పోచంపల్లి చీరలు వాటి ఇక్కత్ నేత, ప్రత్యేక డిజైన్లకు ప్రసిద్ధి. తెలుపు రంగు చీరపై ఎరుపు రంగు పోచంపల్లి డిజైన్ అదిరిపోతుంది.
మల్టీకలర్‌లో ఉన్న ఈ పోచంపల్లి ఇక్కత్ చీర చూసేకొద్దీ ఇంకా చూడాలనిపించేలా ఉంది. ఇలాంటి చీర మీకు 8 వేల రూపాయల నుంచి 15 వేల రూపాయలలోపు లభిస్తుంది.
చాక్లెట్ గోల్డెన్ బోర్డర్‌తో ఉన్న సిల్వర్ సిల్క్ చీరపై లైట్ పోచంపల్లి డిజైన్ చేశారు. ఇది కట్టుకుంటే రాయల్ లుక్ రావడం ఖాయం. దీని ఖరీదు రూ.8 వేల వరకు ఉంటుంది.
పసుపు రంగు పోచంపల్లి సిల్క్ చీరకు గంగా యమున కంచి బోర్డర్ ఇచ్చారు. ఈ చీర కట్టుకుంటే ఎంతో అందంగా కనిపిస్తారు. దీని పదివేల రూపాయల వరకు ఉండొచ్చు.
కొత్త పెళ్లికూతురికి సెట్ అయ్యే పోచంపల్లి రెడ్ సిల్క్ చీర ఇది. ఇలాంటి చీర కట్టుకుంటే ఆ లుక్కే వేరు. దీని ధర ఆరు వేల రూపాయల వరకు ఉంటుంది.
కంటికి ఇంపుగా ఉండే ఈ గ్రీణ్ పోచంపల్లి చీర ఎవరికైనా ఇట్టే నచ్చేస్తుంది. దీని ధర అయిదు వలే రూపాయల నుంచి మొదలవుతుంది.
నీలం, పసుపు రంగుల మిళితమైన అందమైన పోచంపల్లి చీర ఇది. దీన్ని రూ.9,500గా ఉంది. ఇవి ఎవరు కట్టుకున్నా అందంగా ఉంటుంది.
ఈ చీర కలర్ కాంబినేషన్ ఎవరికైనా నచ్చేస్తుంది. కొత్త పెళ్లికూతుళ్లకు ఇది సెట్ అవుతుంది. దీని రూ.8,500గా ఉంది.