MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
  • Home
  • Life
  • Rent A Boyfriend : ఏమిటీ.. అమ్మాయిలకు అద్దె భాయ్ ఫ్రెండ్ సర్వీసా.! రెంట్ ఎంతో తెలుసా..?

Rent A Boyfriend : ఏమిటీ.. అమ్మాయిలకు అద్దె భాయ్ ఫ్రెండ్ సర్వీసా.! రెంట్ ఎంతో తెలుసా..?

ఇది నిజంగా కలికాలమే... ఆన్ లైన్ లో అహార పదార్థాలు దొరికినంత ఈజీగా అమ్మాయిలకు అబ్బాయిలు అద్దెకు దొరుకుతున్నారు. అమెరికా వంటి దేశాల్లో కూడా పెద్దగా కనిపించని భాయ్ ఫ్రెండ్ రెంట్ కల్చర్ మనదగ్గర వచ్చేసింది. 

2 Min read
Author : Arun Kumar P
Published : Jun 06 2026, 03:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
ఇండియాలో అద్దె భాయ్ ఫ్రెండ్ సర్వీస్..
Image Credit : Gemini AI

ఇండియాలో అద్దె భాయ్ ఫ్రెండ్ సర్వీస్..

బాయ్‌ఫ్రెండ్ లేడని బాధపడే అమ్మాయిలకు గుడ్ న్యూస్..! రోజువారీ అద్దెకు బాయ్‌ఫ్రెండ్‌ను ఇచ్చే సర్వీస్ ఇప్పుడు మన దేశంలోనూ వచ్చేసింది. వినడానికి షాకింగ్‌గా ఉన్నా ఇది నిజం. రోజుకు కేవలం 1500 రూపాయలు చెల్లిస్తే చాలు, మీకు నచ్చినట్టుగా తోడుండే బాయ్‌ఫ్రెండ్‌ను పొందొచ్చు. జపాన్‌లో వైరల్ అయిన ఈ కాన్సెప్ట్ ఇప్పుడు ఇండియాలో, ముఖ్యంగా ఢిల్లీలో మొదలైనట్లు తెలుస్తోంది. ఇన్‌స్టాగ్రామ్ కంటెంట్ క్రియేటర్ ఇషా భల్లా ఈ సర్వీస్‌కు సంబంధించిన తన అనుభవాన్ని షేర్ చేయడంతో ఈ విషయం బయటపడింది.

 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Isha Bhalla (@ishabhallaa)

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
భాయ్ ఫ్రెండ్ ని ఎలా అద్దెకు తీసుకోవాలి..?
Image Credit : Gemini

భాయ్ ఫ్రెండ్ ని ఎలా అద్దెకు తీసుకోవాలి..?

ఇంతకీ ఈ సర్వీస్ ఎలా పనిచేస్తుందంటే.. Kopartner.in అనే వెబ్‌సైట్ ద్వారా ఒక అబ్బాయిని ఫ్రెండ్‌గా బుక్ చేసుకున్నట్లు ఇషా తన వీడియోలో చెప్పింది. ఈ వెబ్‌సైట్‌ 'రెంట్-ఎ-బాయ్‌ఫ్రెండ్' అని నేరుగా చెప్పకపోయినా కాన్సెప్ట్ మాత్రం అదే. ఇషా చెప్పిన దాని ప్రకారం, ముందుగా Kopartner.in వెబ్‌సైట్‌లో లాగిన్ అయి ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలి. ఆ తర్వాత మన అవసరాన్ని బట్టి వేర్వేరు కేటగిరీల నుంచి ఎంచుకోవచ్చు.

ఉదాహరణకు వృద్ధులను చూసుకోవడానికి, టైమ్ పాస్ చేయడానికి, క్లబ్బింగ్, సినిమా, షాపింగ్, ట్రావెల్ వంటి వాటికి పార్ట్‌నర్‌గా, మెడికల్ సపోర్ట్ కోసం, ఇంటి పనుల కోసం... ఇలా రకరకాల ఆప్షన్లు ఉంటాయి. వీటిలో మనకు ఏ అవసరానికి మనిషి కావాలో ఆ ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. ఒక రోజుకు సుమారు 1,000 నుంచి 1,500 రూపాయల వరకు ఖర్చవుతుంది. చేసే పనిని బట్టి ఈ రేటులో మార్పులు ఉండొచ్చు. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుని, లొకేషన్ ఇస్తే చాలు... మనకు కావాల్సిన పార్ట్‌నర్ ఆ లొకేషన్‌కు వచ్చేస్తాడు.

ఇలాగే ఇషా భల్లా షాపింగ్ కోసం ఒక కో-పార్ట్‌నర్‌ను బుక్ చేసుకుంది. ఆన్‌లైన్‌లో బుక్ చేశాక, చెప్పిన లొకేషన్‌లో ఆ పార్ట్‌నర్ తనను కలిశాడని, షాపింగ్‌లో సహాయం చేశాడని, బ్యాగులు మోశాడని, తను చెప్పేదంతా శ్రద్ధగా విన్నాడని ఇషా తన ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో పంచుకుంది.

Related Articles

Related image1
Husband for rent: భర్తను అద్దెకిస్తానని ప్రియురాలికి ఆఫర్ ఇచ్చిన భార్య, నెలకు అద్దె ఎంతో తెలుసా?
Related image2
Husband for Rent: భర్తను మహిళలకు అద్దెకు ఇస్తున్న భార్య.. రోజుకు రూ. 3 వేలు.. !
33
అద్దె భాయ్ ఫ్రెండ్ సర్వీస్ పై నెటిజన్ల రియాక్షన్...
Image Credit : INSTAGRAM

అద్దె భాయ్ ఫ్రెండ్ సర్వీస్ పై నెటిజన్ల రియాక్షన్...

కంటెంట్ క్రియేటర్ ఇషా భల్లా అద్దె భాయ్ ఫ్రెండ్ వీడియో వైరల్ అవ్వడంతో, నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. ఇండియాలో ఇలాంటి సర్వీస్ రావడంపై చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. "ఇదంతా నిజమేనా?", "గర్ల్‌ఫ్రెండ్‌ను కూడా అద్దెకు ఇస్తారా?", "మేం రెడీ, మా సీవీ ఎక్కడికి పంపాలి?" అంటూ కొందరు సరదాగా అడుగుతున్నారు. "అంట్లు తోమడానికి, బట్టలు ఉతకడానికి కూడా బాయ్‌ఫ్రెండ్ దొరుకుతాడా?" అని కొందరు ట్రోల్ చేస్తుంటే, మరికొందరు ఈ సర్వీస్ ఎంతవరకు నమ్మదగినది అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
బంధుత్వం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Parenting: ప్రతి తల్లీ తన కొడుకుకి చెప్పాల్సిన 7 విషయాలు ఇవి
Recommended image2
Dosa: డయాబెటిక్ ఫ్రెండ్లీ దోశె.. దీన్ని చేయడం వెరీ ఈజీ, షుగర్ వ్యాధి ఉన్నవారికి స్పెషల్
Recommended image3
Rice Water: రైస్ వాటర్‌ని ఇలా వాడితే.. జుట్టు వద్దన్నా పెరుగుతుంది!
Related Stories
Recommended image1
Husband for rent: భర్తను అద్దెకిస్తానని ప్రియురాలికి ఆఫర్ ఇచ్చిన భార్య, నెలకు అద్దె ఎంతో తెలుసా?
Recommended image2
Husband for Rent: భర్తను మహిళలకు అద్దెకు ఇస్తున్న భార్య.. రోజుకు రూ. 3 వేలు.. !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved