Oral Health Tips: నోటి దుర్వాసనతో ఇబ్బందిపడుతున్నారా? అయితే ఈ చిట్కాలను ట్రై చేయండి..
Oral Health Tips: ప్రస్తుత కాలంలో నోటి దుర్వాసన సమస్యతో బాధపడే వారి సంఖ్య బాగా పెరిగిపోతోంది. దీనికి కారణాలు చాలానే ఉన్నాయి. అయితే రెగ్యులర్ గా ఈ చిట్కాలను పాటిస్తే నోటి దుర్వాసన నుంచి సులభంగా బయటపడతారు.

bad breath
Oral Health Tips: మనం నిద్రలేచినప్పుడు నోటి నుంచి దుర్వాసన రావడం సర్వసాధారణం. దీనికి కారణం.. రాత్రి సమయంలో నోటిలో బ్యాక్టీరియా ఏర్పడటమే. నోటిని శుభ్రం చేసుకుంటే ఈ బ్యాడ్ బ్రీత్ పోతుంది. కానీ కొందరికీ మాత్రం ఎల్లప్పుడూ నోటి నుంచి దుర్వాసన వస్తూనే ఉంటుంది. ఇలాంటి వారు కొన్ని చిట్కాల ద్వారా నోటి దుర్వాసన సమస్య నుంచి ఈజీగా బయటపడొచ్చు. అవేంటంటే..
నోటి దుర్వాసనకు చెక్ పెట్టడంలో పెరుగు ముందుంటుంది. పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ బ్యాడ్ బ్రీత్ ను పోగొడుతుంది. అందుకే ఈ సమస్య ఉన్న వారు అన్నం తినేటప్పుడు చివర్లో పెరుగుతో తినండి. పెరుగు నోట్లో ఉండే చెడు బ్యాక్టీరియాను చంపేస్తుంది. దీంతో నోటి దుర్వాసన పోతుంది.
బ్యాడ్ బ్రీత్ నుంచి బయటపడేయడానికి గ్రీన్ టీ ఎంతో సహాయపడుతుంది. గ్రీన్ టీ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి నోటిలోని చెడు బ్యాక్టీరియాను చంపేస్తుంది. అంతేకాదు గ్రీన్ టీ నోటి దుర్వాసనకు కూడా చెక్ పెడుతుంది.
బ్రోకలీ, క్యాప్సికమ్ కూడా నోటి దుర్వాసనను పోగొట్టడానికి ఎంతో సహాయపడతాయి. వీటిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది బ్యాడ్ బ్రీత్ ను తగ్గించడానికి సహాయపడుతుంది.
సిట్రస్ ఫ్రూట్స్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. నిమ్మ, స్ట్రాబెర్రీ, నారిజ, పైనాపిల్, కివి వంటి పండ్లను తింటే నోటి దుర్వాసన పోతుంది. అంతేకాదు ఈ పండ్లు దంత సమస్యలను కూడా పోగొడుతాయి. అలాగే చిగుళ్ల వాపు, దంతాక్షయం వంటి సమస్యలను తగ్గిస్తుంది. దంతాలను కూడా బలంగా చేస్తాయి.
లవంగాలు కూడా నోటి దుర్వాసనను పోగొడుతాయి. నోటి దుర్వాసనతో బాధపడేవారు.. రెగ్యులర్ గా తిన్న తర్వాత ఒకటి రెండు లవంగాలను నోట్లో వేసుకోవాలి. దీంతో బ్యాడ్ స్మెల్ తగ్గుతుంది. లవంగాలలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి బ్యాడ్ బ్రీత్ కు కారణమయ్యే క్రిములను నాశనం చేస్తాయి.
తులసి ఆకులు, పుదీనా ఆకులు కూడా నోటి దుర్వాసనను పోగొడుతాయి. వీటిలో ఏదో ఒకదాన్ని పచ్చిగా తింటే నోటి దుర్వాసన నుంచి బయటపడతారు. అంతేకాదు ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి కూడా.