Peanut Side Effects: వేరుశెనగలను వీళ్లు మాత్రం తినకూడదు..!
Peanut Side Effects: వేరుశెనగలను తినడం వల్ల మన శరీరానికి పొటాషియం, జింక్, ఐరన్, విటమిన్ ఇ వంటివి పుష్కలంగా లభిస్తాయి. కానీ వీటిని మాత్రం కొన్నిఅనారోగ్య సమస్యలున్న వారు ఎట్టి పరిస్థితిలో తినకూడదు.

Peanut Side Effects: వేరుశెనగ గింజలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఐరన్, విటమిన్ ఇ, జింక్, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే ఇవి ప్రతి ఇంట్లో దర్శనమిస్తాయి. అయితే ఈ వేరుశెనగలను మాత్రం మోతాదులోనే తీసుకోవాలి. లేదంటే లేనిపోని అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశముందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అయితే ఈ వేరుశెనగలను కొన్ని అనారోగ్య సమస్యలున్న వారు మాత్రం ఎట్టిపరిస్థితిలో తినకూడదని ఆరోగ్య నిపుణులు సలహానిస్తున్నారు. వారెవరో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.
థైరాయిడ్ సమస్య.. థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు వేరు శెనగలను అస్సలు తినకూడదు. పొరపాటున గానీ వీటిని తిన్నారో TSH లెవెల్ పెరుగుతుంది. కాబట్టి వీటిని వీళ్లు తినకూడదు. ఒకవేళ తినాలనుకుంటే మోతాదులోనే తీసుకోవాల్సి ఉంటుంది. అయితే థైరాయిడ్ టాబ్లెట్లను వాడేవాళ్లు మాత్రం వీటిని పూర్తిగా తీసుకోకపోవడమే ఉత్తమం.
అలెర్జీ సమస్యలు.. అలెర్జీ సమస్య ఉన్నట్టైతే మీరు వేరుశెనగలను తీసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే వీటిని తింటే చర్మంపై దద్దుర్లు, కాళ్లలో దురద, పెదవులపై వాపు వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ వేసవిలో వీటిని మోతాదులోనే తీసుకోవాలి.
కాలెయ సమస్యలు.. కాలెయ సమస్యతో బాధపడేవారు వేరుశెనగలను తినొచ్చు. కానీ ఎక్కువగా మాత్రం తీసుకోకూడదు. వేరుశెనగలో ఉండే కొన్ని మూలకాలు కాలెయంపై చెడు ప్రభావం చూపెడుతాయి. కాబట్టి కాలెయ సమస్య ఉన్న వాళ్లు వేరువెనగలను తీసుకోకపోవడమే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
కీళ్ల నొప్పులు.. కీళ్ల నొప్పులున్న వారు వేరుశెనగలను మొత్తమే తినడం మానుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబున్నారు. ఎందుకంటే వేరుశెనగల్లో ఉండే లెక్టిన్ అనే పదార్థం నొప్పులను మరింత పెంచుతాయి.
అధిక బరువు.. అధిక బరువుతో బాధపడేవారు తీసుకునే ఆహారం పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మరింత బరువు పెరిగే అవకాశం ఉంది. అయితే ఓవర్ వెయిట్ ఉన్నవాళ్లు, బరువు తగ్గాలనుకున్న వాళ్లు వేరుశెనగలను మోతాదులోనే తీసుకోవాలని నిపుణులు సలహానిస్తున్నారు. ఎందుకంటే వీటిలో కేలరీలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. అలాగే ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, ఎన్నో విటమిన్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ మీరు మరింత బరువు పెరిగేలా చేస్తాయి.