MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
  • Home
  • Life
  • Hair Growth: ఉల్లిపాయ, కొబ్బరి నూనె మ్యాజిక్.. జుట్టు వద్దన్నా పెరుగుతుంది!

Hair Growth: ఉల్లిపాయ, కొబ్బరి నూనె మ్యాజిక్.. జుట్టు వద్దన్నా పెరుగుతుంది!

Hair Growth: జుట్టు రాలడం, చుండ్రు, బలహీనమైన జుట్టు వంటి సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఉల్లిపాయ రసం, కొబ్బరి నూనె మిశ్రమం మీకు బెస్ట్ సొల్యూషన్. ఈ ప్యాక్‌ను ఎలా తయారు చేయాలి? ఎలా వాడాలి? దీనివల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

2 Min read
Author : Kavitha G
Published : May 12 2026, 01:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఒత్తైన జుట్టు కోసం సహజ చిట్కాలు
Image Credit : pinterest

ఒత్తైన జుట్టు కోసం సహజ చిట్కాలు

పొడవాటి, ఒత్తైన, మెరిసే జుట్టు ముఖ అందాన్ని రెట్టింపు చేస్తుంది. కానీ ఈ రోజుల్లో కాలుష్యం, చెడు ఆహారపు అలవాట్లు, కెమికల్స్ ఉన్న ప్రొడక్ట్స్ వాడటం వల్ల జుట్టు రాలడం, బలహీనపడటం సాధారణమైంది. ఇలాంటి టైంలో, సహజ పద్ధతులు పాటించడం జుట్టు ఆరోగ్యానికి చాలా మంచిది. అలాంటి చిట్కాల్లో ఉల్లిపాయ ఒకటి. దీన్ని మన పెద్దల కాలం నుంచి జుట్టు సంరక్షణకు వాడుతున్నారు. ఉల్లిపాయలో సల్ఫర్, యాంటీఆక్సిడెంట్లు, అనేక పోషకాలు ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలను ప్రోత్సహించి, కుదుళ్లను బలంగా మార్చడంలో సహాయపడతాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
హెయిర్ ప్యాక్ తయారీ విధానం
Image Credit : Getty

హెయిర్ ప్యాక్ తయారీ విధానం

ఈ హెయిర్ ప్యాక్ కోసం.. ముందుగా ఒక మీడియం సైజు ఉల్లిపాయను తీసుకోవాలి. దాని పొట్టు తీసేసి… సగం ఉల్లిపాయను తురిమి, దాని నుంచి రసాన్ని తీయాలి. ఆ తర్వాత ఒక గిన్నెలో 3 నుంచి 4 చెంచాల కొబ్బరి నూనె తీసుకుని, దానిలో ఈ ఉల్లి రసాన్ని కలపాలి. ఈ రెండింటినీ బాగా మిక్స్ చేశాక, కొద్దిగా వేడి చేయాలి. మరీ వేడిగా ఉండకూడదు. 

Related Articles

Related image1
Parenting Tips: ఏడుస్తూ అల్లరి చేసే మొండి పిల్లలను కంట్రోల్ చేసే 5 టిప్స్ ఇవిగో!
Related image2
Leftover Chicken Curry: నిన్నటి చికెన్ కూరను వేడిచేసుకొని తింటున్నారా? ఏమవుతుందో తెలుసా?
35
ఉపయోగించే విధానం
Image Credit : chatgpt

ఉపయోగించే విధానం

ఉల్లి, కొబ్బరి నూనె మిశ్రమాన్ని రాసే ముందు, జుట్టు చిక్కుల్ని పూర్తిగా తీసేయాలి. ఇప్పుడు దూది లేదా వేళ్ల సహాయంతో ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి, నెమ్మదిగా మసాజ్ చేయాలి. ఆ తర్వాత, జుట్టు చివర్ల వరకు పూర్తిగా రాయాలి. 5 నుంచి 10 నిమిషాల పాటు మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. జుట్టు కుదుళ్లకు కావాల్సిన పోషణ అందుతుంది. ఈ మిశ్రమాన్ని సుమారు గంటసేపు అలాగే ఉంచుకోవాలి. తర్వాత, మైల్డ్ షాంపూతో తలస్నానం చేస్తే సరిపోతుంది.

45
ఈ సమస్యలు దూరం
Image Credit : Gemini ai

ఈ సమస్యలు దూరం

జుట్టు రాలడం లేదా చుండ్రు సమస్యతో బాధపడుతున్నవారికి ఈ చిట్కా చక్కగా పనిచేస్తుంది. ఉల్లిపాయలో ఉండే సల్ఫర్ స్కాల్ప్ ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. అలాగే కొబ్బరి నూనె జుట్టుకు లోతైన తేమను అందిస్తుంది. పొడిబారిన, నిర్జీవమైన జుట్టును మృదువుగా మార్చడంలో కూడా ఈ మిశ్రమం ప్రభావవంతంగా పనిచేస్తుంది. దీన్ని వాడటం వల్ల జుట్టు మరింత ఒత్తుగా, బలంగా మారుతుంది. అయితే,సెన్సిటివ్ స్కాల్ప్ ఉన్నవారు ముందుగా ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మంచిది.

55
వారానికి రెండుసార్లు
Image Credit : GEMINI AI

వారానికి రెండుసార్లు

మంచి ఫలితాల కోసం.. ఉల్లిపాయ, కొబ్బరి నూనె మిశ్రమాన్ని వారానికి రెండుసార్లు ఉపయోగించవచ్చు. కొన్ని వారాల పాటు దీన్ని మీ హెయిర్ కేర్ రొటీన్‌లో చేర్చుకుంటే, జుట్టు పెరుగుదలలో మంచి మార్పు కనిపిస్తుంది. అలాగే సమతుల్య ఆహారం, సరైన జీవనశైలి కూడా జుట్టు ఆరోగ్యానికి చాలా ముఖ్యం.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జీవనశైలి
సౌందర్యం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Locket: 2 గ్రాముల్లో చైన్ కి అదిరిపోయే లాకెట్ డిజైన్లు
Recommended image2
Silver Rings: రూ.1000 లోపు అద్భుత డిజైన్లలో వెండి ఉంగరాలు
Recommended image3
Salt: ఉప్పు వంట కోసమే కాదు.. ఇంట్లో ఉన్న సమస్యలను కూడా పోగొడుతుందట
Related Stories
Recommended image1
Parenting Tips: ఏడుస్తూ అల్లరి చేసే మొండి పిల్లలను కంట్రోల్ చేసే 5 టిప్స్ ఇవిగో!
Recommended image2
Leftover Chicken Curry: నిన్నటి చికెన్ కూరను వేడిచేసుకొని తింటున్నారా? ఏమవుతుందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved