MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Life
  • Remedies to Quit Alcohol: ఈ జ్యూస్ 2 స్పూన్లు తాగితే... మళ్లీ మందు జోలికి వెళ్లరు..!

Remedies to Quit Alcohol: ఈ జ్యూస్ 2 స్పూన్లు తాగితే... మళ్లీ మందు జోలికి వెళ్లరు..!

 Remedies to Quit Alcohol: మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ఈ విషయం తెలిసినా కూడా దానిని అంత ఈజీగా వదులుకోలేరు. అలాంటివారు ఈ రెమిడీ ప్రయత్నిస్తే.. మద్యానికి దూరంగా ఉండొచ్చు.. 

2 Min read
Author : ramya Sridhar
Published : Apr 10 2026, 11:15 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Alcohol
Image Credit : Getty

Alcohol

మద్యపానం అనేది కేవలం ఒక అలవాటు మాత్రమే కాదు, అది శరీరాన్ని, మనస్సు, కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసే ఒక వ్యసనం. ఇది తెలిసినా కూడా చాలా మంది ఈ అలవాటు నుంచి బయటపడలేరు. ప్రతిరోజూ క్రమం తప్పకుండా ఈ మందు తాగేవారు ఉన్నారు. చివరకు లివర్ డ్యామేజ్ అవ్వడం లేదా.. ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చి ఏకంగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఇంటికి ఆధారమైన వ్యక్తి ప్రాణాలు పోతే... కుటుంబం మొత్తం రోడ్డు మీద పడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే, మాకు మందు మానేయాలని ఉన్నా.. మానలేకపోతున్నాం అనుకుంటే.. ఇంట్లో లభించే కొన్ని రెమిడీలు ప్రయత్నించి.. ఈ ఆల్కహాల్ బానిసత్వం నుంచి బయటపడొచ్చు. ఎలాంటి కెమికల్స్, మందు లేకుండా.. ఇంట్లో లభించే కొన్ని పదార్థాలు తీసుకోవడం వల్ల మందు తాగాలన్న కోరికను తగ్గించుకోవచ్చు. మరి.. ఆ రెమిడీలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
1.ద్రాక్ష పండ్లు...
Image Credit : unsplash

1.ద్రాక్ష పండ్లు...

మద్యపానానికి ద్రాక్ష పండ్లు ఒక గొప్ప ప్రత్యామ్నాయం అని చెప్పొచ్చు. ఆల్కహాల్ తయారు చేసే ప్రక్రియలో ద్రాక్ష పండ్లను వాడతారు అనే విషయం మీకు తెలిసే ఉండొచ్చు. కాబట్టి.. మద్యం తాగాలి అనిపించినప్పుడల్లా తాజా ద్రాక్షరసం తాగడం వల్ల ఆల్కహాల్ తాగాలి అనే కోరిక కొంచెమైనా తగ్గుతుంది. ఈ జ్యూస్ తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ బయటకు పోతాయి. అంతేకాదు.. శరీరానికి అవసరమైన పొటాషియం కూడా అందుతుంది.

2.ఖర్జూరాలు...

మద్యం వల్ల శరీరంలో చేరిన టాక్సిన్స్ బయటకు పంపడంలో ఖర్జూరాలు దివ్య ఔషధంలా పని చేస్తాయి. మీరు రోజుకు రెండు లేదా మూడు సార్లు ఖర్జూరాలను తినాలి. వీలైతే వీటిని నీటిలో నానపెట్టి, ఆ నీటిని తాగడం వల్ల మద్యంపై విరక్తి కలిగే అవకాశాలు ఉన్నాయి. మద్యం తాగాలన్న ఆలోచన కూడా అంత తొందరగా రాదు.

Related Articles

Related image1
Chicken Parts: చికెన్ తింటున్నారా? చికెన్ లో ఈ పార్ట్ తింటే ఆరోగ్యానికే ప్రమాదం...!
Related image2
Garuda Purana: కర్మ నుంచి తప్పించుకోలేరా? గరుడ పురాణం ప్రకారం ఎలాంటి శిక్షలు ఉంటాయి?
33
3.సెలెరీ జ్యూస్..
Image Credit : Gemini AI

3.సెలెరీ జ్యూస్..

సెలెరీ ఆకులు( వాము ఆకు జాతికి చెందినది) ఇవి మనకు మార్కెట్లో ఈజీగా లభిస్తాయి. ఈ ఆకులు మన కడుపు శుభ్రం చేయడమే కాకుండా, నరాలను శాంతి పరుస్తుంది. ఈ జ్యూస్ తాగినా.. ఆల్కహాల్ జోలికి తొందరగా వెళ్లరు.

ఈ ఆకుల జ్యూస్ తయారు చేయడానికి మీరు.. అర కిలో సెలెరీని 4 లీటర్ల నీటిలో వేసి, అది 2 లీటర్లు అయ్యే వరకు మరిగించాలి. ఈ జ్యూస్ ని మీరు స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ జ్యూస్ ముందుగా రెడీ చేసి పెట్టుకుంటే.. మద్యం తాగాలి అనిపించిన ప్రతిసారీ ఒకటి లేదా రెండు టీ స్పూన్లు తాగితే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల మద్యం తాగాలి అనే కోరిక తగ్గుతుంది.

4. అల్లం , తేనె :

అల్లంలోని సల్ఫర్ సమ్మేళనాలు వ్యసనాల నుండి మనస్సును మళ్లించడానికి తోడ్పడతాయి. ఒక చిన్న అల్లం ముక్కను తేనెలో నానబెట్టి, ఆ ముక్కను బుగ్గన పెట్టుకుని చప్పరించండి. ఇది నోట్లో ఉంటే.. మందు తాగాలి అనే కోరిక కలగదు.

5. ఆపిల్ పండ్లు (Apples):

రోజూ ఆపిల్ పండ్లను తినడం వల్ల ఆల్కహాల్ వల్ల కాలేయం (Liver) పై పడిన దుష్ప్రభావాలు తగ్గుతాయి. ఇవి రక్తాన్ని శుద్ధి చేస్తాయి. శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి.

మద్యం మానేయడంలో ఈ చిట్కాలు సహాయపడతాయి, కానీ మానేయాలి అనే మానసిక సంకల్పం ఉండటం అన్నింటికంటే ముఖ్యం. మద్యం కనిపించే ప్రదేశాలకు, ఆ అలవాటు ఉన్న స్నేహితులకు కొన్ని రోజులు దూరంగా ఉండటం మంచిది. పరిస్థితి తీవ్రంగా ఉంటే వైద్యుని సంప్రదించి కౌన్సెలింగ్ తీసుకోవడం ఉత్తమం.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
మీకు బుగ్గల్లో సొట్టలు పడుతున్నాయా? అయితే మీ వ్యక్తిత్వం చాలా స్పెషల్
Recommended image2
Toe Ring Designs: మగువల మనసుదోచే మెట్టెల డిజైన్లు..పాదాలకే అందం
Recommended image3
Gold Rings: 2 గ్రాముల్లో వచ్చే లేటెస్ట్ డిజైన్ గోల్డ్ రింగ్స్.. ఇవిగో!
Related Stories
Recommended image1
Chicken Parts: చికెన్ తింటున్నారా? చికెన్ లో ఈ పార్ట్ తింటే ఆరోగ్యానికే ప్రమాదం...!
Recommended image2
Garuda Purana: కర్మ నుంచి తప్పించుకోలేరా? గరుడ పురాణం ప్రకారం ఎలాంటి శిక్షలు ఉంటాయి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved