పండ్లు తిన్నవెంటనే నీళ్లను తాగుతున్నారా..? అయితే మీ పని మటాషే..!
పండ్ల ద్వారా మన శరీరానికి కావాల్సిన ఎన్నో ప్రోటీన్లు అందుతాయి. అందుకే వీటిని రోజూ తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే పండ్లు తిన్న వెంటనే నీళ్లను తాగడం మాత్రం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదంటున్నారు నిపుణులు. ఎందుకంటే..

fruits
పండ్లలో ఎన్నో పోషకాలుంటాయి. వీటిని రోజూ తినడం వల్ల మన శరీరానికి కావాల్సిన పోషకాలు పుష్కలంగా అందుతాయి. దీంతో శరీరం సక్రమంగా పనిచేస్తుంది. పండ్లు ఇమ్యూనిటీ పవర్ ను కూడా పెంచుతాయి. కొన్ని రకాల పండ్లు బరువును తగ్గించడానికి కూడా సహాయపడతాయి. ఇంతేకాదు పండ్లు మన ఆరోగ్యానికి చేసే మేలు ఎంతో ఉంది. అయితే కొంతమంది పండ్లు తిన్న వెంటనే నీళ్లను తాగుతుంటారు. దీనివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. అవేంటో తెలుసుకుందాం పదండి..
జీర్ణక్రియపై చెడు ప్రభావం
పండ్లు తిన్న వెంటనే నీళ్లను తాగితే జీర్ణక్రియపై చెడు ప్రభావం పడుతుంది. దీనివల్ల అజీర్థి, ఎసిడిటీ వంటి సమస్యలు వస్తాయి. అంతేకాదు అప్పుడే నీళ్లను తాగితే పండ్ల ద్వారా గ్రహించిన పోషకాలు శరీర భాగాలకు చేరవు. దీనివల్ల కడుపులో సమస్యలు వస్తాయి. అందుకే పండ్లు తిన్నవెంటనే నీళ్లను తాగకండి. కావాలంటే గంట తర్వాత తాగండి.
acidity
ఎసిడిటీ
మీరు ఎలాంటి పండ్లను తిన్నా.. అప్పుడే నీళ్లను తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు. దీనివల్ల ఎంజైమ్లు, జీర్ణ రసాల పనితీరు సరిగ్గా ఉండదు. దీంతో ఎసిడిటీ సమస్యకు దారితీస్తుంది.
పొట్ట తిమ్మిరి
పండ్లు తిని ఆ వెంటనే నీళ్లను తాగితే.. గ్యాస్ సమస్య వస్తుంది. అంతేకాదు కడుపు నొప్పి, అపానవాయువు ఎక్కువగా రిలీజ్ అవుతుంది. నీళ్ల వల్ల పొట్టలోని ఆమ్లాలు పలుచబడి ఈ సమస్యలు వస్తాయి.
రక్తంలో చక్కెర స్థాయిలు
రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడానికి పండ్లను తిన్న వెంటనే నీళ్లను తాగడం కూడా ఒక కారణమే అంటున్నారు నిపుణులు. ఎందుకంటే పండ్లు తిన్న వెంటనే నీళ్లను తాగితే..అవి సరిగ్గా జీర్ణం కావు. దీంతో అవి కొవ్వుగా మారుతాయి. ఇవే బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగడానికి దారితీస్తాయి. పండ్లు తిన్నప్పుడల్లా నీళ్లను ఇలాగే తాగితే ఊబకాయం, డయాబెటీస్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఆహారం సరిగ్గా అరగదు
మనం తిన్న ఆహారాలు అరగడానికి జీర్ణ రసాలు ఉపయోగపడతాయి. అయితే ఇలా నీటిని తాగితే.. పొట్టలోని జీర్ణ రసాలు పలుచగా అయ్యి తిన్నది సరిగ్గా అరగదు. దీంతో గుండెల్లో మంట పుడతుంది.