MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Cooler: కొత్త కూలర్ కొనాలనుకుంటున్నారా? మోసపోవద్దంటే ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

Cooler: కొత్త కూలర్ కొనాలనుకుంటున్నారా? మోసపోవద్దంటే ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

Cooler: ఎండాకాలంలో ఇంట్లో చల్లదనం కోసం చాలామంది కొత్త ఎయిర్ కూలర్ కొనాలనుకుంటారు. అయితే మార్కెట్లో వందలాది మోడళ్లు, కొత్త ఫీచర్లతో కూలర్లు ఉండటంతో ఏది కొనాలో తెలియక ఆలోచనలో పడతారు. మరి మంచి కూలర్ ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం. 

2 Min read
Author : Kavitha G
Published : May 07 2026, 03:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
ఎయిర్ కూలర్ కొనుగోలు చిట్కాలు
Image Credit : AI

ఎయిర్ కూలర్ కొనుగోలు చిట్కాలు

వేసవిలో చాలామంది కొత్త కూలర్లను కొనుగోలు చేస్తుంటారు. అయితే మార్కెట్లో చాలా రకాల మోడల్స్ ఉంటాయి కాబట్టి, ఏదో కొనాలి అనే విషయంలో చాలామందికి సందేహం ఉంటుంది. కేవలం ధర తక్కువగా ఉందని కొనేస్తే, తర్వాత కూలింగ్ సరిగా లేకపోవడం, కరెంట్ బిల్లు ఎక్కువ రావడం లేదా మెయింటెనెన్స్ సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. అందుకే కొత్త కూలర్ కొనేముందు కొన్ని ముఖ్యమైన విషయాలు తప్పక తెలుసుకోవాలి. అవేంటో చూద్దాం.

27
గది సైజుకు తగిన కూలర్
Image Credit : Pinterest

గది సైజుకు తగిన కూలర్

గది పరిమాణానికి సరిపోయే కూలర్‌ను ఎంపిక చేయడం చాలా ముఖ్యం. చిన్న గదికి పెద్ద డెజర్ట్ కూలర్ కొనాల్సిన అవసరం లేదు. అలాగే పెద్ద హాల్‌కు చిన్న పర్సనల్ కూలర్ తీసుకుంటే సరైన కూలింగ్ రాదు. సాధారణంగా చిన్న గదులకు పర్సనల్ లేదా టవర్ కూలర్లు సరిపోతాయి. పెద్ద గదులు లేదా హాల్స్ కోసం డెజర్ట్ కూలర్లు మంచి ఎంపిక. కూలర్ కొనేముందు గది సైజ్‌ను దృష్టిలో పెట్టుకుని ఎయిర్ థ్రో సామర్థ్యాన్ని చెక్ చేసుకోవాలి.

Related Articles

Related image1
Mobile Phone: మెబైల్ ఫోన్ ని ఇలా చూస్తున్నారా? అయితే ఈ సమస్యలు తప్పవు జాగ్రత్త!
Related image2
Mobile Phone Safety: మొబైల్ ఫోన్ ని ఈ ప్లేస్ లో పెట్టారో ఇక అంతే సంగతులు!
37
ట్యాంక్ కెపాసిటీ
Image Credit : meta ai

ట్యాంక్ కెపాసిటీ

కూలర్‌లో ట్యాంక్ కెపాసిటీ కూడా ముఖ్యమైన అంశం. ట్యాంక్ చిన్నగా ఉంటే తరచూ నీళ్లు పోయాల్సి వస్తుంది. పెద్ద కుటుంబం లేదా ఎక్కువసేపు కూలర్ ఉపయోగించే వాళ్లు 40 లీటర్లకు పైగా కెపాసిటీ ఉన్న మోడళ్లను ఎంపిక చేసుకోవడం మంచిది. చిన్న గదులు లేదా వ్యక్తిగత వినియోగానికి 20 నుంచి 30 లీటర్ల ట్యాంక్ ఉన్న కూలర్లు సరిపోతాయి. ఆటో వాటర్ ఫిల్ వంటి ఫీచర్లు ఉంటే మరింత సౌకర్యంగా ఉంటుంది.

47
కూలింగ్ ప్యాడ్స్
Image Credit : Pinterest

కూలింగ్ ప్యాడ్స్

ఎయిర్ కూలర్‌లో ఉపయోగించే కూలింగ్ ప్యాడ్స్ నాణ్యత కూడా చాలా ముఖ్యం. ప్రస్తుతం హనీకాంబ్ ప్యాడ్స్ ఉన్న కూలర్లను ఎక్కువమంది ఇష్టపడుతున్నారు. ఇవి ఎక్కువసేపు చల్లగా ఉండటమే కాకుండా మెరుగైన కూలింగ్ ఇస్తాయి. సాధారణ వుడ్‌వూల్ ప్యాడ్స్‌తో పోలిస్తే ఇవి ఎక్కువ కాలం పనిచేస్తాయి.

57
విద్యుత్ వినియోగం
Image Credit : Pinterest

విద్యుత్ వినియోగం

ఏసీతో పోలిస్తే కూలర్లు తక్కువ విద్యుత్ వినియోగిస్తాయి. అయినప్పటికీ పెద్ద మోటార్ ఉన్న కొన్ని కూలర్లు ఎక్కువ పవర్ తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎనర్జీ ఎఫిషియెంట్ మోడళ్లను ఎంపిక చేయడం మంచిది. ఇన్వర్టర్‌పై కూడా పనిచేసే కూలర్లు ప్రస్తుతం మంచి డిమాండ్‌లో ఉన్నాయి. విద్యుత్ కోతలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఇవి ఉపయోగకరంగా ఉంటాయి.

67
సౌండ్ చేయని కూలర్లు
Image Credit : Pinterest

సౌండ్ చేయని కూలర్లు

కొన్ని కూలర్లు పనిచేసేటప్పుడు ఎక్కువ శబ్దం చేస్తాయి. ముఖ్యంగా రాత్రిపూట నిద్రపోయేటప్పుడు ఇది ఇబ్బందిగా మారుతుంది. అందుకే కొనేముందు ఫ్యాన్ నాయిస్ స్థాయిని చెక్ చేసుకోవాలి. సైలెంట్ ఆపరేషన్ ఫీచర్ ఉన్న కూలర్లు బెడ్‌రూమ్‌లకు బాగా సరిపోతాయి. అలాగే కూలర్ బాడీ నాణ్యతను కూడా పరిశీలించాలి. మంచి ప్లాస్టిక్ లేదా రస్ట్‌ఫ్రీ మెటీరియల్‌తో తయారైన కూలర్లు ఎక్కువకాలం మన్నుతాయి. వీలైతే వీల్స్ ఉన్న మోడళ్లను తీసుకోవడం మంచిది. రిమోట్ కంట్రోల్, టైమర్, స్పీడ్ సెట్టింగ్స్ వంటి ఫీచర్లు ఉంటే మరింత సౌకర్యవంతంగా ఉంటుంది.

77
బ్రాండ్, వారంటీ
Image Credit : Amazon.in

బ్రాండ్, వారంటీ

కూలర్ కొనేటప్పుడు బ్రాండ్, వారంటీ విషయాలు కూడా తప్పక చెక్ చేయాలి. మంచి బ్రాండ్ కూలర్లు సాధారణంగా మెరుగైన సర్వీస్ అందిస్తాయి. కనీసం ఒక సంవత్సరం వారంటీ ఉన్న మోడళ్లను ఎంపిక చేసుకోవడం మంచిది. అలాగే ఆన్‌లైన్‌లో లేదా స్టోర్‌లో కొనేముందు రివ్యూలు చదవడం ఉపయోగకరం. ఆఫర్లు, డిస్కౌంట్లు ఉన్న సమయంలో కొనుగోలు చేస్తే మంచి మోడల్‌ను తక్కువ ధరకే పొందే అవకాశం ఉంటుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Hair Accessories: పండుగలకు అదిరిపోయే హెయిర్ క్లిప్పులు, ధర తక్కువే
Recommended image2
Sharara Sets: రెట్టింపు అందం కోసం ఈ షరారా సెట్స్ ట్రై చేయాల్సిందే!
Recommended image3
Curly Bangles: మెలికల గాజులే ఇప్పుడు కొత్త ఫ్యాషన్
Related Stories
Recommended image1
Mobile Phone: మెబైల్ ఫోన్ ని ఇలా చూస్తున్నారా? అయితే ఈ సమస్యలు తప్పవు జాగ్రత్త!
Recommended image2
Mobile Phone Safety: మొబైల్ ఫోన్ ని ఈ ప్లేస్ లో పెట్టారో ఇక అంతే సంగతులు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved