Jaggery: ఎర్ర బెల్లం, నల్ల బెల్లం.. రెండింటికీ తేడా ఏంటి? ఏది బెస్ట్..?
Jaggery: ఇంట్లో ఏ స్వీట్ చేయాలన్నా... బెల్లం ఉండాల్సిందే. అయితే.. బెల్లంలో ఏ రంగు బెల్లం మంచిది? ఎరుపు రంగులో ఉండే బెల్లం మంచిదా? లేక నల్ల బెల్లం మంచిదా? ఏది తినాలి..?

ఏ బెల్లం తినాలి?
మన భారతీయ వంటకాల్లో, ముఖ్యంగా సాంప్రదాయ పిండి వంటల్లో బెల్లం పడితే వచ్చే రుచే వేరు. పందార కంటే బెల్లం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని మన అందరికీ తెలిసిందే. అయితే, మార్కెట్ కి వెళ్లినప్పుడు మనకు ప్రధానంగా రెండు రకాల రంగుల్లో బెల్లం కనిపిస్తూ ఉంటుంది. ఒకటి కాస్త ఎర్రగా లేదా బంగారు వర్ణంలో మెరిసే ఎర్ర బెల్లం ఉంటే, మరొకటి ముదురు రంగులో ఉండే నల్ల బెల్లం. అసలు ఈ రెండింటికీ తేడా ఏంటి? ఏ బెల్లంలో ఎక్కువ పోషకాలు ఉంటాయి? మన ఆరోగ్యానికి ఏది మంచిది?
ఎర్ర బెల్లం, నల్ల బెల్లం తేడా..
ఎర్ర బెల్లం..
ఎరుపు, బంగారు వర్ణంలో మెరిసే బెల్లాన్ని సాధారణంగా చెరకు రసాన్ని మరిగించి తయారు చేస్తారు. చెరకు రసాన్ని తక్కువ సమయంపాటు లేదా ప్రామాణిక ఉష్ణోగ్రత వద్ద మరిగించినప్పుడు దీనికి ఈ రంగు వస్తుంది. సాధారణంగా ఇది ఎరుపు లేదా లేత గోధుమ రంగు వర్ణంలో చూడటానికి ఆకర్షణీయంగా ఉంటుంది. తీపిదనంతో పాటు తేలికపాటి సువాసన ఉంటుంది. కొన్ని రకాల ఎర్ర బెల్లంలో ఆకర్షణీయమైన రంగు, మెరుపు కోసం స్వల్పంగా రసాయాలు లేదా ఆర్టీఫిషియల్ కలర్స్ కూడా కలుపుతారు.
నల్ల బెల్లం (తాటి బెల్లం): ఇది తాటి చెట్టు లేదా ఈత చెట్టు నుంచి వచ్చే 'నీరా' (సహజ రసం)తో తయారవుతుంది. ఇందులో ఎలాంటి రసాయనాలు కలపకుండా, పూర్తిగా సాంప్రదాయ పద్ధతిలో తయారవుతుంది. రసం పులిసిపోకుండా ఉండటానికి కేవలం సహజసిద్ధమైన సున్నం మాత్రమే వాడతారు. అందుకే ఇది ముదురు గోధుమ లేదా నలుపు రంగులో గట్టిగా ఉంటుంది.
పోషకాల విలువలు..
ఎర్ర బెల్లం: ఇందులో ఐరన్, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు ఉంటాయి. అయితే తయారీలో వాడే రసాయనాల వల్ల కొన్నిసార్లు పోషకాలు కోల్పోయే అవకాశం ఉంటుంది.
నల్ల బెల్లం: ఇది పోషకాల ఖజానా. ఇందులో ఐరన్, క్యాల్షియం, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ బి-కాంప్లెక్స్ మెండుగా ఉంటాయి. రసాయనాల కాలుష్యం అసలు ఉండదు కాబట్టి, నేచర్ ఇచ్చిన పోషకాలు శరీరానికి పూర్తిగా అందుతాయి.
రెండింటిలో ఏది మంచిది..?
డయాబెటిస్ ఉన్నవారు / బరువు తగ్గాలనుకునేవారు: ఎర్ర బెల్లంతో పోలిస్తే తాటి బెల్లంలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల ఇది చాలా సురక్షితమైన ఎంపిక.
పిల్లలు, మహిళలకు: పీరియడ్స్ నొప్పులు, ఐరన్ లోపం (అనీమియా) ఉన్నవారికి తాటి బెల్లంలో ఉండే సహజ ఖనిజాలు అద్భుతంగా పనిచేస్తాయి.
చివరి మాట: ఎర్ర బెల్లం రుచిగా, చూడటానికి బాగున్నా.. తయారీలో రసాయనాల వాడకం ఉండే అవకాశం ఉంది. అదే తాటి బెల్లం ఎలాంటి రసాయనాలు లేని స్వచ్ఛమైన ప్రకృతి ప్రసాదం. వీలైతే మీ రోజువారీ డైట్‌లో నల్ల బెల్లాన్ని (తాటి బెల్లం) భాగం చేసుకోవడం ఆరోగ్యానికి చాలా శ్రేయస్కరం.
నల్ల బెల్లం (తాటి బెల్లం) , ఎర్ర బెల్లం (చెరకు బెల్లం) రెండింటిలోనూ విభిన్న పోషకాలు ఉన్నప్పటికీ, పోషకాల పరంగా నల్ల బెల్లమే అత్యంత శ్రేష్టమైనదిగా నిలుస్తుంది. తాటి చెట్టు రసం ద్వారా ఎలాంటి రసాయనాల ప్రమేయం లేకుండా తయారయ్యే నల్ల బెల్లంలో శరీరానికి కావాల్సిన ఐరన్ , కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం , విటమిన్ బి-కాంప్లెక్స్ పుష్కలంగా లభిస్తాయి. ఇందులో ఉండే సహజసిద్ధమైన మినరల్స్ రక్తహీలతను తగ్గించి, ఎముకలను బలోపేతం చేయడంలో అద్భుతంగా పనిచేస్తాయి. అలాగే, దీనిలో గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) చాలా తక్కువగా ఉండటం వల్ల ఇది రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచకుండా నెమ్మదిగా శక్తిని అందిస్తుంది. ఇక ఎర్ర బెల్లంలోనూ ఐరన్, పొటాషియం వంటి ఖనిజాలు ఉన్నప్పటికీ, వాణిజ్యపరమైన తయారీలో రసాయనాల వాడకం వల్ల కొన్నిసార్లు సహజ పోషకాలు తగ్గే అవకాశం ఉంటుంది. ఏదేమైనా, జీర్ణక్రియను మెరుగుపరచడం, రోగనిరోధక శక్తిని పెంపొందించడం, శ్వాసకోస సమస్యలను తగ్గించడంలో పోషకాల ఖజానా అయిన తాటి బెల్లం మన ఆరోగ్యానికి తిరుగులేని ప్రయోజనాలను చేకూరుస్తుంది.





