స్పైడర్ ప్లాంట్ ఇంటికి ఎంతో అందాన్ని తెస్తుంది. ఇది కార్బన్ మోనాక్సైడ్, ఫార్మాల్డిహైడ్ వంటి విష పదార్థాలను పీల్చుకుని గాలిని శుభ్రపరుస్తుంది.
స్నేక్ ప్లాంట్ రాత్రిపూట ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది. అందుకే దీన్ని పడకగదిలో ఉంచడం మంచిది. ఇది అలెర్జీలను రాకుండా అడ్డుకుంటుంది.
మనీ ప్లాంట్ ఇంట్లో కాలుష్యాన్ని తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. ఇది ఫార్మాల్డిహైడ్, బెంజీన్ వంటి హానికరమైన పదార్థాలను పీల్చుకుని గాలిని శుభ్రపరుస్తుంది.
పీస్ లిల్లీ చూసేందుకు ఒక అందమైన పూల మొక్క. ఇది ఇంట్లోని విష పదార్థాలను తగ్గిస్తుంది. ఇది ఏసీ గదులకు చాలా మంచిది.
కలబంద మొక్క ఇంట్లో చాలా సులువుగా పెరుగుతుంది. ఇది ఇంటి గాలిలోని రసాయనాలను తొలగిస్తుంది. దీన్ని బాల్కనీలో పెంచడం మంచిది.
అరెకా పామ్ ఇంట్లోనే పెంచుకోవచ్చు. ఇంట్లోని పొడి గాలిని తేమవంతంగా చేస్తుంది. ఇది దుమ్మును ఫిల్టర్ చేస్తుంది.
మీ ఇంట్లోకి దుమ్ము , పొగ ఎక్కువగా వస్తుంటే రబ్బర్ ప్లాంట్‌ను ఇంట్లో పెంచండి. ఇది గాలిలోని హానికరమైన కణాలను తగ్గిస్తుంది.
బోస్టన్ ఫెర్న్ ఇంట్లో పెంచేందుకు బెస్ట్ మొక్క. ఇది తేమను నియంత్రించి విష పదార్థాలను తొలగిస్తుంది.
ఇంగ్లీష్ ఐవీ మొక్క చిన్నగానే పెరుగుతుంది. ఇది గాలిలోని దుమ్ము కణాలు, ఫంగస్‌ను తొలగించి అలెర్జీలు రాకుండా అడ్డుకుంటుంది.
మనీ ప్లాంట్ వేగంగా పెరిగేందుకు ఇలా చేయండి
బీట్‌రూట్ రసంలో వీటిని కలిపి రాస్తే.. ముఖం చిటికెలో మెరిసిపోతుంది!
పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్ డి ఆహారాలు
లేటెస్ట్ డిజైన్ వెండి పట్టీలు.. వెయిట్ కూడా చాలా తక్కువ!