార్ లోపలి భాగాన్ని క్లీన్ చేసే సయంలో చేతులు కట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకే మిక్సీ జార్ లోపలి భాగాన్ని క్లీన్ చేయడానికి ఒక ట్రిక్ ఉంది. బ్లేడ్స్ కింద క్లీన్ అవ్వాలంటే ముందుగా జార్‌లో కొన్ని వేడి నీటితో పాటు నిమ్మకాయ రసాన్ని పిండాలి. ఆ తర్వాత కాసేపు మిక్సీని ఆన్ చేయాలి. అంతే జార్ శుభ్రమవుతుంది.