side effects of ajwain: రోజూ వాము తింటే ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు జాగ్రత్త..
side effects of ajwain: మసాలా దినుసుల్లో ఒక్కటైన వాము ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. అలా అని దీన్ని ప్రతి రోజూ తింటే మాత్రం ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

side effects of ajwain: వాము గురించి తెలియనివారంటూ ఎవరూ ఉండరేమో కదా. దీన్ని మసాలా దినుసులాగే కాదు.. ఔషదంలా కూడా ఉపయోగిస్తుంటారు. వాము మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అందుకే దీన్ని జనాలు తరచుగా తింటూ ఉంటారు.
వాము దగ్గు, జలుబు, ఉదర సంబంధ సమస్యలతో పాటుగా విష జ్వరాలను కూడా ఇట్టే తగ్గిస్తుంది. అలాగే ఇది అధిక బరువును తగ్గించడానికి కూడా ఎంతో సహాయపడుతుంది.
వాములో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ అధిక మొత్తంలో ఉంటాయి. వీటిని నానబెట్టి లేదా గింజలను అలాగే తినొచ్చుు.
అయితే ఇన్ని ప్రయోజనాలున్న వామును అవసరానికి మించి తింటే మాత్రం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి వామును రోజూ తినడం వల్ల కలిగే నష్టాలేంటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం పదండి.
గుండెల్లో మంట, గ్యాస్ వంటి దీర్ఘకాలిక సమస్యలున్న వారు వామును తీసుకోవడం మనం చూస్తుంటాం. అయితే ఈ సమస్యలున్నవారు వామును ఎక్కువగా తీసుకుంటే మాత్రం యాసిడ్ రిఫ్లక్స్ వంటి అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు గ్యాస్ సమస్య మరింత ఎక్కువ అవుతుంది. అలాగే గుండె నొప్పి కూడా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
అలెర్జీ సమస్య ఉన్నవారు వామును తింటే వికారం, తల తిరగడం వంటి సమస్యలతో బాధపడాల్సి వస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వాము తింటే నోటిలో మంట పుడుతుంది. దీనికి కారణం వాములు ఉండే బయోయాక్టివ్ సమ్మేళనాలు. దీన్ని మితిమీరి తింటే నోట్లు పుండ్లు ఏర్పడతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చిరిస్తున్నారు.
ముఖ్యంగా గర్బిణులు ఎట్టి పరిస్థితిలో వామును తీసుకోకూడదు. ఎందుకంటే ఇది బిడ్డ ఎదుగుదలకు అడ్డుపడుతుంది. కాబట్టి గర్భిణులు వాముకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.