డైటింగ్ చేసేవారు డిన్నర్ లో వీటిని తింటే తొందరగా బరువు తగ్గుతారు..
బరువు తగ్గాలని డైటింగ్ చేసేవారు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే డైటింగ్ చేసేటప్పుడు డిన్నర్ లో కొన్ని రకాల ఆహారాలను తీసుకుంటే తొందరగా బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు.

బరువు తగ్గేందుకు కొంతమంది రోజూ గంటల తరబడి వ్యాయామం చేస్తూ.. ఒకపూటో రెండు పూటలో తింటూ ఉంటారు. బరువును తగ్గించేందుకు డిటాక్స్ వాటర్ కూడా ఉపయోపడతాయి. అయితే చాలా మంది బరువు తగ్గాలని రాత్రి పూట మొత్తానికే తినరు. దీని వల్ల బరువు తగ్గడం సంగతి పక్కన పెడితే.. ఎన్నో రోగాలొచ్చే అవకాశం ఉంది. శరీరానికి పోషకాలందక ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే బరువు తగ్గాలని డైటింగ్ చేసే వారు డిన్నర్ లో ఈ ఆహారానలు తింటే ఆరోగ్యంగా బరువు తగ్గుతారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఓట్స్ ఇడ్లీ (Oats Idli)
డిన్నర్ లో ఓట్స్ తింటే మంచిది. వీటిలో కార్బోహైడ్రేట్లు చాలా తక్కువగా ఉండి, ప్రోటీన్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇది బరువు తగ్గడానికి ఎంతో సహాయపడుతుంది. ఈ ఇడ్లీలను రుచికరమైన చట్నీతో తినొచ్చు. ఇది బరువును తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది.
గుడ్లు (Eggs)
గుడ్లలో ప్రోటీన్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. విటమిన్లు కూడా పుష్కలంగా ఉంటాయి. డైటింగ్ చేసేవారు రెగ్యులర్ గా ఒక ఉడకబెట్టిన గుడ్డును తినడం వల్ల చక్కటి ఫలితం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం డిన్నర్ లో ఒక ఉబకబెట్టిన గుడ్డును చిన్న చిన్న పీసెస్ గా చేసి సలాడ్ తో కలిపి తినండి. ఇది శరీరానికి ప్రయోజనకరంగా ఉంటుంది.
కీటో కొబ్బరి అన్నం (Keto Coconut Rice)
బరువు తగ్గేందుకు కీటో కొబ్బరి అన్నం కూడా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. కాలీఫ్లవర్, కొబ్బరి, ఆవాలు, కరివేపాకు, ఉప్పు, నిమ్మరసం, శెనగలు, జీలకర్ర, మిరియాలతో ఈ వంటకాన్ని రెడీ చేస్తారు. అన్నం తినకుండా ఉండలేని వారు రాత్రి పూట ఈ కీటో కొబ్బరి అన్నాన్ని తినొచ్చు. ఇది మీ కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది.
వెజిటేబుల్ సూప్ (Vegetable soup)
బరువు తగ్గాలనుకునే వారు రాత్రి పూట వెజిటేబుల్ సూప్ ను తాగితే చాలా ఫాస్ట్ గా బరువు తగ్గడమే కాదు ఆరోగ్యం కూడా బాగుంటుంది. దీనిని రకరకాల కూరగాయలతో తయారుచేస్తారు. ఈ సూప్ లో ఎన్నో రకాలు విటమిన్లు, ప్రోటీన్లు, ఖనిజాలు, కాల్షియం వంటి ముఖ్యమైన పోషకాలుంటాయి. ఇది మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. బరువును కూడా సులువుగా తగ్గిస్తుంది. కావాలనుకుంటే రాత్రిపూట ఒక కప్పు ఉడకబెట్టిన కూరగాయలను తినొచ్చు. అయితే దీనిలో ఏ మాత్రం నూనెను ఉపయోగించకూడదు.
ఫిష్ కర్రీ (Fish curry)
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే బరువు తగ్గాలనుకునే వారు నూనె లేకుండా ఫిష్ కర్రీని చేసుకుని తింటే మంచి ఫలితం ఉంటుంది. ఇది బరువును తగ్గించడంతో పాటుగా శరీరానికి ఎన్నో పోషకాలను కూడా అందిస్తుంది.
కాలీఫ్లవర్ (Cauliflower)
బరువు తగ్గాలనుకునే వారికి కాలిఫ్లవర్ ఎంతో మేలు చేస్తుంది. ఇందుకోసం కాలిఫ్లవర్ ను కాల్చి లేదా .. తక్కువ నూనెతో వంటను చేసుకుని తినొచ్చు. ఇది వేగంగా బరువును తగ్గిస్తుంది. ముఖ్యంగా దీని ద్వారా లభించే పోషకాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. డైటింగ్ చేసే వారు డిన్నర్ లో దీన్ని తింటే మంచి ఫలితం ఉంటుంది.
ఓట్స్ (Oats)
ఓట్స్ కూడా బరువును తగ్గించేందుకు ఎంతో సహాయపడతాయి. ఓట్స్ ను కూరగాయలతో టేస్టీగా తయారుచేసుకుని తినొచ్చు. దీన్ని ప్రతిరోజు రాత్రి తిన్నా ఎలాంటి హాని జరగదు. అందులోనూ వీటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి కొవ్వును సులువుగా కరిగిస్తాయి. అంతేకాదు ఓట్స్ కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది. మొత్తంగా ఓట్స్ బరువును తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది.
నీళ్లను బాగా తాగాలి
ప్రతి రోజూ 8 నుంచి 10 గ్లాసుల నీటిని ఖచ్చితంగా తాగాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. నీళ్లు ఎన్నో రోగాలను దూరం చేస్తాయి. ముఖ్యంగా డైటింగ్ చేసేవారు నీళ్లను పుష్కలంగా తాగితే ఆరోగ్యంగా ఉండటమే కాదు.. సులువుగా బరువు కూడా తగ్గుతారు. నీరు శరీరాన్ని హైడ్రైట్ గా ఉంచడంతో పాటుగా శరీరంలో ఉండే విష పదార్థాలను కూడా తొలగిస్తుంది. అందుకే తొందరగా బరువు తగ్గడానికి, ఆరోగ్యంగా ఉండటానికి నీళ్లను పుష్కలంగా తాగాలి.