MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Pregnant Woman:9 నెలల నిండు గర్భిణీ..తలకిందులుగా యోగా, 20 మిలియన్లు దాటిన వీడియో వ్యూస్

Pregnant Woman:9 నెలల నిండు గర్భిణీ..తలకిందులుగా యోగా, 20 మిలియన్లు దాటిన వీడియో వ్యూస్

 Pregnant Woman: కడుపుతో ఉన్న మహిళలు.. ఇతరుల్లా అన్ని పనులు తమకు తాముగా చేసుకోలేరు. సరిగా కూర్చోవడం, నిలపడటమే కష్టంగా ఉంటుంది. కానీ, ఓ మహిళ 9 నెలల కడుపుతో తలకిందులుగా యోగా చేసి రికార్డు క్రియేట్ చేసింది. 

2 Min read
Author : ramya Sridhar
Published : Jun 12 2026, 03:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
నిండు గర్భిణీ యోగాసనాలు...
Image Credit : Instagram / yogyatra with shashi

నిండు గర్భిణీ యోగాసనాలు...

కడుపుతో ఉన్న స్త్రీలకు నార్మల్ డెలీవరీ అవ్వాలని చిన్నపాటి యోగాసనాలు వేయమని డాక్టర్లు స్వయంగా చెబుతూ ఉంటారు. గర్భిణీలు యోగా చేయడం చాలా కామన్ విషయం. కానీ, బెంగళూరుకు చెందిన ఓ యోగా టీచర్ 9 నెలల కడుపుతో చేసిన యోగాసనాలు అందరినీ షాకింగ్ కి గురి చేశాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
యోగా టీచర్...
Image Credit : Instagram / yogyatra with shashi

యోగా టీచర్...

బెంగళూరు యోగా టీచర్ శశిప్రభ ద్వివేది తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేశారు. ఆ వీడియోలో ఆమె చీర కట్టుకొని ఉన్నారు. అందులోనూ 9 నెలల గర్భవతి. ఈ సమయంలో కూడా... ఆమె అద్భుతమైన యోగాసనాలు వేసింది. నార్మల్ గా ఉన్నవారు కూడా వేయడానికి కష్టంగా ఉండే యోగాసనాలు ఆమె వేయడం విశేషం. చక్రాసనంతో పాటు.. తల కిందులుగా పెట్టి.. కాళ్లు పైకి పెట్టి కూడా ఆమె యోగాసనాలు చేయడం విశేషం. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దాదాపు 20 మిలియన్లు.. అంటే 2 కోట్లకు పైగా ఆ వీడియోని వీక్షించారు. ఆమె ఫిట్‌నెస్, ఆమె బాడీ ఫ్లెక్సిబిలిటీ చూసి నెటిజన్లు షాక్ అవుతుంది. ఎంత యోగా టీచర్ అయినప్పటికీ.. డెలివరీకి కొద్ది రోజుల ముందు ఇలాంటి యోగాసనాలు వేయడం చాలా ప్రమాదకరం అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Related Articles

Related image1
Adi Reddy: మళ్లీ బిగ్ బాస్ వచ్చేస్తోంది.. కేవలం రివ్యూలు చెప్పి.. నెలకు ఆదిరెడ్డి ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా?
Related image2
Youtuber Nandu: నా అన్వేషణ అన్వేష్ లాగా కాదు.. ఆనందంలో మునిగి తేలుతున్న యూట్యూబర్ నందు
34
యోగా టీచర్ ఏమన్నారంటే....
Image Credit : Instagram / yogyatra with shashi

యోగా టీచర్ ఏమన్నారంటే....

‘గర్భిణీగా ఉంటూ నేను చేసే యోగాసనాలు మాత్రమే జనాలు చూస్తున్నారు. కానీ, దీని వెనక నాకు ఎన్నో సంవత్సరాల కఠోర శ్రమ దాగి ఉంది. ఎన్నో సంవత్సరాల కఠిన శిక్షణ తర్వాత మాత్రమే తాను ఈ యోగాసనాలు చేయగలుగుతున్నాను. నేను ప్రస్తుతం 9 నెలల గర్భవతిని ఇది నిజం. కానీ.. అందరూ ఈ ఆసనాలు వేయలేరు. ప్రతి మహిళ శరీరం ఒకేలా ఉండదు. ఇలాంటి ఆసనవాలు వేసే ముందు వైద్యుల సలహా కచ్చితంగా తీసుకోవాలి’ అని శశి ప్రభ చెప్పారు.

44
నెటిజన్ల రియాక్షన్...
Image Credit : Instagram / yogyatra with shashi

నెటిజన్ల రియాక్షన్...

కాగా.. శశి ప్రభ పోస్టు చేసిన యోగా వీడియోలకు నెటిజన్ల రియాక్షన్ ఒక్కోసారి ఒక్కోలా ఉంటుంది. చాలా మంది ఆమె వీడియోలకు సూపర్ గా మద్దతు తెలుపుతున్నారు. కొందరు.. గర్భం దాల్చినప్పుడు ఇలాంటివి చేయడం బిడ్డ ఆరోగ్యానికే ప్రమాదకరం అంటూ కామెంట్స్ చేస్తుండగా.. మరి కొందరు మాత్రం.. ఇది కేవలం పబ్లిక్ స్టంట్ అంటూ కామెంట్ చేయడం విశేషం. అయితే.. ఇలాంటి యోగాసనాలు వేయద్దని... తనను తన తల్లి కూడా తిట్టిందని.. కానీ.. తాను మాత్రం ఈ యోగా సాధన చేయడం మాత్రం ఆపలేదు అని శశి ప్రభ చెప్పారు.

 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shashi Prabha Dwivedi (@yogyatra_with_shashi)

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
మహిళలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Toe Rings: ఆఫీస్‌కి వెళ్లే మహిళల కోసం.. ట్రెండీ మెట్టెల డిజైన్లు
Recommended image2
Rose Design Earrings: గులాబీ పూల డిజైన్ లో అందమైన బంగారు కమ్మలు
Recommended image3
Pearl Necklace: ఆరేడు వరుసల్లో ముత్యాల హారం డిజైన్లు.. చీర, లెహెంగాలపై అదిరిపోతాయి
Related Stories
Recommended image1
Adi Reddy: మళ్లీ బిగ్ బాస్ వచ్చేస్తోంది.. కేవలం రివ్యూలు చెప్పి.. నెలకు ఆదిరెడ్డి ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా?
Recommended image2
Youtuber Nandu: నా అన్వేషణ అన్వేష్ లాగా కాదు.. ఆనందంలో మునిగి తేలుతున్న యూట్యూబర్ నందు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved