పీరియడ్స్ సరిగ్గా రావడం లేదా? అయితే ఈ టిప్స్ మీ కోసమే..
irregular periods: చాలా మంది మహిళలకు నెలసరి సక్రమంగా కాదు. దానికి కారణాలు అనేకం. వాటన్నింటిని తెలుసుకుని తగిన జాగ్రత్తలు తీసుకుంటే నెలసరిలో వచ్చే సమస్యలు రావు. కానీ దాన్ని అలాగే నిర్లక్ష్యం చేస్తే మాత్రం అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోక తప్పదు.

irregular periods: నేడు చాలా మంది మహిళలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఇరెగ్యులర్ పీరియడ్స్. ఈ సమస్య వల్ల అనేక అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం పొంచి ఉంది.. ఇది పెళ్లి కాని యువతుల్లో కంటే పెళ్లైన మహిళల్లోనే అధికంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ సమస్య హార్మోన్ల వల్ల ఎక్కువగా వస్తుంటుంది. అలాగే ప్రొలాక్టిన్ హార్మోన్, థైరాయిడ్ వల్ల కూడా నెలసరి తప్పే అవకాశం ఉంది. అందుకే హార్మోన్లు బ్యాలెన్స్ డ్ గా ఉండేట్టు చూసుకోవాలి. లైఫ్ స్టైల్ కూడా దీనికి ఒక కారణం కావొచ్చు. అంటే ఊబకాయుల్లో హార్మోన్లు గతితప్పుతాయి. కాబట్టి ఈ సమస్యను ఎంత తొందరగా వదిలించుకుంటే అంత మంచిది. అయితే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే హాస్పటల్లకు, మెడిసిన్స్ పైనే చాలా మంది ఆధారపడుతుంటారు. కానీ ఇంట్లో లభించే వాటితోనే ఈ సమస్య నుంచి తొందరగా బయటపడొచ్చు.
అల్లం: అల్లం ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. అందుకే దీన్ని ఎక్కువగా వంటల్లో ఉపయోగిస్తాం. అలాగే ఎన్నో ఔషదాల తయారీలోనూ దీన్ని ఉపయోగిస్తుంటారు. దీన్ని ఉపయోగించే ఇరెగ్యులర్ పీరియడ్స్ (Regular Periods)కు చెక్ పెట్టొచ్చు. అది ఎలాగంటే.. కొన్ని నీళ్లను తీసుకుని అందులో చిన్న అల్లం ముక్కను వేసి ఐదు నిమిషాల పాటు బాగా మరిగించాలి. ఆ తర్వాత దానిని వడకట్టి.. అందులో సరిపడా తేనేను కలపాలి. ఆ ద్రావణాన్ని ప్రతిదినం భోజనం చేసిన తర్వాత తాగితే చక్కటి ఫలితం ఉంటుంది.
దాల్చిన చెక్క: మసాలా దినుసుల్లో ఉండే దాల్చిన చెక్కలో ఎన్నోఔషదగుణాలుంటాయి. ఇది హార్మోన్లను బ్యాలెన్స్ చేయడంలో చక్కగా ఉపయోగపడుతుంది. అలాగే దీన్ని ఉపయోగించి Regular Periods కు చెక్ పెట్టొచ్చు. ఎలాగంటే.. చాల్చిన చెక్కను తీసుకుని దాన్ని పౌడల్ లా చేయాలి. ఈ పౌడర్ ను గోరువెచ్చగా ఉండే పాలల్లో కలుపుకుని తాగాలి. అలాగే మీరు తినే ఆహారంపై కూడా దాల్చిన చెక్క పౌడర్ ను చల్లుకుని తిన్నా ఆరోగ్యానికి మంచిదే. ఇలా క్రమం తప్పకుండా చేస్తే పీరియడ్స్ రెగ్యులర్ గా వస్తాయి.
సోంపు: సోంపు Periods రెగ్యులర్ గా వచ్చేలా చేయడంలో ముందుంటాయి. అలాగే ఆ సమయంలో వచ్చే నొప్పి(pain)నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు. సోంపు, సోంపు గింజలు, సోపు ఆకులు కూడా పీరియడ్స్ ప్రాబ్లమ్స్ కు చక్కటి చిట్కాలా ఉపయోగపడుతాయి. రెండు టేబుల్ స్పూన్ల సోంపును తీసుకుని కొన్ని వాటలో రాత్రంతా నానబెటటాలి. ఉదయాన్నే ఆ నీళ్లను వడకట్టి తాగాలి. ఇలా ప్రతి రోజూ అంటే పీరియడ్స్ సమస్య తగ్గే వరకు తాగాలి. ఇలా చేస్తే చాలా తొందరగా ఇరెగ్యులర్ పీరియడ్స్ సమస్య తగ్గుతుంది.
కూరగాయలు, పండ్ల జ్యూస్: శరీరంలో హర్మోన్లలల్లో వచ్చే మార్పుల మూలంగా ఒత్తిడి ఏర్పడుతుంది. దీనివల్ల పీరియడ్స్ గతి తప్పడం, ఆగిపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. దీనికి కావాల్సింది పోషకాలు, మినరల్స్. వీటితో ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇవి తాగా పండ్లు, కూరగాయల్లో ఎక్కువగా లభిస్తాయి. అందుకే మీ రోజు వారి ఆహారంలో వీటిని చేర్చాలి. ద్రాక్ష, క్యారెట్ జ్యూస్ లు తాగితే తప్పకుండా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.