ఫాస్ట్ గా బరువు తగ్గడానికి సాత్విక ఆహారమే బెస్ట్ ..
బరువు తగ్గాలని ఎన్నో.. ఎన్నెన్నో చేస్తుంటారు. ఇష్టమైన ఆహారాలను వదులుకుంటారు. రెగ్యులర్ గా వ్యాయామం చేస్తుంటారు. అయితే కొన్ని రకాల ఆహారాలను తిన్నా ఫాస్ట్ గా బరువు తగ్గుతారు తెలుసా..
రెగ్యులర్ గా వ్యాయామం చేస్తూ.. బయటి ఫుడ్ ను తినడం మానుకుంటే ఆరోగ్యంగా బరువు తగ్గుతారు. అంతేకాదు సాత్విక ఆహారం తింటే కూడా తొందరగా బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. ఈ ఫుడ్స్ మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడతాయి. ఎన్నో అనారోగ్య సమస్యలను కూడా దూరం చేస్తాయి.
బరువు తగ్గడానికి సహాయపడే సాత్వికాహారాలు
సాత్విక ఆహారంలో కూరగాయలు, చిక్కుళ్లు, పండ్లు, గింజలు, విత్తనాలు, మొలకెత్తిన తృణధాన్యాలు, తాజా పండ్ల రసాలు, మూలికా టీ లతో పాటుగా పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాలు ఉంటాయి. ముడి సలాడ్ ఖచ్చితమైన సాత్విక ఆహారం మంచి ఎంపిక కాదు. ముఖ్యంగా గట్ కు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నట్టైతే వీటిని తీసుకోకపోవడమే మంచిది. అందుకే మన ఆరోగ్య పరిస్థితిని బట్టి ఆహారాలను ప్లాన్ చేసుకోవడం మంచిది.
సాత్విక ఆహారం వల్ల వచ్చే కడుపు ఉబ్బరాన్ని ఎలా నివారించాలి?
చక్కెరను ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం సమస్య వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే కొన్ని రకాల ఆహారాలను తీసుకున్నప్పుడు కూడా వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అతిగా తిన్నప్పుడు ఈ సమస్య రావడం సర్వ సాధారణం. మీల్ స్పేసింగ్ ప్రాక్టీస్ చేస్తే కడుపు ఉబ్బరం నుంచి బయటపడొచ్చు. అంటే మీరు తినే ఆహారంలో చక్కెర, పిండి పదార్థాలు ఎక్కువగా ఉండకుండా చూసుకోవాలి. అలాగే భోజనానికి గంట ముందు లేదా భోజనం చేసిన గంట తర్వాతే నీళ్లను తాగాలి. ఒకే భోజనంలో రకరకాల ఆహారాలను కలిపి తినకూడదు. భోజనం చేసిన వెంటనే ఎలాంటి అల్పాహారాన్ని తినకూడదు. నిద్రపోయే సమయంలో ఎక్కువ సేపు కూర్చోవడం, లేదా తినకపోవడం వల్ల కడుపు ఉబ్బరాన్ని నివారించొచ్చని నిపుణులు చెబుతున్నారు.
భారీ ఆహారాలు, స్వీట్లను తినడం, మధ్య మధ్యలో అల్పాహారాన్ని తినడం, రాత్రిళ్లు ఆలస్యంగా పడుకోవడం, పొద్దున్న లేట్ గా లేవడం, అనారోగ్యకరమైన ఆహారాలను తినడం వంటి అలవాట్లను మానుకోవాలి. అలాగే ప్రాసెస్ చేసిన, చల్లని, ప్రీ ప్యాక్ చేయబడ్డ, ఫ్లేవర్లు, మసాలాలు ఎక్కువగా ఉండే, వేయించిన, ఎక్కువ చక్కెర, ఉప్పు ఉండే ఆహారాలను అసలే తినకూడదు. ఆరోగ్యంగా, ఫిట్ గా ఉండేందుకు తియ్యని రసాలు, కార్భోనేటెడ్ పానయాలు, మద్యానికి దూరంగా ఉండాలి.
దీని ద్వారా బరువు తగ్గడం ఎలా?
మనం తినే ఆహార పరిమాణం ద్వారే కాకుండా.. ఫుడ్ స్మెల్, ఫుడ్ ప్లేట్, చిన్న చిన్న భాగాలను చేసుకుని తినడం, నెమ్మదిగా తినడం వంటి పద్దతుల ద్వారా కడుపు చాలా త్వరగా నిండుతుంది. మన శరీరంలో మనం తీసుకున్న అదనపు కేలరీలను ఒకేసారి నిల్వ చేస్తుంది. దీనివల్ల శరీరంలో చక్కెర స్థాయిలు ఉన్నపాటుగా పెరుగుతాయి. అదనపు చక్కెర కొవ్వుగా నిల్వ ఉంటుంది. ఈ పద్దతిని ఫాలో అవ్వడం వల్ల భాగాల నియంత్రణతో.. ఆ క్షణంలో మన శరీరానికి అవసరమైన కేలరీలు, పోషకాలు అందుతాయి. ఇది కేలరీలు నిల్వ ఉండకుండా చేస్తుంది.
నెమ్మదిగా తింటే బరువు తగ్గుతారు
నెమ్మదిగా తినే అలవాటు కూడా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇలా తినడం వల్ల మీ కడుపు తొందరగా నిండుతుంది.సంతృప్తి అనుభూతిని పొందుతారు. మీరు తినే ఆహారాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేయడానికి 32 సార్లు నమలండి. దీనివల్ల ఫుడ్ సులువుగా జీర్ణం అవుతుంది. గట్ పై ఒత్తిడి తగ్గుతుంది. దీంతో మీరు సులభంగా బరువు తగ్గుతారు.