Rock salt or regular salt: రాతి ఉప్పు లేదా సాధారణ ఉప్పు.. ఏది వాడితే ప్రమాదకరం?
వంటల్లో ఉప్పు చాలా ముఖ్యమైనది. అయితే రాతి ఉప్పు వాడాలా లేక మార్కెట్లలో దొరికే ఉప్పు పొడిని వాడాలా? రెండింట్లో ఏది వాడడం మన ఆరోగ్యానికి ఎక్కువ హాని కలుగుతుందో వైద్యులు వివరిస్తున్నారు.

ఏ ఉప్పు వాడాలి?
ఏ వంటలోనైనా ఉప్పు వాడకపోతే చప్పగా అనిపిస్తుంది. తినాలనిపించదు. ఏ వంటలోనైనా ఉప్పు పడకపోతే దాన్ని తినడం చాలా కష్టం. ఉప్పు వంటకానికి రుచిని ఇవ్వడమే కాదు, శరీరానికి కూడా అవసరం. అయితే ఏ ఉప్పు వాడాలి అన్న విషయంపై మాత్రం ఎవరికీ అవగాహన లేదు. రాతి ఉప్పు లేదా మార్కెట్లలో దొరికే ఉప్పు పొడి … ఈ రెండింటిలో ఏది ఆరోగ్యానికి మేలు చేస్తుందో తెలుసుకోండి. ఈ విషయంపై ఎంతో మంది ఆరోగ్యనిపుణులు వివరించారు.
రాతి ఉప్పు
రాతి ఉప్పు సహజమైనది. దీన్ని సముద్ర నీటిని ఆవిరిలా మార్చి ఉప్పుగా మారుస్తారు. ఇది తెల్లగా ఉండదు. సాధారణ రంగులోనే ఉంటుంది. ఆ ఉప్పును కొంచెం శుద్ధి చేస్తే తెల్లగా మారుతుంది. పూర్వం ఈ ఉప్పునే ఆహారాల్లో వాడేవారు. ఇది ఆహారానికి ప్రత్యేకమైన రుచిని కూడా అందిస్తుంది. దీన్ని వాడడం ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. కానీ ఇప్పుడు రాతి ఉప్పు లేదా కళ్లుప్పును వాడే వారి సంఖ్య తక్కువగానే ఉంది.
పొడి ఉప్పు
రాతి ఉప్పుతోనే ఈ పొడి ఉప్పును తయారు చేస్తారు. ఉప్పు పరిశ్రమలో రాతి ఉప్పును తీవ్రంగా శుద్ధి చేస్తారు. దానికి అయోడిన్ వంటి సమ్మేళనాలు కలుపుతారు. దాన్ని పొడి చేసి ప్యాకెట్లలో వేసి అమ్ముతారు. నిజానికి ఇలాంటి ఉప్పును అధికంగా తినడం మంచి పద్దతి కాదు. ఈ ఉప్పు వల్ల మన శరీరానికి అలెర్జీలు వచ్చే అవకాశాన్ని పెంచుకోవచ్చు. ఈ ఉప్పును ప్రతి రోజూ తినేవారికి అధిక రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలు, కాల్షియం లోపం వచ్చే అవకాశం పెరిగిపోతుంది.
రెండింట్లో ఏది తినాలి?
పైన చెప్పిన వివరాలను బట్టి ఏ ఉప్పును వాడాలో మీకే అర్థమవుతోంది. రాతి ఉప్పునే వాడడమే ఆరోగ్యకరం. పొడి ఉప్పు వాడడం ఆరోగ్యానికి హానికరం. ప్రతి ఇంట్లోను పొడి ఉప్పు కన్నా రాతి ఉప్పునే వాడడం అలవాటు చేసుకోవాలి. సౌకర్యంగా ఉంటుందని, ఆహారంలో త్వరగా కలిసిపోతుందని ఉప్పు పొడినే వాడేస్తున్నారు. అందుకే హైబీపీ సమస్యలు ఎక్కువ మందికి వస్తున్నాయి. రాతి ఉప్పును వాడేందుకు ప్రయత్నించండి.