హైహీల్స్ అంటే ఇష్టమా? ఈ విషయం తెలిస్తే ఇకనుంచి అస్సలు వేసుకోరు
అమ్మాయిలు మరింత అందంగా కనిపించాలని ఎన్నోరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ ప్రయత్నాల్లో హైహీల్స్ వేసుకోవడం ఒకటి. మరింత పొడుగ్గా కనిపించాలని కొందరు.. అందంగా ఉండాలని మరికొందరు హైహీల్స్ ను వేసుకుంటూ ఉంటారు. కానీ ఇవి ఆరోగ్యాన్ని ఎంతలా పాడుచేస్తాయో తెలుసా?
అమ్మాయిలు అందంగా కనిపించడానికి ఎన్నో చేస్తుంటారు. కాగా హైహీల్స్ కూడా అమ్మాయిలు మరింత ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తాయి. నిజానికి చాలా మంది అమ్మాయిలకు హైహీల్స్ అంటే పిచ్చి. ముఖ్యంగా హైట్ తక్కువగా ఉండే అమ్మాయిలు వీటిని ఖచ్చితంగా ధరిస్తారు. అయితే వీటిని అప్పుడప్పుడు వేసుకోవడం వల్ల వచ్చే నష్టమేమీ లేదు. కానీ వీటిని రెగ్యుటర్ గా వాడటం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి.
హైహీల్స్ ను క్రమం తప్పకుండా వేసుకోవడం వల్ల మడమలు, మోకాళ్లు, వీపులో విపరీతమైన నొప్పి కలుగుతుంది. అంతేకాదు హై హీల్స్ ను వేసుకుని నడవడం వల్ల మీ నడక కూడా మారుతుంది. అసలు హైహీల్స్ తో వచ్చే సమస్యలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
high heels
నడక భంగిమ మరింత దిగజారుతుంది.
ఫ్రాక్చర్ అయ్యే ప్రమాదం పొంచి ఉంది.
నడుము, మడమ, కాళ్లలో నొప్పి కలుగుతుంది.
మీ పాదాల నరాలు దెబ్బతినే ప్రమాదం కూడా ఉంది.
వెన్నెముక నొప్పి కలుగుతుంది.
high heels
హై హీల్స్ మొత్తమే వేసుకోకూడదా?
హైహీల్స్ వల్ల కలిగే ప్రమాదాల గురించి తెలుసుకున్న తర్వాత వీటిని వేసుకోవడం పూర్తిగా మానేయాలా? అన్న ప్రశ్న తలెత్తుతుంది. కానీ అనుకున్నంత ఈజీగా వీటిని ఆడవాళ్లు మానేయరు. అందుకే వీటిని కొనే ముందు కొన్ని జాగ్రత్తలను పాటించడం ముఖ్యం. అవేంటంటే?
హీల్స్ ను ముందు భాగం పూర్తిగా మూసేసిన వాటిని కొనకండి. ఎందుకంటే ఇలాంటి హీల్స్ వల్ల వేళ్లు ఒకదగ్గరకి అణుగుతాయి. ఇది పాదం ముందు భాగం కీళ్ళలో చాలా ఒత్తిడిని కలిగిస్తుంది.
స్టిల్లెటోస్ కంటే బ్లాక్ హీల్స్ ధరించడం మంచిది. బ్లాక్ హీల్స్ కంటే వెడ్జెస్ ను వేసుకోవడం మంచిది. ఎందుకంటే వీటిని వేసుకోవడం వల్ల ఒత్తిడి ఉండదు. అలాగే బరువు మడమ నుంచి కాలి వరకు సమానంగా ఉంటుంది.
ఈ వ్యాయామాలు మడమ నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తాయి: హైహీల్స్ వేసుకున్న మరుసటి రోజు వేళ్లు, పాదాలు, మడమలకు విశ్రాంతినిచ్చే కొన్ని వ్యాయామాలు చేయండి.
1.ఒక బంతిని తీసుకుని దాన్ని పాదం కింద ఉంచి.. దానిపై కాళ్లను ముందుకు, వెనుకకు ఉంచండి.
2. మడమను పైకి, కిందికి సాగదీయండి.
3. కుర్చీలో కూర్చొని కాలి వేళ్లను ముందుకు లాగండి.
4. లేచి నిలబడి ఒక పాదం మడమను పైకి లేపి ఒక పాదం మడమను కింద ఉంచండి. ఈ ప్రక్రియను పలుమార్లు చేస్తే నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.