MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Life
  • Health Tips : దానిమ్మను ఎక్కువగా తింటున్నారా? అయితే మీరు ఈ విషయాలను తెలుసుకోవాల్సిందే..

Health Tips : దానిమ్మను ఎక్కువగా తింటున్నారా? అయితే మీరు ఈ విషయాలను తెలుసుకోవాల్సిందే..

Health Tips : ప్రస్తుత కాలంలో ప్రజలు తమ ఆరోగ్యం పట్ల ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా కరోనా వచ్చినప్పటి నుంచి జనాలు తమ ఆరోగ్యం పట్ల ఎంతో శ్రద్ధ చూపుతున్నారు. అంతేకాదు పండ్లు, కూరగాయలను తినే వారి సంఖ్య కూడా బాగా పెరిగింది. కానీ మోతాదుకు మించి తింటే మాత్రం ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదుర్కోకతప్పదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : May 12 2022, 10:39 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే వీటిని జనాలు ఎక్కువగా తినడానికి ఇష్టపడుతున్నారు. పండ్లు మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటుగా.. శరీరానికి కావాల్సిన ఎన్నో  పోషకాలను కూడా అందిస్తాయి. ఇక అన్ని పండ్లలో దానిమ్మ పండు ఎన్నో పోషకవిలువలను కలిగి ఉంటుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

ఈ పండును తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ వైరల్, యాంటీ ట్యూమర్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ, ఫోలిక్ యాసిడ్ లు కూడా ఉంటాయి. 

39

నిత్యం దానిమ్మ పండు లేదా జ్యూస్ ను తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాదు మధుమేహం, అధిక రక్తపోటు ను నియంత్రించడంతో పాటుగా ఎన్నో వ్యాధులను కూడా తగ్గిస్తుంది.  అలాగే పిల్లల్లో జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. దానిమ్మ పండు గుండె సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది. 

49

గర్భిణీ స్త్రీలు కూడా దానిమ్మను తినాలని వైద్యులు సలహానిస్తుంటారు. దానిమ్మలో ఐరన్ కంటెంట్ కడుపులో పెరుగుతున్న బిడ్డ ఆరోగ్యంగా ఎదిగేందుకు సహాయపడుతుంది.  ఇది ఎముకలను బలోపేతం చేయడానికి కూడా సహాయపడుతుంది. చాలా మంది దానిమ్మ గింజలను తినేకంటే రసాన్ని తాగడానికే ఇష్టపడతారు.

59

ఉదయం బ్రేకఫాస్ట్ తో పాటుగా ఒక గ్లాసు దానిమ్మ రసం తాగే వారు కూడా ఉన్నారు. దానిమ్మ ఆరోగ్యానికి మంచి చేసేదే అయినా.. వాటిని మరీ ఎక్కువగా తీసుకోవడం ఏ మాత్రం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దానిమ్మను అధికంగా తీసుకుంటే మనం ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. 
 

69

దానిమ్మను ఎక్కువగా తినడం వల్ల దగ్గు, అలర్జీలు మొదలైన సమస్యలతో పాటుగా ఎన్నో వ్యాధులొచ్చే అవకాశం ఉంది. మరి దానిమ్మ పండు లేదా దానిమ్మ జ్యూస్ ను ఎక్కువగా తీసుకుంటే ఏమౌతుందో మనం ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం. 

79

దగ్గు.. దానిమ్మ పండును మోతాదులో తీసుకుంటేనే మన ఆరోగ్యానికి అన్ని విధాలా మంచిది. అలా అని మరీ ఎక్కువగా తీసుకుంటే మాత్రం దగ్గు సమస్య వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే దానిమ్మ పండులో గొంతునొప్పికి దారితీసే పదార్థాలుంటాయి. దానిమ్మ పండును ఎక్కువగా తింటే గొంతునొప్పితో పాటుగా దగ్గు సమస్య కూడా వస్తుంది. 

89

స్కిన్ అలెర్జీ.. దానిమ్మ ను మితంగా తీసుకుంటే చర్మానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇది చర్మ ఆరోగ్యాన్నికాపాడటంతో పాటుగా కాంతివంతంగా కూడా చేస్తుంది. అంతేకాదు దానిమ్మ స్కిన్ టోనర్ గా కూడా పనిచేస్తుంది. అయితే దీన్ని మరీ ఎక్కువగా తీసుకుంటే మాత్రం అలెర్జీ సమస్య వచ్చే అవకాశం ఉంది. దానిమ్మను మోతాదుకు మించి తీసుకోవడం వల్ల శరీరంపై ఎర్రని దద్దుర్లు వస్తాయి. అలాగే అలెర్జీ కూడా వస్తుంది. 

99

ఎసిడిటీ.. దానిమ్మ పండును అధికంగా తీసుకోవడం వల్ల ఎసిడిటీకి దారితీస్తుంది. శరీరానికి వేడి  లేదా చల్లని పదార్థాలను ఇచ్చినప్పుడు దానికి సర్దుబాటు చేసుకోవడం కష్టంగా మారుతుంది. దానిమ్మ శరీరానికి చలువ చేస్తుంది. దానిమ్మను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎసిడిటీ సమస్య బారిన పడతారు. కాబట్టి ఈ పండును మోతాదులోనే తినండి. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Lifestyle: కూల్ వాట‌ర్ తాగితే జ‌లుబు అవుతుందా.? అస‌లు మ్యాట‌రేంటంటే.?
Recommended image2
ఖర్జూరాలు ప్రతిరోజూ తింటే మన శరీరంలో జరిగే మార్పులు ఇవే
Recommended image3
Baking Soda: రాత్రంతా ఫ్రిజ్ లో బేకింగ్ సోడా పెడితే.. జరిగే మ్యాజిక్ ఇదే..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved