Pregnancy Tips: గర్భిణులు ఈ పండ్లను అస్సలు తినకూడదు.. పొరపాటున తిన్నారో గర్భస్రావం అవుతుంది జాగ్రత్త..
Pregnancy Tips: గర్భధారణ సమయంలో మహిళల శరీరంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా మూడ్ స్వింగ్స్. అయితే ఈ సమయంలో డిఫరెంట్ ఆహారాలను తినాలన్న కోరిక పుడుతుంది. కానీ ఏది పడితే అది తింటే బిడ్డకు హాని జరిగే అవకాశం ఉంది. అంతేకాదు ఇది గర్భస్రావానికి దారితీస్తుంది కూడా. గర్భధారణ సమయంలో మీరు కొన్ని పండ్లను అస్సలు తినకూడదు. లేదంటే మీ బిడ్డ యొక్క ప్రాణాలకు ప్రమాదం కలగవచ్చు.
పైనాపిల్ (Pineapple).. గర్భధారణ సమయంలో పైనాపిల్ అసలే తినకూడదు. ఎందుకంటే పైనాపిల్ తినడం వల్ల గర్భాశయం సంకోచానికి గురవుతుంది. ఇదికాస్త గర్భస్రావానికి దారితీస్తుంది. పైనాపిల్ లో బ్రోమెలైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది ప్రోటీన్లను విచ్ఛిన్నం చేస్తుంది. ఇది గర్భాశయాన్ని మృదువుగా చేస్తుంది. దీంతో గర్భస్రావం అయ్యే అవకాశం ఉంది.
చింతపండు (Tamarind).. గర్భధారణ సమయంలో చింతపండును తినాలనే కోరిక కలగడం చాలా సహజం. కానీ గర్భిణులు చింతపండును తినడం వల్ల కలిగే ప్రయోజనాల కంటే సైడ్ ఎఫెక్ట్స్ యే ఎక్కువగా ఉన్నాయి. వాస్తవానికి చింతపండులో అధిక మొత్తంలో విటమిన్ సి ఉంటుంది. దీనిని అధికంగా తీసుకుంటే ఇది మీ శరీరంలో ప్రొజెస్టెరాన్ ఉత్పత్తిని అణిచివేస్తుంది. అలాగే ప్రొజెస్టెరాన్ యొక్క తక్కువ స్థాయిలు గర్భస్రావానికి దారితీస్తాయి. కాబట్టి మీరు ఎక్కువగా చింతపండును తినకండి. మొదటి 6 నెలల్లో చింతపండును అస్సలు తినకూడదు.
బొప్పాయి (Papaya)..గర్భిణీ స్త్రీలు తినకూడని పండ్లలో బొప్పాయి ఒకటి. ఇది మీ శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది. ఇది గర్భధారణ సమయంలో అస్సలు మంచిది కాదు. దీనిలో latex సమృద్ధిగా ఉంటుంది. ఇది గర్భాశయ సంకోచానికి గురై రక్తస్రావానికి దారితీస్తుంది. ఇది పిండం ఎదుగుదలను కూడా నిరోధించగలదు. కాబట్టి పండిన, ముడి బొప్పాయి రెండింటినీ తినడం మానుకోండి.
అరటిపండ్లు (Bananas)..గర్భధారణ సమయంలో అరటిపండ్లు తినడం సురక్షితం అని భావించినప్పటికీ.. కొన్ని సందర్భాల్లో వీటిని తీసుకోకపోవడమే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అలర్జీలతో బాధపడే మహిళలు, డయాబెటిస్ లేదా డయాబెటిస్ కుటుంబ చరిత్ర ఉన్న మహిళలు అరటిపండ్లను తినకూడదు. అరటిపండ్లలో కూడా ఎక్కువ మొత్తంలో చక్కెర ఉంటుంది. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు అరటిపండ్లు తినడం మానుకోవాలి.
పుచ్చకాయ (Watermelon).. సాధారణంగా వేసవిలో పుచ్చకాయలను ఎక్కువగా తింటూ ఉంటారు. ఎందుకంటే ఇది శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. అలాగే శరీరంలో ఉన్న విష పదార్థాలను బయటకు పంపుతుంది. కానీ గర్భధారణ సమయంలో పుచ్చకాయను తినడం వల్ల మీ బిడ్డకు పుచ్చకాయ నుంచి బయటకు వచ్చే విష పదార్ధాల హాని చేస్తాయి. అందుకే ఈ పండును గర్భిణులు తినకపోవడమే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ పండు సాధారణంగా గర్భిణుల ఆరోగ్యానికి మంచిది. కానీ దీనిని ఎక్కువ మొత్తంలో తీసుకుంటే దానిలోని చక్కెర పరిమాణం మీ రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది.
ఖర్జూరం (Date).. ఖర్జూరాల్లో విటమిన్లు, శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే గర్భిణులు వీటిని ఎక్కువగా తినకూడదని ఆరోగ్య నిపుణులు సలహానిస్తున్నారు. ఎందుకంటే అవి శరీరాన్ని వేడెక్కించి గర్భాశయ సంకోచాలకు కూడా దారితీస్తాయి. కాబట్టి రోజూ ఒకటి లేదా రెండు ఖర్జూరాలను మాత్రమే తినడం మంచిది. అంతకంటే ఎక్కువ తింటే గర్బస్రావం అయ్యే అవకాశం ఉంది.