Recipes: కమ్మనైన పెప్పర్ చికెన్ గ్రేవీ.. ధాబా స్టైల్ లో ట్రై చేద్దాం!
Recipes: నాన్ వెజ్ ప్రియులకు ఎన్ని వెరైటీలు ఉన్నా ఇంకా ఏదో కొత్త వెరైటీ కావాలని కోరుకుంటారు. అందుకే ఇప్పుడు స్పైసీ పెప్పర్ చికెన్ గ్రేవీ దాబా స్టైల్ లో ట్రై చేద్దాం.
పెప్పర్ చికెన్ గ్రేవీ ఇది రైస్ లోకి రోటీలోకి అలాగే దోసెల్లోకి కూడా చాలా బాగుంటుంది. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు 500 గ్రాములు చికెన్, పావు కప్పు కొబ్బరి నూనె, పులావ్ ఆకు ఒకటి, రెండు పెద్ద ఉల్లిపాయలు 2 సన్నగా తరిగి కట్ చేసుకున్నవి, పచ్చిమిర్చి రెండు, అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టేబుల్ స్పూన్లు.
టమాటాలు రెండు పెద్దవి ముక్కలుగా తరిగినవి, పసుపు పొడి ఒక టీ స్పూన్, మిరియాల పొడి ఒక టీ స్పూన్, గరం మసాలా పౌడర్ రెండు స్పూన్లు, రుచికితగినంత ఉప్పు, గార్నిషింగ్ కోసం కొంచెం కొత్తిమీర. అలాగే గ్రైండింగ్ కోసం ఒక స్పూన్ నూనె, సోపు, ఒక టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క అంగుళం ముక్క.
నల్ల మిరియాలు ఒక టేబుల్ స్పూన్, కొత్తిమీర గింజలు రెండు టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ ఒక పెద్దది. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. చికెన్ ని మూడొంతులు ఉడికించుకొని పక్కన పెట్టుకోండి.
తర్వాత ఒక పాత్రలో కొద్దిగా నూనె వేసి మసాలా దినుసులు అన్ని వేసి వేయించండి. దీనిని బ్లెండర్లో వేసి పక్కన పెట్టుకోండి. ఉల్లిపాయలు గోధుమ రంగు వచ్చేవరకు వేయించి దీనిని కూడా మసాలా దినుసులతో కలిపి మెత్తగా రుబ్బుకోవాలి. ఆపై అదే పాత్రలో నూనె వేసి అందులో ఉల్లిపాయలు మిరపకాయలు, పులావు ఆకు..
బంగారం రంగు వచ్చేవరకు వేయించాలి. తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేవరకు వేయించాలి. తర్వాత టమాటాలు కూడా వేసి మెత్తగా మగ్గనివ్వాలి. ఆపై గ్రైండ్ చేసిన మసాలా వేయాలి.
ఉప్పు, కారం,పసుపు అన్ని వేసి నూనె తేలే వరకు వేయించాలి. ఇప్పుడు అందులో చికెన్ ని జోడించండి. ఆపై నూనె బాగా తేలే వరకు బాగా కలపండి. గ్రేవీ దగ్గర పడిన తర్వాత కొత్తిమీర తరుగు వేసి గార్నిష్ చేయండి. స్పైసి స్పైసి చికెన్ పెప్పర్ గ్రేవీ రెడీ.