- Home
- Life
- Kitchen Hacks: పాత చపాతీ పీటను కడగడానికి మరీ కష్టపడొద్దు..ఇదొక్కటి చాలు నిమిషాల్లో మెరిసిపోతుంది
Kitchen Hacks: పాత చపాతీ పీటను కడగడానికి మరీ కష్టపడొద్దు..ఇదొక్కటి చాలు నిమిషాల్లో మెరిసిపోతుంది
Kitchen Hacks: చాలా మంది ఇళ్లల్లో రోజూ చపాతీలు చేస్తారు. కానీ కడగకుండానే పక్కన పెట్టేస్తారు. చపాతీ పీట, కర్ర శుభ్రం చేయకపోతే, పిండి పేరుకుపోయి నల్లగా, జిడ్డుగా మారుతుంది. జిడ్డుపై ఫంగస్ చేరి అనారోగ్యానికి దారితీయోచ్చు. అందుకే శుభ్రంగా ఉంచుకోవాలి.
15
Image Credit : AI Image
ఇంట్లోనే సులభమైన కిచెన్ టిప్స్
మనం ప్రతిరోజూ ఉపయోగించే చపాతీ పీట, కర్రను సరిగ్గా క్లీన్ చేయకపోతే, వాటిపై పిండి అంచులు పేరుకుపోయి నల్లటి, జిడ్డు మరకలు ఏర్పడతాయి. దీనివల్ల అవి చూడటానికి పాతవిగా, అసహ్యంగా కనిపిస్తాయి. అంతేకాకుండా వాటితోనే తరచూ చపాతీలు చేస్తే...వాటికి అంటుకున్న ఫంగస్ అంటుకుని అనారోగ్యానికి దారితీసే ప్రమాదం ఉంది. ఇన్ఫెక్షన్లు, కడుపునొప్పి రావొచ్చు. చెక్క పీట అయినా, రాయిదైనా సరే, ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. పాతవాటిని కొత్తవాటిలా మెరిపించాలంటే ఇది ట్రై చేయండి.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండి
25
Image Credit : our own
ముందుగా నీటితో శుభ్రం చేయాలి
అవసరాన్ని బట్టి, మీ చపాతీ పీట, కర్రను 10-15 నిమిషాల పాటు నీటిలో నానబెట్టండి. ఇలా చేయడం వల్ల వాటిపై పేరుకుపోయిన మురికి సులభంగా వచ్చేస్తుంది. కావాలంటే గోరువెచ్చని నీటిలో కూడా నానబెట్టొచ్చు. వీటిని శుభ్రం చేయడానికి మీకు నిమ్మరసం, డిటర్జెంట్, వెనిగర్ ఉంటే వేసుకోండి.
35
Image Credit : Getty
నిమ్మరసం మిశ్రమం రెడీ చేసుకోండి
పీట, కర్రపై ఉన్న నల్లటి మరకలు, మురికిని తొలగించడానికి నిమ్మరసం బాగా పనిచేస్తుంది. దీనికోసం, ముందుగా కొద్దిగా నీటిని గోరువెచ్చగా చేసి, అందులో ఒక నిమ్మకాయ రసాన్ని పిండండి. ఇప్పుడు అదే నీటిలో కొంచెం డిటర్జెంట్ పౌడర్ వేసి బాగా కలపండి. తర్వాత, స్పాంజ్ లేదా స్క్రబర్‌తో ఈ మిశ్రమంలో ముంచి పీట, కర్రను రుద్దండి. మరకలు మరీ పాతవిగా, మొండిగా ఉంటే స్టీల్ స్క్రబ్బర్ కూడా వాడొచ్చు. నిమ్మలోని యాసిడ్ నల్లటి మరకలను, జిడ్డును తొలగిస్తే, డిటర్జెంట్ మురికిని శుభ్రం చేస్తుంది. కొద్ది నిమిషాల్లోనే మీ పాత పీట, కర్ర మెరిసిపోతాయి.
45
Image Credit : Getty
వెనిగర్‌తో మొండి మరకలు మాయం
పీట, కర్రను శుభ్రం చేయడానికి మరో సులభమైన మార్గం వెనిగర్. దీనికోసం, గోరువెచ్చని నీటిలో 2-3 చెంచాల వెనిగర్ కలపండి. ఈ మిశ్రమంలో పీట, కర్రను సుమారు 5 నిమిషాల పాటు నానబెట్టండి. వెనిగర్ పాత మరకలు, జిడ్డు, బ్యాక్టీరియాను తొలగించడంలో సహాయపడుతుంది. ఆ తర్వాత స్పాంజ్, బ్రష్ లేదా స్క్రబర్‌తో బాగా రుద్ది కడగండి. మరకలు మరీ ఎక్కువగా ఉంటే, ఈ నీటిలో కొద్దిగా ఉప్పు కూడా కలపొచ్చు. ఉప్పు సహజ క్లీనర్‌గా పనిచేసి, మొండి మరకలను త్వరగా తొలగిస్తుంది. ఇది బ్యాక్టీరియాను నాశనం చేయడంలో కూడా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది.
55
Image Credit : Pinterest
ఎండలో ఆరబెట్టడం మర్చిపోవద్దు
శుభ్రం చేసిన తర్వాత, పీట, కర్రను మంచి నీటితో కడిగి, పొడి బట్టతో తుడవండి. ఆ తర్వాత కాసేపు ఎండలో పెట్టండి. ఇలా చేయడం వల్ల తేమ పూర్తిగా పోయి, పీట, కర్ర ఎక్కువ కాలం శుభ్రంగా, సురక్షితంగా ఉంటాయి.
Latest Videos

