MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • AC Risk: ఎండలో నుంచి ఇంటికి రాగానే ఏసీలో కి వెళ్తున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?

AC Risk: ఎండలో నుంచి ఇంటికి రాగానే ఏసీలో కి వెళ్తున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?

AC Risk:  ఎండలో బయటకు వెళ్లిన తర్వాత.. వెంటనే ఏసీలోకి వెళ్తే మనకు చాలా హాయిగా అనిపిస్తుంది. స్వర్గంలోకి అడుగుపెట్టామా అనే ఫీలింగ్ కలుగుతుంది. కానీ.. అలా ఒక్కసారిగా మీ చుట్టూ ఉన్న టెంపరేచర్  మారడం అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని మీకు తెలుసా? 

1 Min read
Author : ramya Sridhar
Published : May 02 2026, 05:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఏసీ లో ఉండకూడదా..?
Image Credit : Freepik

ఏసీ లో ఉండకూడదా..?

బయట ఎండలు మండిపోతున్నాయి.  రోజు రోజుకీ పెరుగుతున్న ఎండలను తట్టుకోవడం చాలా కష్టంగా మారుతోంది. ఒక్కసారి ఏదైనా పని మీద బయటకు వెళ్లినా.. ఎప్పుడెప్పుడు  నీడలోకి వస్తామా? ఏసీ లోకి అడుగుపెడతామా అని చాలా మంది ఎదురు చూస్తారు. 

అంతేకాదు.. వెంటనే ఇంటికి రాగానే.. ఏసీ ఆన్ చేసుకొని  ఆ ఏసీలో కూర్చుంటారు. కానీ.. ఎండ నుంచి  లోపలికి రాగానే వెంటనే ఏసీలోకి అడుగుపెట్టడం వల్ల ఎన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
24
మన శరీరం ఎలా పని చేస్తుంది?
Image Credit : GEMINI

మన శరీరం ఎలా పని చేస్తుంది?

సాధారణంగా మన శరీరం బయటి ఉష్ణోగ్రతకు అనుగుణంగా తనను తాను సరద్దుబాటు చేసుకునే శక్తిని కలిగి ఉంటుంది.  మనం ఎండలో ఉన్నప్పుడు చెమట పట్టడం, రక్త నాళాలు వ్యాకోచించడం వంటి ప్రక్రియల ద్వారా శరీరం తన ఉష్ణోగ్రతను బ్యాలెన్స్ గా ఉంచుకుంటుంది. ఇది మన శరీరంలో సహజంగా ఉండే ఒక రక్షణ వ్యవస్థగా పని చేస్తుంది.

Related Articles

Related image1
Chopping Board: కూరగాయలు కట్ చేసే చాపింగ్ బోర్డుపై లక్షలాది క్రీములు.. ఎలా శుభ్రం చేయాలో తెలుసా?
Related image2
Garuda Purana: కోట్లల్లో సంపాదించినా.. వీరికి సంతోషం దొరకదు, ఎందుకో తెలుసా?
34
ఏసీలోకి ఎందుకు వెళ్లకూడదు...?
Image Credit : social media

ఏసీలోకి ఎందుకు వెళ్లకూడదు...?

ఎండలోంచి వచ్చిన వెంటనే అకస్మాత్తుగా అతి తక్కువ ఉష్ణోగ్రత ఉన్న ఏసీ గదిలోకి వెళ్లినప్పుడు, మన శరీర సహజ రక్షణ వ్యవస్థకు ఆటంకం కలుగుతుంది. ఉష్ణోగ్రతలో కలిగే ఈ ఆకస్మిక మార్పుల వల్ల జలుబు, దగ్గు వంటి సమస్యలతో పాటు తీవ్రమైన తలనొప్పి, కండరాల నొప్పులు వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు, ఇది మన రోగనిరోధక శక్తిపై కూడా ప్రభావం చూపుతుంది.
44
మరి ఏం చేయాలి..?
Image Credit : Gemini

మరి ఏం చేయాలి..?

ఎండ నుంచి ఇంటికి లేదా ఆఫీస్‌కు వచ్చిన వెంటనే కాసేపు నీడలో లేదా ఫ్యాన్ కింద కూర్చోవాలి. శరీర ఉష్ణోగ్రత కాస్త సాధారణ స్థితికి వచ్చాక మాత్రమే ఏసీ గదిలోకి వెళ్లడం సురక్షితం. అలాగే, ఏసీ గదిలోకి వెళ్లే ముందు బాగా చల్లగా ఉన్న నీళ్లు తాగడం కూడా మంచిది కాదు. ఇలా కొద్దిసేపు ఆగి వెళ్లడం ద్వారా మీరు అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉండవచ్చు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Nepali Haaram: నేపాలీ హారాలు చూశారా.. వేసుకుంటే మెడ నిండిపోతుంది
Recommended image2
Silver Anklets: రూ.5000 బడ్జెట్‌లో అదిరిపోయే వెండి పట్టీలు డిజైన్లు
Recommended image3
Washing Machine: మీ వాషింగ్ మెషిన్ బాల్కనీలో పెట్టారా? ఈ ఒక్క పొరపాటుతో చాలా నష్టపోతారు..!
Related Stories
Recommended image1
Chopping Board: కూరగాయలు కట్ చేసే చాపింగ్ బోర్డుపై లక్షలాది క్రీములు.. ఎలా శుభ్రం చేయాలో తెలుసా?
Recommended image2
Garuda Purana: కోట్లల్లో సంపాదించినా.. వీరికి సంతోషం దొరకదు, ఎందుకో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved