MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Life
  • Paan: కిళ్లీ అందరికీ సెట్ కాదు.. ఈ అనారోగ్య సమస్యలు ఉంటే దూరంగా ఉండండి

Paan: కిళ్లీ అందరికీ సెట్ కాదు.. ఈ అనారోగ్య సమస్యలు ఉంటే దూరంగా ఉండండి

Paan: మనదేశంలో ఎంతో మంది భోజనం చేశాక కిళ్లీ తినడం సంప్రదాయంగా వస్తుంది. రుచిలో కూడా కిళ్లీ అద్భుతంగా ఉంటుంది. కానీ కొంతమంతి దీన్ని వ్యసనంలా నిత్యం నములుతూనే ఉంటారు.  భోజనం తర్వాత మీరు తినే స్వీట్ పాన్ కొంతమంది ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.

2 Min read
Author : Haritha Chappa
Published : May 26 2026, 06:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
కిళ్లీ లో పోషకాలు ఉంటాయా?
Image Credit : Getty

కిళ్లీ లో పోషకాలు ఉంటాయా?

ఆయుర్వేదం ప్రకారం కిళ్లీ మంచిదే. ఇందులో వాడే తమలపాకులో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇందులో కాల్షియం, విటమిన్ సి, రిబోఫ్లేవిన్, కెరోటిన్, నియాసిన్, క్లోరోఫిల్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. కిళ్లీని సరిగ్గా తీసుకుంటే, శరీరాన్ని అనేక సమస్యల నుంచి కాపాడుతుంది. తమలపాకు, వక్క, సున్నం, సోంపు వంటి వాటితో పాన్ తయారు చేస్తారు. ఇలాంటి కిళ్లీ ఆరోగ్యానికి మేలే చేస్తుంది.

కానీ కొంతమంది కిళ్లీలో పొగాకు వాడుతూ ఉంటారు. అది ఏమాత్రం మంచిది కాదు.  అలాగే స్వీట్ పాన్‌ను ప్రతిరోజూ తినే వాళ్లు ఉన్నారు. స్వీట్ పాన్‌లో చాలా చక్కెర, గుల్కంద్ వంటి తీపి పదార్థాలు ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను విపరీతంగా పెంచుతాయి. దీన్ని మధుమేహం ఉన్నవారు తింటే వారికి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
తీయటి కిళ్లీ వీరు తింటే ప్రమాదం
Image Credit : Getty

తీయటి కిళ్లీ వీరు తింటే ప్రమాదం

గర్భం ధరించాక మహిళలు కిళ్లీ తినడం మంచిది కాదు. ముఖ్యంగా తమలపాకునే వీరు తినకూడదు ఇది తల్లి, బిడ్డ ఇద్దరికీ హానికరమే.  అలాగే దంత సమస్యలు ఉన్నవారు కూడా స్వీట్ పాన్ తినకూడదు. పంటిలో పుచ్చు లేదా దంత క్షయం ఉంటే పాన్ తినడం వల్ల సమస్య మరింత పెరుగుతుంది. పంటి నొప్పి మొదలైపోతుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడేవారు కూడా ఎలాంటి కిళ్లీని తినకూడదు. పాన్ తిన్న వెంటనే నీళ్లు తాగితే తలనొప్పి, గ్యాస్ట్రిక్ సమస్యలు పెరిగే అవకాశం ఉంది. మందులు వాడేవారు ఎక్కువగా పాన్ తినవద్దు. ఇది కడుపు నొప్పికి కారణం కావచ్చు.

34
నోటి క్యాన్సర్ వచ్చే ఛాన్స్
Image Credit : Getty

నోటి క్యాన్సర్ వచ్చే ఛాన్స్

పొగాకు వాడిన కిల్లీ లేదా  లేదా స్వీట్ పాన్‌ను ప్రతిరోజూ తినే వారిలో నోటి క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. రోజంతా కిళ్లీ నమలడం వల్ల జీర్ణ సమస్యలు కూడా రావచ్చు. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాక కడుపులో ఇతర సమస్యలు మొదలవుతాయి.

44
బీపీ ఉన్నవారు?
Image Credit : Getty

బీపీ ఉన్నవారు?

కిళ్లీలో వాడే తమలపాకు ఘాటు గుణం పిల్లలకు, వృద్ధులకు హానికరం. కాబట్టి వారికి ఎప్పుడూ కిళ్లీ ఇవ్వకండి. హైబీపీతో బాధపడేవారు ఎట్టిపరిస్థితుల్లోనూ కిళ్లీ తినకూడదు. అధిక రక్తపోటు సమస్య ఉన్నవారు, పొగాకు లేదా తమలపాకుతో కూడిన పాన్  రక్తపోటు పెరిగిపోతుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Life Lessons : దశావతారాల నుంచి Gen-Z నేర్చుకోవాల్సిన 10 జీవిత పాఠాలు
Recommended image2
Thailand Trip New Rules: థాయ్‌లాండ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? సెప్టెంబర్ 15 నుంచి భారతీయులకు కొత్త రూల్స్
Recommended image3
Urine : మూత్రం ఎందుకు దుర్వాసన వస్తుంది? అసలు శరీరంలో మూత్రం ఎలా తయారవుతుంది?
Related Stories
Recommended image1
Multani mitti: జుట్టుకు ముల్తానీ మిట్టి ఇలా అప్లై చేశారంటే జుట్టు రాలడమే ఆగిపోతుంది
Recommended image2
Beads toe rings: రంగు రంగుల పూసల మెట్టెలు చూశారా.. ధరెంతంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved