పిస్తా పప్పులంటే ఇష్టమా? ఎక్కువగా తింటే రక్తపోటుతో సహా ఎన్నో సమస్యలొస్తయ్ జాగ్రత్త..
పిస్తా పప్పుల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. కానీ ఆరోగ్యానికి మంచివని ఎక్కువగా తింటే మాత్రం ఎన్నో అనారోగ్య సమస్యలొస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.
- FB
- TW
- Linkdin
Follow Us
)
పిస్తాపప్పులు టేస్ట్ లో బెస్ట్ అనిపించుకుంటాయి. అందుకే చాలా మంది వీటిని ప్రతిరోజూ తింటుంటారు. పిస్తా అత్యంత ప్రాచుర్యం పొందిన ఆహారాలలో ఒకటి. అందుకే వీటిని చాక్లెట్లు, ఐస్ క్రీం, క్యాండీలు, డెజర్ట్లు, ఇతర వంటలలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. పిస్తాల్లో ఎన్నో ముఖ్యమైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఈ పప్పులను తినడం వల్ల బరువు తగ్గడం సులువు అవుతుంది. అలాగే గుండె ఆరోగ్యం బాగుంటుంది. ఇవి గట్ ఆరోగ్యానికి కూడా సహాయపడతాయి. ఈ పిస్తా పప్పులు ఆరోగ్యానికి మేలు చేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ మోతాదుకు మించి తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటంటే..
అధిక రక్తపోటుకు దారితీయొచ్చు
టేస్టీగా ఉన్నాయని పిస్తా పప్పులను ఎక్కువగా తింటే మాత్రం అధిక రక్తపోటు సమస్య వస్తుందంటున్నారు నిపుణులు. అంతేకాదు.. వీటిని ఎక్కువగా తినడం వల్ల తేలికపాటి తలనొప్పి, కంటి చూపు మసకబారడం, గందరగోళం, మూర్ఛ వంటి సమస్యలను ఫేస్ చేయొచ్చు. సాల్టెడ్ పిస్తా తినడం వల్ల మీ రక్తంలో సోడియం స్థాయి బాగా పెరుగుతుంది. దీనివల్ల రక్తపోటుతో సహా ఎన్నో హృదయ సంబంధ వ్యాధులొచ్చే ప్రమాదం పెరుగుతుంది.
బరువు పెరుగుతారు
పిస్తాపప్పులను వివిధ వంటకాల్లో వాడుతుంటారు. దీనివల్ల మీరు మోతాదుకు మించి వీటిని తినొచ్చు. మీరు రోజూ తినాల్సిన లిమిట్ కంటే ఎక్కువగా తింటే మాత్రం ఫాస్ట్ గా బరువు పెరుగుతారు. ఒకవేళ మీరు బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నట్టైతే పిస్తాలను ఎక్కువగా తింటే ఏ మాత్రం ఫలితం ఉండదు.
మూత్రపిండాల్లో రాళ్ళు వచ్చే ప్రమాదం పెరుగుతుంది
పిస్తాపప్పులో ఆక్సలేట్స్, మెథియోనిన్ ఉంటాయి. పిస్తాలను ఎక్కువగా తినడం వల్ల శరీరంలో ఆక్సలేట్స్, మెథియోనిన్ విడుదల పెరుగుతుంది. ఆక్సలేట్ కాల్షియం, పొటాషియాన్ని బంధిస్తుంది. వీటివల్ల కాల్షియం, పొటాషియం లుఆక్సలేట్లుగా ఏర్పడతాయి. అలాగే మెథియోనిన్ సిస్టీన్ గా మారొచ్చు. ఈ సిస్టిన్ మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటానికి దారితీస్తాయి.
అలెర్జీలు
గింజలను తినడం వల్ల అలెర్జీ వచ్చే వారు పిస్తాలను తినడం మానుకోవాలి. చెట్ల కాయల అలెర్జీ వల్ల వాంతులు, మింగడానికి ఇబ్బంది, నోటిలో దురద, నాసికా రద్దీ, తిమ్మిరి, వికారం వంటి సమస్యలు వస్తాయి.
ఈ పిస్తా పప్పుల్లో విటమిన్ బి 6, విటమిన్ బి 1, ప్రోటీన్, ఫైబర్, రాగి, భాస్వరం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో కేలరీలు, కొవ్వులు తక్కువగా ఉంటాయి. అందుకే పిస్తాపప్పులను తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయంటాయనంలో ఎలాంటి సందేహం లేదు. కానీ వీటి నుంచి ఆరోగ్య ప్రయోజనాలను పొందాలనుకుంటే మాత్రం వీటిని తక్కువ మొత్తంలో తినాల్సి ఉంటుంది.