Health Tips: పైల్స్ ను వదిలించుకోవాలంటే ఈ ఆహారాలకు నో చెప్పండి..
Health Tips: పైల్స్ పేరు వినగానే కొందరికి నవ్వొస్తే.. ఆ బాధను అనుభవించేవారికి మాత్రం ఏడుపొస్తుంది. పైల్స్ నొప్పి అంతలా ఉంటుంది మరి. అయితే ఈ పైల్స్ బాధనుంచి బటపడాలంటే ఈ మాత్రం కొన్ని రకాల ఆహారాలను అస్సలు తినకూడదు.

పైల్స్ చాలా చిన్న సమస్యలా కనిపించినా దీన్ని అనుభవించే వారికి తెలుస్తుంది. దాన్ని బరించడం ఎంత కష్టమో. ఈ సమస్య మలబద్దకం సమస్యకు దగ్గరి సంబంధం కలిగి ఉంటుంది. దీన్ని హేమోరాయిడ్స్ అని కూడా అంటారు. ఈ హేమోరాయిడ్స్ లో పురీషనాళం, పురీషనాళంలోని రక్తనాళాలు ఉబ్బడం ప్రారంభిస్తాయి. అలాగే ఆ ప్రదేశంలో రక్తం కూడా బయటకు రావడం ప్రారంభమవుతుంది.
piles
పురీషనాళంలో రక్తం లేనప్పటికీ కొంతమందికి అక్కడ తీవ్రమైన నొప్పి కలుగుతుంది. వాటిలో చాలా రకాలు ఉన్నాయి. ఈ ఫైల్స్ సమస్య రావడానికి ప్రధాన కారణం మాత్రం మలబద్దకమే. మలబద్దకం సమస్య నుంచి బయటపడితే పైల్స్ నుంచి ఈజీగా ఉపశమనం పొందవచ్చు. మరి ఈ మలబద్దకానికి కారణమయ్యే ఆహారం ఏంటో తెలుసుకుని వాటికి దూరంగా ఉంటే పైల్స్ నుంచి బయటపడ్డట్టే. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
గ్లూటెన్ ఆన్న ఆహారాలు.. గ్లూటెన్ ఉన్న ఆహార పదార్థాలు పైల్స్ వాధికి దారితీస్తాయి. ఈ గ్లూటెన్ అనే ప్రోటీన్ గోధుమలు, బార్లీ, ఇతర తృణధాన్యాలలో ఎక్కువగా ఉంటుంది. ఈ గ్లూటెన్ కొంతమందిలో ఆటో ఇమ్యూన్ వ్యాధిని ప్రేరేపిస్తాయి. ఇది మీ రోగనిరోధక వ్యవస్థపై, జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. దీంతో మీరు మలబద్దకం సమస్య బారిన పడి పైల్స్ సమస్యను ఫేస్ చేయాల్సి ఉంటుంది. పైల్స్ నుంచి బయటపడాలంటే మీరు ఈ గ్లూటెన్ ప్రోటీన్ ఉన్న ఆహారాలకు దూరంగా ఉండండి.
పాలు లేదా పాల ఉత్తత్తులు.. చాలా మందికి పాలన్నా.. పాల ఉత్పత్తులన్నా ఇష్టంగా తీసుకుంటూ ఉంటారు. కానీ పాలు, పాల ఉత్పత్తులను తీసుకోవడం వల్ల మలబద్దకం లేదా పైల్స్ సమస్యకు దారితీస్తుంది. ఎందుకంటే ఆవు పాలలో ప్రోటీన్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది అంత తొందరగా అరగదు. దీంతో మీరు మలబద్దకం సమస్యను ఎదుర్కోవచ్చు. ఓ పరిశోధన ప్రకారం.. ఆవు పాలను తీసుకోవడానికి బదులుగా సోయాపాలను తీసుకోవచ్చట.
రెడ్ మీట్.. రెడ్ మీట్ ఉపయోగించడం వల్ల మీరు మలబద్దకం, పైల్స్ సమస్యను ఎదుర్కోవచ్చు. రెడ్ మీట్ లో ఫైబర్, కొవ్వు పదార్థం ఎక్కువగా ఉంటుంది. వీటిని మన శరీరంలో అంత తొందరగా జీర్ణం చేసుకోలేదు. దీంతో శరీరంలో కొవ్వు విపరీతంగా పేరుకుపోతుంది. దీన్ని వదిలించుకోవడం అంత సులభం కాదు. మీరు పైల్స్ తో బాధపడుతున్నట్టైతే మాత్రం రెడ్ మీట్ కు దూరంగా ఉండాలి. లేదంటే మీ ఆరోగ్యం మరింత దెబ్బతినే ప్రమాదం ఉంది.
alcohol
ఆల్కహాల్.. ఆల్కహాల్ వల్ల డీహైడ్రేషన్ కు దారితీస్తుంది. నిర్జలీకరణం వల్ల కూడా మలబద్దకం సమస్య ఏర్పడవచ్చు. ఈ మలబద్దకం సమస్య క్రమంగా పైల్స్ కు దారితీస్తుంది. కాబట్టి ఆల్కహాల్ కూడా దూరంగా ఉండటమే బెటర్.
జంక్ ఫుడ్.. బాగా వేయించిన ఆహారాలను తీసుకోవడం వల్ల పైల్స్ సమస్యను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రెడ్ మీట్ లో లాగే ఈ జంక్ ఫుడ్ లో కూడా ఫైబర్ తక్కువగా ఉండి, కొవ్వు ఎక్కువగా ఉంటుంది. ఇది మలబద్దకానికి దారితీస్తుంది. వీటికి బదులుగా పండ్లు, కూరగాయలను ఎక్కువగా తినండి. దీంతో మీరు ఆరోగ్యంగా ఉండటంతో పాటుగా మలబద్దకం సమస్య నుంచి కూడా బయటపడొచ్చు.