Oversleeping Side Effects: వామ్మో అతిగా నిద్రపోతే ఇన్ని భయంకరమైన రోగాలొస్తయా..?
Oversleeping Side Effects: ఎక్కువ సేపు నిద్రపోవడం వల్ల ప్రాణాంతక రోగాలు వచ్చే అవకాశం ఉందని మీకు తెలుసా.. అవును ఓవర్ గా నిద్రపోతే డయాబెటీస్ నుంచి ఊబకాయం వరకు ఎన్నో రోగాలు వచ్చే అవకాశం ఉంది.

Oversleeping Side Effects: అలసిన శరీరానికి నిద్ర చాలా అవసరం. కంటినిండా నిద్ర ఉంటేనే శరీరం తిరిగి ఉత్తేజంగా మారుతుంది. యాక్టీవ్ గా పనిచేయగలుగుతుంది. ఇందుకోసం ప్రతి వ్యక్తి రోజుకు 7 నుంచి 8 గంటలు ఖచ్చితంగా నిద్రపోవాలని ఆరోగ్య నిపుణులు, డాక్టర్లు చెబుతుంటారు.
అలా అని అవసరానికి మించి ఓవర్ గా నిద్రపోతే మాత్రం ఎన్నో ప్రాణాంతక రోగాలకు ఆహ్వానం పలికినట్టేనంటున్నారు ఆరోగ్య నిపుణులు. మీకు తెలుసా..అతిగా నిద్రపోవడం వల్ల బరువు పెరగడంతో పాటుగా అధిక ఒత్తిడి వంటి ఎన్నో అనారోగ్య సమస్యల బారిన పడొచ్చు. ఓవర్ గా పడుకోవడం వల్ల కలిగే అనారోగ్య సమస్యలేంటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం పదండి.
బరువు పెరుగుతారు.. ఒక రోజులో (24 గంటల్లో)12 గంటల నుంచి 15 గంటల వరకు నిద్రపోయే వ్యక్తులు ఖచ్చితంగా బరువు పెరుగుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎలా అంటే నిద్రపోయే సమయంలో శరీరంలోని కేలరీలు బర్న్ అవుతాయి. ఆ సమయంలో మన బాడీ ఎలాంటి శారీరక శ్రమ చేయదు. దీనివల్ల బరువు పెరిగే అవకాశం ఉంది. అంతేకాదు ఇది మిమ్మల్ని ఊబకాయం బారిన పడేస్తుంది. కాబట్టి అన్ని గంటలు నిద్రపోకండి.
ఒత్తిడి పెరుగుతుంది.. ఎక్కువగా నిద్రపోవడం వల్ల మీ మెదడు ఎలాంటి పనిని చేయదు. ఇలాంటి సమయంలో ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా పగటిపూట నిద్రపోవడం మీ ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ వ్యాధులు కూడా రావొచ్చు.. అతిగా నిద్రపోవడం వల్ల టైప్ 2 డయాబెటీస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు గుండెపోటు కూడా రావొచ్చు.
అంతేకాదు ఓవర్ గా నిద్రపోతే మలబద్దకం సమస్య బారిన కూడా పడొచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇక వేల మీరు అతిగా నిద్రపోతున్నట్టైతే వెంటనే ఈ అలవాటును మార్చుకోండి.
ఎక్కువ సేపు ఒకే స్థితిలో ఉంటే బ్యాక్ పెయిన్ కూడా వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ సేపు ఒకే స్థితిలో ఉన్నట్టైతే మీరు ఎక్కువ సేపు పడుకోవడం తగ్గించాలి.
అతిగా నిద్రపోవడడం వల్ల మీరు ఏ పనిని హుషారుగా చేయలేరు. అంతేకాదు తరచుగా అలసిపోతారు. ఎందుకంటే శరీరానికి ఎక్కువ సేపు రెస్ట్ ఇవ్వడం వల్ల ఇలా అవుతుంది. అంతేకాదు ఎక్కువ సేపు నిద్రపోవడం వల్ల మీ శరీరంలోని నరాలు, కండరాలు బలంగా మారుతాయి. దీంతో మీరు అలసటకు గురవుతారు.