MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Rasam: దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులకు చెక్ పెట్టే రసం రెసిపీలు

Rasam: దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులకు చెక్ పెట్టే రసం రెసిపీలు

Rasam: దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులు రాకుండా ఉండాలంటే కొన్ని రకాల రసం రెసిపీలు ఉన్నాయి. మీ వంటగదిలోనే ఉండే ఈ 5 రకాల రసాల్లో దాగి ఉన్న ఆరోగ్య రహస్యాలు ఏంటో తెలుసా? ఏ రసం ఏ సమస్యకు పనిచేస్తుందో చూద్దాం.

1 Min read
Author : Haritha Chappa
Published : Oct 05 2026, 10:59 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
మిరియాల రసం
Image Credit : pinterest

మిరియాల రసం

తరచూ మిరియాల రసం చేసుకుని తాగడం అలవాటు చేసుకుంటే ఎంతో మంచిది. జలుబు చేసినప్పుడు లేదా చలికాలంలో మాత్రమే మిరియాల రసం చేసుకుంటారు. కానీ తరచూ తాగితే ఎంతో మంచిది. మిరియాల్లో ఉండే పైపెరిన్ అనే ముఖ్యమైన సమ్మేళనం ఉంటుంది. ఇది ఆరోగ్యానికి ఔషధంలాంటిది. మిరియాల్లో యాంటీ ఆక్సిడెంట్లు, వాపు లను తగ్గించే గుణాలు ఉన్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి.

మిరియాల రసం తయారీ విధానం 

మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లిని దోరగా వేయించి పొడి చేసుకోవాలి. చింతపండు నీళ్లలో టమాటా, పసుపు, ఉప్పు వేసి మరిగించి, ఆ తర్వాత ఈ పొడిని కలపాలి. నురగ వస్తున్నప్పుడు దించేసి కొత్తిమీర చల్లితే ఘుమఘుమలాడే మిరియాల రసం రెడీ.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
వెల్లుల్లి రసం
Image Credit : Getty

వెల్లుల్లి రసం

వెల్లుల్లి చేసే మేలు ఇంతా అంతా కాదు. వెల్లుల్లి రసం శరీరానికి వేడిని ఇవ్వడమే కాకుండా, ఆహారం రుచిని కూడా పెంచుతుంది. వెల్లుల్లిలో సల్ఫర్ సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. సంప్రదాయ రసంలో వెల్లుల్లి, మిరియాలు, జీలకర్ర లాంటివి కలిపితే మంచి రుచి, వాసన వస్తాయి.

వెల్లుల్లి రసం తయారీ విధానం 

వెల్లుల్లిని కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఆ వెల్లుల్లిని మిరియాలు, జీలకర్రతో పాటు వేయించాలి. తర్వాత చింతపండు, టమాటా, పసుపు, ఉప్పు వేసి మరిగించి, వేయించిన వెల్లుల్లి మిశ్రమాన్ని కలపాలి. ఎక్కువసేపు మరిగించకుండా దించేస్తే రుచి అద్భుతంగా ఉంటుంది.

33
మునగాకు రసం
Image Credit : pinterest

మునగాకు రసం

మునగాకులను సూపర్ ఫుడ్స్ గా చెప్పుకుంటారు. వీటిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. మునగాకులతో రసం చేయడం వల్ల రుచి కూడా అద్భుతంగా ఉంటాయి. సాధారణ రసానికి అదనపు పోషకాలు, రుచి వస్తాయి. ముఖ్యంగా కూరగాయలు, ఆకుకూరలు తినడానికి మారం చేసే పిల్లలకు, పెద్దలకు మునగాకును ఇలా రసం రూపంలో ఇవ్వడం చాలా సులువైన పద్ధతి.

మునగాకు రసం తయారీ విధానం 

మునగాకును శుభ్రం చేసి పెట్టుకోవాలి. టమాటా, వెల్లుల్లి, మిరియాలు, జీలకర్ర, చింతపండు, పసుపుతో కలిపి రసం చేసుకోవచ్చు. ఆకుల్లోని పోషకాలు పోకుండా ఉండాలంటే ఎక్కువసేపు ఉడికించకుండా తగినంత మేరకే వండటం మంచిది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bommala Koluvu Decoration : ఈ నవరాత్రికి బొమ్మల కొలువును ఇలా ప్లాన్ చేయండి..అదిరిపోయే డెకరేషన్ ఐడియాస్
Recommended image2
Train Journey: సముద్రం మధ్యలో రైలు ప్రయాణం చేశారా? మన దేశంలో ఈ రైలు ఎక్కడ ప్రయాణిస్తుందంటే..
Recommended image3
Gold Ring: కేవలం 2 గ్రాముల్లో వచ్చే బంగారు ఉంగరాలు.. ఎంత బాగున్నాయో!
Related Stories
Recommended image1
పండుగ సీజన్ ఆఫర్... ఆ కార్లపై లక్ష రూపాయలకు పైగా భారీ డిస్కౌంట్, ఇప్పుడే కొనేయండి
Recommended image2
Coconut Water: కొబ్బరికాయలోకి నీళ్లు ఎలా వస్తాయి? ఈ నీరు ఎలా తయారవుతుంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved