New Year Wishes Telugu: నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇలా తెలుగులో అందంగా చెప్పేయండి
New Year Wishes Telugu: నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పేందుకు సిద్ధమై పోతున్నారా? అందుకోసం మేము మీకు తెలుగులోనే అందమైన మెసేజులను, కవితలను, కోట్ లను అందించాము. మీకు నచ్చింది ఎంపిక చేసుకుని మీ స్నేహితులకు పంపండి.

న్యూ ఇయర్ శుభాకాంక్షలు
- కొత్త రంగులు కొత్త ఉత్సాహం కొత్త ఆనందం
కొత్త సంవత్సరంలో పాత ఏడాది రంగులను మార్చేసుకుందాం
కొత్త వసంతం వచ్చి జీవితంలో కొత్త క్షణాలను తీసుకురావాలని కోరుకుందాం
మీకు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు
2. కొత్త కిరణంతో కొత్త ఉదయం అందమైన చిరునవ్వుతో
ఈ కొత్త రోజు ఆనందంగా మొదలవ్వాలని కోరుకుంటూ
మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు
3. ఈ నూతన సంవత్సరం మీకు కొత్త వెలుగులను తీసుకురావాలి
ప్రతిరోజు ఆనందంతో నిండాలి
మీ కొత్త ప్రయాణం మొదలవ్వాలి
మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు
కొత్త ఏడాది విషెస్
- కొత్త ఏడాదిలో మీ ప్రతి కోరిక నెరవేరాలని
మీ హృదయ లోతుల్లో ఉన్న బాధ తొలగిపోవాలని
దుఃఖపు నీడలు మీ వైపు రాకూడదని కోరుకుంటూ
నూతన సంవత్సర శుభాకాంక్షలు
2. కొత్త సంవత్సరం వచ్చేసింది
ఈ నూతన సంవత్సరం మీ హృదయం కోరుకునే ప్రతిదీ
మీకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
నూతన సంవత్సర శుభాకాంక్షలు
హ్యాపీ న్యూ ఇయర్
- ఈ నూతన సంవత్సరం మీకు విజయాన్ని, ఆనందాన్ని తీసుకురావాలి
ఈ ఏడాదిలో మీ జీవితం విజయవంతం కావాలి
మీ ప్రతి పనిలోనూ ఆనందం నిండాలి
మీ కలలు నిజం కావాలి
నూతన సంవత్సర శుభాకాంక్షలు
2. నూతన సంవత్సరం మీకు వెలుగును అందిస్తుంది
దేవుడు మీపై దయ చూపాలి
ఇదే మీ శ్రేయోభిలాషిగా నా ప్రార్ధన
నూతన సంవత్సర శుభాకాంక్షలు
కొత్త ఏడాది కొత్త ఆరంభం
- గత సంవత్సరం కష్టాలను మరిచిపోయి
కొత్త ఏడాదిలో ఆశీర్వాదాలను పొందుతూ
ముందుకి సాగిపోతారని కోరుకుంటూ
నూతన సంవత్సర శుభాకాంక్షలు
2. మీరు సూర్యుడులా ప్రకాశిస్తూనే ఉండాలి
చంద్రుడిలా వికసిస్తూనే ఉండాలి
ఈ కొత్త ఏడాదిలో బాధ మీ దారిలో ఎదురవ్వకూడదు
మీరు విజయ శిఖరాలను తాకుతూనే ఉండాలి
ఒక శ్రేయోభిలాషిగా ఇదే నా నూతన సంవత్సర శుభాకాంక్షలు
తెలుగులో శుభాకాంక్షలు
- నూతన సంవత్సరం కొత్త ఆశలు, కొత్త ఆలోచనలు, కొత్త ప్రారంభం
దేవుడు మీ ప్రార్థనలు అన్నింటినీ నిజం చేయాలని కోరుకుంటున్నా
నూతన సంవత్సర శుభాకాంక్షలు
2. గతాన్ని మరిచిపోయి రేపటి కోసం కలలు కనండి
ఈ సంవత్సరం మీకు విజయ శిఖరాలు అందాలని కోరుకుంటూ
నూతన సంవత్సర శుభాకాంక్షలు
3. కొత్త ఏడాదిలో మీ ఇంటికి ఆనందం రావాలి
సంపద వర్షం కురవాలి
మీ అదృష్టం సూర్యుడులా ప్రకాశించాలని కోరుకుంటూ
నూతన సంవత్సర శుభాకాంక్షలు

