Kitchen Tips: ఈ సమ్మర్ లో వీటిని అస్సలు బయటపెట్టకండి..లేకపోతే..!
life May 19 2026
Author: Nandini Arava Image Credits:Getty
Telugu
గుడ్డు బయట ఉంచొద్దు
గుడ్లు చాలా త్వరగా పాడవుతాయి. అందులోనూ ఈ వేసవిలో అస్సలు బయట ఉంచకూడదు. కుళ్లిపోయి వాసన వచ్చే ప్రమాదం ఉంది. అందుకే వీటిని ఫ్రిజ్‌లో పెట్టడమే సేఫ్. బయట ఉంటే నల్లగా అయిపోతాయి కూడా.
Image credits: google
Telugu
టమాటా
వంటగదిలో టమాటా లేని ఇల్లు ఉండదు. అయితే టమాటాలను ఫ్రిజ్‌లో పెడితే వాటి రుచి, సహజమైన గుణం పోతుంది. అందుకే బయటే ఉంచాలి.
Image credits: instagram
Telugu
బంగాళదుంప
బంగాళదుంపలను ఫ్రిజ్‌లో పెడితే 'అక్రైలమైడ్' అనే రసాయనం ఉత్పత్తి అవుతుంది. ఇది మన ఆరోగ్యానికి మంచిది కాదు. వీటిని నేరుగా వెలుతురు తగలని ప్రదేశాల్లో నిల్వ చేయాలి.
Image credits: AI
Telugu
బాదం
బాదం పప్పులను ఎక్కువ రోజులు గది ఉష్ణోగ్రతలో ఉంచితే త్వరగా పాడైపోతాయి. అందుకే బాదంను ఎప్పుడూ ఫ్రీజర్‌లో పెట్టడమే మంచిది.
Image credits: Getty
Telugu
వెన్న
వెన్న కూడా త్వరగా పాడైపోయే పదార్థమే. అందుకే దీన్ని రూమ్ టెంపరేచర్‌లో ఉంచకూడదు. ఫ్రిజ్‌లో పెట్టడమే సురక్షితం.
Image credits: Social Media
Telugu
ఉల్లిపాయ
ఉల్లిపాయలను నేరుగా వెలుతురు, వేడి తగిలే ప్రదేశాల్లో ఉంచకూడదు. చల్లగా, పెద్దగా వెలుతురు లేని ప్రదేశాల్లో నిల్వ చేయాలి.
Image credits: instagram
Telugu
పాలు
పాలను ఫ్రిజ్‌లోనే పెట్టాలి. లేదంటే అవి చాలా పాడైపోతాయి. అందులోనూ ఈ వేసవిలో అయితే ఇంకాస్త వేగంగా పాడవుతాయి. సో బయట ఉంచకుండా ఫ్రిజ్ లో పెట్టుకోవడం బెటర్.
Image credits: Getty
Telugu
అరటిపండు
అరటిపండ్లను ఎప్పుడూ ఫ్రిజ్‌లో పెట్టకూడదు. అలా పెడితే పండు త్వరగా నల్లగా మారిపోతుంది. తినడానికి పనికిరాదు.