- Home
- Life
- ఒక్క సిగరెట్ 17 నిమిషాల జీవితాన్ని హరిస్తుంది, మహిళల్లో అయితే ఇదీ మరీ ఎక్కువ. షాకింగ్ విషయాలు..
ఒక్క సిగరెట్ 17 నిమిషాల జీవితాన్ని హరిస్తుంది, మహిళల్లో అయితే ఇదీ మరీ ఎక్కువ. షాకింగ్ విషయాలు..
పొగతాగడం ఆరోగ్యానికి హానికరమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్మోకింగ్ కిల్స్ అని సిగరెట్ ప్యాక్‌పై రాసి ఉంటుంది. అయినా పొగరాయుళ్లు మాత్రం ఉఫ్ ఉఫ్‌మంటూ పొగను వదులుతుంటారు. స్టైల్ కోసం కొందరు వ్యసనంగా మారికొందరు స్మోకింగ్‌ను అలవాటు చేసుకుంటారు. అయితే స్మోకింగ్ వల్ల ఆయుష్షు తగ్గుతుందని తాజాగా నిర్వహించిన ఓ అధ్యయనంలో వెల్లడైంది..

పురుషులు ఒక సిగరెట్ తాగితే వారి జీవితంలో 17 నిమిషాలను కోల్పోతున్నట్లేనని తాజా పరిశోధనల్లో వెల్లడైంది. మహిళల్లో ఇది 22 నిమిషాలని చెబుతున్నారు. ప్రతీ ఒక సిగరెట్ మనిషి జీవితాన్ని సరాసరి 11 నిమిషాలు తగ్గిస్తుందని గతంలో వెల్లడైన గణంకాలతో పోల్చితే తాజాగా నిర్వహించిన పరిశోధనల్లో ఈ సమయం మరింత ఎక్కువని తేలింది. యూనివర్సిటీ కాలేజీ లండన్‌కు చెందిన హెల్త్ అండ్ సోషల్ కేర్ డిపార్ట్‌మెంట్ ఈ విషయాలను వెల్లడించింది. 2025లో ధూమపానం అలవాటు ఉన్న వారు మానుకోవాలని సూచిస్తున్నారు.
ధూమపానం అలవాటు ఉన్న వారు జీవిత కాలం మొత్తంలో ఏడాదిపైకా జీవిత కాలాన్ని కోల్పోతారని అధ్యయనాల్లో తేలింది. ధూమపానం ద్వారా తలెత్తే పలు అనారోగ్య సమస్యలు మనిషి జీవిత కాలాన్ని తగ్గిస్తుందని అధ్యయంలో తేలింది. ఒక సిగరెట్ సగటను ఒక వ్యక్తి 20 నిమిషాల జీవితాన్ని హరిస్తుందని, ఈ లెక్కన 20 సిగరెట్లు ఉండే ఒక ప్యాకెట్ వ్యక్తి జీవిత కాలాన్ని ఏకంగా 7 గంటలు తగ్గిస్తుందని అధ్యయనంలో వెల్లడైంది.
ఈ విషయమై యూనివర్సిటీ కాలేజీ లండన్ ప్రిన్సిపల్ రీసెర్చ్ ఫెలో డాక్టర్ సారా జాక్సన్ మాట్లాడుతూ.. స్మోకింగ్ ఆరోగ్యానికి హానికరమని ప్రజలకు తెలిసినా నిర్లక్ష్యం చేస్తారు. ధూమపానం మానేయని వారు సగటున దాదాపు ఒక దశాబ్దం జీవితాన్ని కోల్పోతారని తెలిపారు. ధూమపానం ఎంత త్వరగా మానేస్తే అంత సుదీర్ఘ, ఆరోగ్యవంతమై జీవితాన్ని పొందొచ్చని పరిశోధన చెబుతోంది.
కొత్తేడాది ప్రారంభ రోజున స్మోకింగ్ మానేస్తే వారు ఫిబ్రవరి 20వ తేదీ నాటికి వారి జీవితంలో ఒక వారం తిరిగి పొందవచ్చని అలాగే సంవత్సరం చివరి నాటికి, వారు 50 రోజుల జీవితాన్ని కోల్పోకుండా ఉండవచ్చని అధ్యయంలో చెబుతోంది. గుండె జబ్బులు, పక్షవాతం వచ్చే ప్రమాదం సిగరెట్ తాగే వారిలో ఎక్కువగా ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం , పొగాకు మహమ్మారి ప్రపంచం ఇప్పటివరకు ఎదుర్కొన్న అతిపెద్ద ప్రజారోగ్య ముప్పులలో ఒకటి. స్మోకింగ్ కారణంగా ప్రతీ ఏంటా ఏకంగా 8 మిలియన్ల మంది చనిపోతున్నారు.