అందంతో మాయచేస్తున్న సమంతా బ్యూటీ సీక్రెట్ ఇదే...
సమంతా.. ‘యశోద’ సినిమాతో తనలోని మరో కోణంతో.. కొత్తగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మొదటి సినిమా.. ‘ఏం మాయ చేశావే..’ నుంచి ఇప్పటివరకు ప్రేక్షకుల్ని తన అందంతో మాయ చేస్తూనే ఉంది. సమంతా అందం యేటికేడాది ద్విగుణీకృతం కావడానికి ఎలాంటి స్టైల్ ఫాలో అవుతోందో తెలుసా.

2022
రోజురోజుకూ సమంతా అందం ద్విగుణీకృతం అయిపోతోంది. దానికి తగ్గట్టుగానే మేకప్ లో కొత్తగా ట్రై చేస్తుంది. ఈ యేడు మెరిగే గ్లాసీ లిప్స్, విల్లులా వంగినట్టుగా కనిపించే ఐలైనర్ తో ఆకట్టుకుంటోంది.
2021
ఇక నిరుడు ఒక పద్ధతిగా లేని మెస్సీ హెయిర్ తో.. అది కళ్లమీద పడుతున్నట్టుగా ఉండేలా ట్రై చేసింది. ఇది ఎంతోమంది హృదయాల్ని ఆకట్టుకుంది.
2020
2020లో సమంతా మరో రకంగా కనిపించింది. అప్పుడే విచ్చుకున్న పువ్వులా స్వచ్ఛంగా కనిపించింది. దీనికోసం డెయిసీ హెయిర్ ను ట్రై చేసింది.
samantha
2019
పెద్దగా మేకప్ లేకుండా సింపుల్గా.. ప్రెట్టీగా.. అందమైన కుందనపు బొమ్మలా కనిపించింది. ఈ సంవత్సర సమంతా పొట్టి జుట్టుతో ఆకట్టుకుంది.
2018
2018లో చీరకట్టులో ఒకవైపు దువ్వి కొప్పు వేసిన తలకట్టుతో.. దానికి మ్యాచ్ అయ్యే సన్నటి చిరునవ్వుతో మెస్మరైజ్ చేసింది.
Samantha
2017
నున్నగా దువ్వి, చివర్లో సన్నగా ఉండే పోనీటెయిల్ తో..డీవై మేకప్ తో.. చురుక్కుమనే చూపులతో సింపుల్ అండ్ బ్యూటిఫుల్ గా కనిపించింది.
2016
ఉంగరాలు తిరిగిన జుట్టుతో దేవకన్యలా మెరిసిపోతూ కనిపించింది. దీనికి మరింత అందాన్ని తీసుకువచ్చింది... ఆమె నవ్వు..
2015
సింప్లిసిటీకి మారు పేరుగా ఉండేది. సింపుల్ కుర్తీలో.. నొసటన చిన్న బిందీతో అచ్చమైన తెలుగింటి అమ్మాయిలా కనిపించింది.
2014
సైడ్ పాపడ తీసిన, ఉంగరాల జుట్టుతో అందానికి మారుపేరుగా కనిపించింది. ఈ స్టైల్ 2014లో చాలా పాపులర్ అయ్యింది.