PM shram yogi mandhan yojana రూ.55 కడితే నెలకు ₹3,000 పెన్షన్! ఎవరెవరు అర్హులో తెలుసా?
సామాజిక భద్రతలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అసంఘటిత కార్మికుల కోసం ఈ పెన్షన్ పథకం తెచ్చింది. వృద్ధాప్యంలో శ్రామికులకు భరోసానిచ్చే ఈ పథకంతో తక్కువ ఖర్చుతో నెలవారీ పెన్షన్ పొందే సౌకర్యం ఉంది. శ్రామికులు నెలనెలా కొంత డబ్బు జమ చేస్తే, ప్రభుత్వం అంతే మొత్తం అందజేసి చరమాంకంలో పెన్షన్ ఇస్తుంది.

అసంఘటిత కార్మికుల కోసం ఈ పెన్షన్
ఈ పథకం కింద నెలకు 55 రూపాయలు కడితే 60 ఏళ్ల తర్వాత 3 వేలు పెన్షన్ వస్తుంది. ఈ పథకం అసంఘటిత కార్మికులకు వృద్ధాప్యంలో ఆర్థిక భరోసా ఇస్తుంది. తక్కువ ఖర్చుతో నెలవారీ పెన్షన్ పొందొచ్చు. మీరు డబ్బు కడితే ప్రభుత్వం కూడా కడుతుంది.
అర్హులు ఎవరంటే..
స్వీపర్లు, చాకళ్లు, రిక్షా కార్మికులు, ఇటుక బట్టీ కార్మికులు దీనికి అర్హులు. 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉన్నవాళ్లు ఈ పథకంలో చేరొచ్చు. నెల ఆదాయం 15 వేల లోపు ఉండాలి. 18 ఏళ్ల వయసులో చేరితే నెలకు 55 రూపాయలు కట్టాలి. వయసు పెరిగే కొద్దీ కట్టే డబ్బులు పెరుగుతాయి. 60 ఏళ్లు దాటితే 3 వేలు పెన్షన్ వస్తుంది.
ఈ పథకం 2019లో మొదలైంది. కార్మికులకు ఇది చాలా ఉపయోగకరమైనది. మీరు 200 కడితే ప్రభుత్వం కూడా 200 కడుతుంది. 18 ఏళ్ల నుంచే ఇన్వెస్ట్ చేయొచ్చు. 29 ఏళ్ల వయసులో మొదలుపెడితే నెలకు 100 కట్టాలి. పెన్షన్ మొత్తం మీరు కట్టే డబ్బుపై ఆధారపడి ఉంటుంది.
ఈ పథకం కోసం దగ్గరలోని కామన్ సర్వీస్ సెంటర్లలో సంప్రదించాలి. మరింత సమాచారం కోసం ప్రభుత్వ వెబ్‌సైట్ లేదా కామన్ సర్వీస్ సెంటర్‌ను సంప్రదించండి.