Asianet News TeluguAsianet News Telugu

Husband for Rent: భర్తను మహిళలకు అద్దెకు ఇస్తున్న భార్య.. రోజుకు రూ. 3 వేలు.. !

ఇంటి పనులన్నింటినీ నిపుణుల సహాయం లేకుండా చక్కబెట్టే తన భర్త నైపుణ్యాన్ని సంపాదన మార్చుకోవాలని యూకేకు చెందిన ఓ మహిళ భావించింది. అన్ని పనుల్లోనూ ఆరి తేరిన తన భర్తను రెంట్‌కు ఇచ్చి డబ్బులు సంపాదించాలనే కోరికను అమల్లో పెట్టింది.
 

UK woman gives her handy husband for rent to house works
Author
New Delhi, First Published Jun 30, 2022, 5:27 PM IST

న్యూఢిల్లీ: భర్త మరో ఆడ మనిషిని చూస్తే భార్యలు తట్టుకోరు. కొందరైతే గొడవకే దిగుతారు. అలాంటిది.. ఏకంగా భార్యనే స్వయంగా భర్తను ఇతర మహిళలకు అద్దెకు ఇవ్వడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? మీ డర్టీ మైండ్ కొంచెం పక్కనబెట్టి అసలు ఉద్దేశం ఏమిటో తెలుసుకుంటే ఆమె తెలివికి జోహార్ అంటారు. ఆమెను కచ్చితంగా గౌరవిస్తారు. ఇంతకీ ఆమె ఇతర మహిళలకు తన భర్తను ఏ పనుల కోసం అద్దెకు ఇస్తున్నది అనేది ముందుగా తెలుసుకుంటే దీనిపై స్పష్టత వస్తుంది. 

యూకేకు చెందిన ఓ మహిళ తన భర్తను అద్దెకు ఇస్తున్నది. యూకేలో లారా యంగ్ అనే మహిళ తన భర్త జేమ్స్, ముగ్గురు పిల్లల సంతానంతో నివసిస్తున్నది. అయితే, వారిలో ఇద్దరు పిల్లలకు ఆటిస్టిక్ వచ్చింది. వారికి సహాయ పడటానికి భర్త జేమ్స్ తన ఉద్యోగాన్ని కూడా వదులుకోవాల్సి వచ్చింది. అయితే, జేమ్స్‌కు ఇంటిలో అన్ని పనులు అంటే వైరింగ్ మొదలు.. తోట పని వరకు అన్ని పనుల్లో మంచి ప్రావీణ్యం ఉన్నది. ఉద్యోగం విడిచిన తర్వాత కూడా వారి ఇంటిలో ఏ సమస్య వచ్చినా.. ఆయనే స్వయంగా పరిష్కరించుకునేవాడు. జేమ్స్ అంతకు ముందు కూడా వేర్ హౌజ్ వర్కర్‌గా  పని చేశాడు. 

ఉద్యోగం వదిలి ఇంటి వద్దే ఉండటం.. ఇంటికి సంబంధించిన అన్ని పనుల్లోనూ జేమ్స్‌కు నైపుణ్యం ఉండటాన్ని భార్య లారా యంగ్ గ్రహించింది. తమ కుటుంబ జీవన పరిస్థితులకు ఎలాంటి ఆటంకం రాకుండా ఆమె ఒక అద్భుతమైన ఐడియాను కొనుగొంది. అదే ఇతరుల ఇళ్లల్లో జేమ్స్‌ను సహాయం పంపడం. లేదా ఇతరుల ఇళ్లల్లో ఎలాంటి సమస్యకైనా.. పనులకైనా జేమ్స్‌ను అద్దెగా పంపించడం. ఈ ఆలోచన తన బుర్రలో మెదలగానే భర్తతో పంచుకుంది. భర్త జేమ్స్ కూడా అందుకు సరేనన్నాడు. ఇంకేం.. ఇక తమ పథకాన్ని అమలు పెట్టడానికి భార్య లారా యంగ్ ఎంతో ప్రచారం చేయాల్సి వచ్చింది. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికల్లో ఆమె చాలా సీరియస్‌గా తన భర్తను ప్రమోట్ చేసుకుంది. 

తన ప్రణాళికను ముందుకు తీసుకెళ్లడానికి.. ఆమె రెంట్ మై హ్యాండీ హస్బెండ్ పేరిట ఒక వెబ్‌సైట్ ప్రారంభించింది. ఆ తర్వాత తన భర్త పని తీరు గురించి, ఆయన నైపుణ్యాల గురించి, ఆయన అందించే సహకారం గురించి ఫేస్‌బుక్ సహా ఇతర అనేక సోషల్ మీడియా సైట్‌లలో ప్రచారం చేసింది.

కానీ, ఆమె సోషల్ మీడియాలో ప్రచారం ప్రారంభించగానే డర్టీ మైండ్‌తోనే రకరకాలుగా కామెంట్లు చేశారు. ఎలాంటి పనులకైనా అద్దెకు తీసుకోవచ్చా? అంటూ డబుల్ మీనింగ్ కామెంట్లు పెట్టారు. తొలుత ఈ కామెంట్లు చూసి లారా యంగ్ బాధపడ్డారు. కానీ, నిరుత్సాహపడలేదు. తన భర్త ఇంటి పనుల్లో సహాయంగా ఉంటాడని, అన్ని పనులను చక్కబెడతాడని, తప్పకుండా తన భర్త ఆయన పని తీరుతో మెప్పించి తీరుతాడని ప్రమోట్ చేసుకుంటూ వచ్చింది. 

కొందరు డర్టీగా కామెంట్లు చేసినా.. కొందరు మహిళలు మాత్రం ఆమె భర్త ఇంటి పనులు చేయించుకోవడానికి ముందుకు వచ్చారు. దీంతో జేమ్స్‌కు చిన్న చిన్నగా సంపాదన మొదలైంది. ఇప్పుడు జేమ్స్‌ను ఒక రోజు అద్దెకు తీసుకుంటే 35 పౌండ్లు.. అంటే సుమారు రూ. 3352 చెల్లించాలి. అంత మొత్తం చెల్లించి ఆ రోజు వారు ఎంత పెద్దదైనా జేమ్స్‌తో చేయించుకోవచ్చు. కష్టాల్లో ఉన్న జేమ్స్ కుటుంబం.. ఇతరుల కష్టాలనూ గుర్తించింది. అందుకే వికలాంగులు, విద్యార్థులు, 65 ఏళ్లపైబడిన వయోధికులకు తక్కువ ధరకే పనులు చక్కబెడుతున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios