MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • ఈ కారణాల వల్లే రోజంతా సోమరిగా, అలసిపోయినట్టుగా ఉంటారు

ఈ కారణాల వల్లే రోజంతా సోమరిగా, అలసిపోయినట్టుగా ఉంటారు

కొంతమంది ఏ చిన్న పనిచేసినా.. మొత్తమే చేయకపోయినా.. బాగా అలసిపోయినట్టుగా కనిపిస్తారు. ఇలా కావడానికి కారణాలు కూడా కారణాలుంటాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. 
 

Mahesh Rajamoni | Published : Jul 22 2022, 01:52 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
17
Asianet Image

యాక్టీవ్ గా ఉంటేనే ఎంతైటి కష్టమైన పనినైనా చేయగలుగుతాం. అయితే కొంతమంది మాత్రం చిన్న చిన్న పనులను కూడా చేయలేకపోతుంటారు. ఆహారం తిన్నా.. లేజీగా, అలసిపోయినట్టుగానే కనిపిస్తారు. అయితే ఇలా కనిపించడానికి కారణాలున్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

27
Asianet Image

ఇనుము లోపం

శరీరంలో ఇనుము లోపిస్తే కూడా బాగా అలసటగా అనిపిస్తుంది. రోజంతా అలసిపోయినట్టుగానే ఉన్నా.. నిద్రపోయినా అలసిపోతున్నట్టైతే మీ ఒంట్లో ఇనుము లోపం ఏర్పడిందని అర్థం చేసుకోండి. ఇందుకోసం ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోండి. 
 

37
Asianet Image

నిద్రలేమి

నిద్రలేమి కూడా అలసటకు దారితీస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. రాత్రి పూట సరిగ్గా నిద్రపోకపోతే ఆ రోజంతా అలసిపోయిట్టుగానే ఉంటారు. సోమరితనం, అలసట, ఆస్తమ  వంటి సమస్యల నుంచి ఉపశమనం లభించాలంటే మీరు రాత్రి కంటి నిండా నిద్రపోవాలి. ఒక వేళ రాత్రిళ్లు నిద్రలేకపోతే.. ఆ రోజంతా లేజీగా ఉంటుంది. 

47
Asianet Image

ఒత్తిడి

ఒత్తిడి కూడా అలసటకు కారణమవుతుంది. తరచుగా ఒత్తిడికి గురైతున్నట్టైతే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. లేదంటే ధ్యానం చేయండి. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది. అలాగే అలసటను కూడా దూరం చేస్తుంది. 

57
Asianet Image

అనారోగ్యకరమైన ఆహారం

అనారోగ్యకరమైన ఆహారాలను తీసుకుంటే కూడా శరీరం బద్దకంగా, బలహీనంగా, అలసిపోతుంది. ముఖ్యంగా అనారోగ్యకరమైన ఆహారాలను తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి.  ఎందుకంటే వీటివల్ల శరీరంలో ప్రోటీన్లు, విటమిన్ల లోపం ఏర్పడుతుంది. దీంతో శరీరం అలసిపోతుంది. అందుకే ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాలనే తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 

67
Asianet Image

డీహైడ్రేషన్

డీహైడ్రేషన్ కూడా అలసటను కలిగిస్తుంది. రోజుకు 8 నుంచి 10 గ్లాసుల నీటిని తాగితే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఇంతకు మించి తక్కువగా నీటిని తాగితే బాడీ డీహైడ్రేషన్ బారిన పడుతుంది. దీంతో బాడీ బాగా అలసటకు గురవుతుంది. అందుకే నీటిని ఎక్కువగా తాగుతూ ఉండండి. 

77
Asianet Image

వ్యాయామం ఎక్కువగా చేయడం

మన శరీరానికి వ్యాయామం అవసరం. వ్యాయామంతోనే శరీరం ఆరోగ్యం, ఫిట్ గా ఉంటుంది. అలా అని ఎక్కువ సేపు వ్యాయామం చేస్తే మాత్రం విపరీతంగా అలసిపోతారు. అంతేకాదు ఓవర్ గా వ్యాయామం చేయడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందుకే నిపుణుడి సలహా తీసుకుని వ్యాయామం చేయండి. 
 

Mahesh Rajamoni
About the Author
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు. Read More...
ఆరోగ్యం
జీవనశైలి
 
Recommended Stories
Top Stories