తెలివైన వారు ఈ పనులు అస్సలు చేయరు తెలుసా..!
ప్రతి ఒక్కరూ ఎదుటి మనిషిలో వెతికే లక్షణంలో ప్రధానంగా కనపడేది తెలివి తేటలు, సామర్థ్యం. ఈ రెండూ ఉన్న వారిని ఎప్పుడైనా ప్రపంచం గొప్పగా చూస్తుంది. ఎక్కువ విలువ కూడా ఇస్తుంది. అయితే.. నిజంగా తెలివైన వారు తమ ప్రతిష్టను కాపాడుకునేందుకు నిత్యం కొన్ని పనులు చేస్తూ ఉండాలట

ఏ ఒక్కరూ ఒకేలా ఉండరు. ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. ప్రతి ఒక్కరికీ తమకంటూ ఓ స్పెషల్ వైఖరి ఉంటుంది. అయితే.. వారు తమను తాము ప్రపంచానికి ఎలా ప్రదర్శించుకుంటున్నారనే విషయమే వారిని ఇతరులకన్నా భిన్నంగా చూపిస్తుంది. ఇక ప్రతి ఒక్కరూ ఎదుటి మనిషిలో వెతికే లక్షణంలో ప్రధానంగా కనపడేది తెలివి తేటలు, సామర్థ్యం. ఈ రెండూ ఉన్న వారిని ఎప్పుడైనా ప్రపంచం గొప్పగా చూస్తుంది. ఎక్కువ విలువ కూడా ఇస్తుంది. అయితే.. నిజంగా తెలివైన వారు తమ ప్రతిష్టను కాపాడుకునేందుకు నిత్యం కొన్ని పనులు చేస్తూ ఉండాలట. పొరపాటున కూడా తెలివైన వారు చేయని పనులేంటో ఓసారి చూద్దాం...
1.గొప్పలు చెప్పుకోవడం..
నిజంగా తెలివైన వారు తమ గురించి గొప్పలు చెప్పుకోరు. తాము సాధించిన విజయాలు, సామర్థ్యాల గురించి గొప్పగా చెప్పుకోవడం వారికి నచ్చదు. తమ ప్రతిభ ను అందరి ముందు ప్రదర్శించాల్సిన అవసరం వీరికి అస్సలు ఉండదు. అలా కాకుండా.. మీరు ఎదుటివారికి మీ గొప్పలు చెప్పుకుంటున్నారు అంటే.... మీ ప్రతిభను వారు గుర్తించాలని ఆరాటపడుతున్నారు అంటే... వారి మెచ్చుకోలు మీరు కోరుకుంటున్నట్లే లెక్క. అది మీలో మీ మీద నమ్మకం లేదు అనే అర్థం వచ్చేలా చేస్తుంది. అందుకే తెలివైన వారు ఆ పనిని అస్సలు చేయరు.
2.ఎదుటివారిపై నిందలు వేయడం..
తాము చేసిన తప్పుకు ఇతరులను నిందించడం లాంటి పొరపాటు నిజంగా తెలివైన వారు అస్సలు చేయరు. వారు తాము చేసిన తప్పుకు తామే జవాబుదారీగా ఉంటారు. ఇతరులపై తోసి.. తమను తాము దిగదార్చుకోరు. తాము చేస్తే నిజంగా ఒప్పుకుంటారు. ఆ తప్పు నుంచి ఏదో ఒక మంచి విషయాన్ని నేర్చుకునే ప్రయత్నం చేస్తారు.
3.ఎదుటివారి తప్పులను ఎత్తి చూపించరు..
ఇక నిజంగా తెలివైన వారు తమను గొప్పగా చూపించుకోవడం కోసం ఎదుటివారిని తక్కువ చేయాలని ఎప్పుడూ అనుకోరు. ఇతరుల్లోనూ విశ్వాసం పెంచేందుకు ప్రయత్నిస్తారు. అందరూ చూస్తుండగా విమర్శించడం లాంటివి కూడా చేయరు. ప్రైవేట్ గా మాట్లాడి వారికి ఏదైనా సమస్య ఉంటే పరిష్కరించాలని అనుకుంటారు. ఎవరైనా తప్పు చేస్తే.. అది కూడా ఎవరూ లేని సమయంలో అర్థమయ్యేలా చెప్తారు.
అటెన్షన్ కోరుకోవడం..
నిజంగా తెలివైనవారు ఇతరుల అటెన్షన్ తమపై ఉండాలని ఎప్పుడూ అనుకోరు. తమను ఇష్టపడేవారు.. మనం వారి కోసం ప్రయత్నించకుండానే మన దగ్గరకు వస్తారని వారికి తెలుసు. తాము చెప్పే విషయంపై ఇతులకు ఆసక్తి లేనప్పుడు వినమని బతిమిలాడటం లాంటివి చేయరు. కావాలంటో మరొకరితో మాట్లాడే ప్రయత్నం చేస్తారు.
गेम्स खेलें
అబద్దాలు చెప్పడం..
నిజంగా తెలివైనవారు అయితే.. అబద్దాలు చెప్పి బతికేయాలని అస్సలు అనుకోరు. నిజాయితీకి ఎక్కువ విలువ ఇస్తారు. వారు అబద్దాలను అసహ్యించుకుంటారు. ఇతరులను ఆకట్టుకోవడం కోసం.. తమ సామర్థ్యాలు, విజయాల గురించి అబద్దాలు చెప్పాలని వారు అనుకోరు. ఏదైనా సమస్యను అప్పటికప్పుడు పరిష్కరించడానికి కూడా వారు అబద్దాలు చెప్పరు. సమస్యను పరిష్కరించాలని అనుకుంటారు.
సులభంగా అన్నింటినీ వదిలేయడం..
తెలివిగల వారు దేనినీ అంత సులభంగా వదులుకోవడానికి ఇష్టపడరు. సాధించలేకపోతున్నామని లక్ష్యాలను పక్కన పెట్టరు. తమ లక్ష్యాన్ని సాధించే వరకు పట్టువదలకుండా ప్రయత్నిస్తూనే ఉంటారు. మా వళ్ల కాదు అని మధ్యలో వదిలేయడం వీరి గుణం కాదు.