MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Life
  • Kitchen Hacks: వంటింట్లోని ఈ పదార్థంతో మిక్సీ బ్లేడ్లకు పది నిమిషాల్లో పదును పెట్టేయండిలా

Kitchen Hacks: వంటింట్లోని ఈ పదార్థంతో మిక్సీ బ్లేడ్లకు పది నిమిషాల్లో పదును పెట్టేయండిలా

Kitchen Hacks:  మిక్సీ జార్ ఎక్కువ కాలం వాడాక వాటి బ్లేడ్లు మొద్దుబారిపోవడం జరుగుతుంది. అలాంటప్పుడు ఇంట్లో ఉండే పదార్థంతోనే ఆ బ్లేడ్లకు పదును పెట్టవచ్చు. దీనికి ఏమీ ఖర్చు కాదు కూడా. 

2 Min read
Author : Haritha Chappa
Published : May 25 2026, 05:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
మిక్సీ జార్ బ్లేడ్లు మొద్దబారిపోతే...
Image Credit : Getty

మిక్సీ జార్ బ్లేడ్లు మొద్దబారిపోతే...

వంటగదిలో ఉండే ఎలక్ట్రానిక్ వస్తువుల్లో మిక్సీ ఒకటి. రోజూ చట్నీలు, మసాలాలు రుబ్బడానికి దీన్ని వాడుతూనే ఉంటాం. ఇలా ఎక్కువ కాలం పాటూ వాడటం వల్ల మిక్సీ బ్లేడ్లు మొద్దుబారిపోతాయి. అప్పుడు ఏం చేయాలో తెలియక కంగారు పడతారు.  రుబ్బుతున్నా పదార్థాలు మెత్తగా అవ్వవు. దీనివల్ల మోటార్‌పై భారం పడుతుంది. బ్లేడ్లు మొద్దుబారగానే మెకానిక్ దగ్గరకు తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంట్లోని ఒకే ఒక్క వస్తువుతో బ్లేడ్లకు మళ్లీ పదును పెట్టొచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఇలా చేయండి
Image Credit : Getty

ఇలా చేయండి

మిక్సీ జార్ బ్లేడ్లను పదును పెట్టేందుకు రాతి ఉప్పు లేదా కల్లుప్పు వాడాలి. ఇది మార్కెట్లో చాలా తక్కువ ధరకు లభిస్తుంది. కల్లుప్పుతో మీరు జార్ బ్లేడ్‌ను చాలా తేలికగా పదును పెట్టవచ్చు. ఇది ఒక అద్భుతమైన స్క్రబ్బర్‌లా పనిచేస్తుంది. మిక్సీ జార్ బ్లేడ్‌కు పదును పెట్టాలంటే ఆ జార్‌లో కల్లుప్పు వేయండి. బ్లేడ్లు మునిగిపోయే వరకు ఉప్పు నింపాలి. తర్వాత మూత గట్టిగా పెట్టి మిక్సీ స్విచ్ ఆన్ చేయండి. మిక్సీని ఒకేసారి కాకుండా, ఆపుతూ ఆన్ చేస్తూ తిప్పాలి. చివరిగా, రెండు నిమిషాల పాటు మిక్సీని హై స్పీడ్‌లో తిప్పండి. దీంతో ఉప్పు పూర్తిగా పొడి అవుతుంది. ఇలా ఉప్పును మిక్సీ పట్టడం వల్ల, ఉప్పు రాపిడికి బ్లేడ్లు కత్తిలా పదునెక్కుతాయి. 

Related Articles

Related image1
Dress Colours: విపరీతమైన ఎండల్లో బయటకు వెళ్తున్నారా? ఈ 3 రంగుల్లో ఉన్న దుస్తులు వేసుకోవద్దు
Related image2
Mercury Transit: మిథునంలోకి బుధుడు.. ఈ 4 రాశుల వారికి ఉద్యోగ వ్యాపారాల్లో భారీ లాభాలు
34
అల్యూమినియం ఫాయిల్ తో
Image Credit : Getty

అల్యూమినియం ఫాయిల్ తో

కల్లుప్పు వాడడం ఇష్ట లేకపోతే, అల్యూమినియం ఫాయిల్ కూడా వాడొచ్చు. అల్యూమినియం ఫాయిల్‌ను చిన్న చిన్న ఉండలుగా చేసి మిక్సీ జార్‌లో వేయండి. ఒక నిమిషం పాటు మిక్సీని వేగంగా తిప్పండి. ఫాయిల్ ముక్కలకు, బ్లేడ్లకు మధ్య జరిగే ఘర్షణ వల్ల మొద్దుబారిన బ్లేడ్ల అంచులు పదునెక్కుతాయి.

44
చివరిగా చేయాల్సింది ఇదే
Image Credit : Getty

చివరిగా చేయాల్సింది ఇదే

జార్‌లో ఉప్పు లేదా అల్యూమినియం ఫాయిల్ వేసి బాగా తిప్పిన తర్వాత జార్‌ను శుభ్రం చేయడం మర్చిపోవద్దు. అయితే  పొడి చేసిన ఉప్పును వంటకు తిరిగి వాడుకోవచ్చు. జార్ నుండి ఉప్పు తీసేశాక, నీళ్లు, కొద్దిగా డిష్‌వాష్ జెల్ వేసి ఒకసారి మిక్సీని తిప్పండి. ఆ తర్వాత శుభ్రమైన నీటితో జార్‌ను కడగండి. జార్‌ను బోర్లించి ఆరబెట్టండి.  బ్లేడ్లపై నీరు ఉంటే, అవి తుప్పు పట్టే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
జుట్టుకు నూనె రాస్తున్నారా? ఈ తప్పులు చేస్తే జుట్టు పెరగడం కాదు రాలుతుంది
Recommended image2
రోజూ ఒక పెగ్ ఆల్కహాల్ తాగితే గుండెకు మంచిదా? అసలు నిజమేంటి?
Recommended image3
Milk at Night: రాత్రి పడుకునే ముందు పాలు తాగితే నిజంగా నిద్ర బాగా పడుతుందా?
Related Stories
Recommended image1
Dress Colours: విపరీతమైన ఎండల్లో బయటకు వెళ్తున్నారా? ఈ 3 రంగుల్లో ఉన్న దుస్తులు వేసుకోవద్దు
Recommended image2
Mercury Transit: మిథునంలోకి బుధుడు.. ఈ 4 రాశుల వారికి ఉద్యోగ వ్యాపారాల్లో భారీ లాభాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved