Dimple Cheeks: సొట్ట బుగ్గలు అందమా? లోపమా? బుగ్గల్లో సొట్ట ఎందుకు పడుతుందో తెలుసా?
నవ్వినప్పుడు బుగ్గల్లో సొట్టపడితే ఆ అందమే వేరు. సొట్టబుగ్గలున్న వారు అందరిలో ప్రత్యేకంగా కనిపిస్తారు. కానీ బుగ్గల్లో అసలు సొట్ట ఎందుకు పడుతుంది? ఇది అందమా? లేక లోపమా? నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ చూద్దాం.
- FB
- TW
- Linkdin
Follow Us
)
సొట్ట బుగ్గల వెనుక రహస్యం ఏంటి?
సొట్ట బుగ్గలు ఉన్నవారు చూడటానికి చాలా అందంగా కనిపిస్తారు. చాలామంది బుగ్గల్లో సొట్టను అందానికి చిహ్నంగా భావిస్తారు. కానీ సొట్ట బుగ్గలు అందరికీ ఎందుకు ఉండవు? కొంతమందికి మాత్రమే ఎందుకు ఉంటాయి? ఇంతకీ సొట్టబుగ్గలు అందమా? లేక లోపమా? నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ తెలుసుకుందాం.
బుగ్గల్లో సొట్ట ఎందుకు పడుతుంది?
బుగ్గల్లో సొట్ట పడటం ఒక రకమైన లోపమని నిపుణులు చెబుతున్నారు. దీన్ని కండరాల లోపంగా పరిగణిస్తారు. ముఖంలోని ప్రధాన కండరం జైగోమాటికస్ సాధారణంగా చెంప ఎముక నుంచి నోటి మూల వరకు ఉంటుంది. కొందరిలో ఈ కండరం రెండు వేర్వేరు కండరాలుగా విడిపోతుంది. దీనివల్ల ఆ రెండింటి మధ్య ఖాళీ ప్రదేశం ఏర్పడుతుంది. నవ్వినప్పుడు అక్కడ సొట్ట పడుతుంది.
వంశపారంపర్యం..
కొంతమందికి సొట్ట బుగ్గలు వంశపారంపర్యంగా వస్తాయి. కొంతమంది ముఖంలో కండరాలు, ఎముకలు సరిగ్గా కుదరకపోవడం వల్ల ఇది సంభవించవచ్చు.
నిపుణుల మాట..
బుగ్గల్లో సొట్ట పడటం పెద్ద లోపంగా భావించాల్సిన అవసరం లేదు. ఇది తీవ్రమైన వ్యాధి ఏం కాదు. కేవలం కండరాల లోపమే. దీనివల్ల శరీరానికి ఎలాంటి హాని జరగదు. కాబట్టి చింతించాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు.