- Home
- Life
- pomegranate: దానిమ్మ తొక్కే కదా అని తేలిగ్గా తీసిపారేయకండి.. దీనివల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి..
pomegranate: దానిమ్మ తొక్కే కదా అని తేలిగ్గా తీసిపారేయకండి.. దీనివల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి..
pomegranate: దానిమ్మ పండులో ఎన్నో ఔషద గుణాలుంటాయన్న సంగతి మనందరికీ ఎరుకే. కానీ దాని తొక్క కూడా మనకు ఎంతో మేలు చేస్తుందన్న సంగతి మీకు తెలుసా. అవును దానిమ్మ తొక్కతో చేసిన పొడి మనకు ఎన్నో రకాలుగా సహాయపడుతుంది. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

pomegranate: దానిమ్మ పండు ఎన్నో రకాల రోగాలను దూరం చేస్తుంది. అంతేకాదు ఈ పండును తినడం వల్ల రక్తహీనత సమస్య కూడా తగ్గుతుంది. అలాగే రోగ నిరోధక శక్తి (Immunity Power) కూడా పెరుగుతుంది. అయితే చాలా మంది దానిమ్మ గింజలను తినేసి దాని తొక్కను బయటపడేస్తుంటారు. కానీ తొక్కలో కూడా ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఈ తొక్కను మనం ఎన్నో రకాలుగా ఉపయోగించుకోవచ్చు. ఈ తొక్కలను బాగా ఎండబెట్టి పొడిలా తయారు చేసుకోవాలి. ఆ పొడిని గాలి వెళ్లని సీసాలో వేసి బద్రంగా దాచి పెట్టుకుని అవసరమైనప్పుడు గ్లాసు నీటిలో కలుపుకుని తాగితే అద్బుత ప్రయోజనాలు జరుగుతాయి. మరి ఈ పొడి వల్ల మనకు ఎలాంటి లాభాలున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
కీళ్లనొప్పుుల సమస్యతో బాధపడేవారికి ఈ దానిమ్మ తొక్కలు దివ్య ఔషదంలా పనిచేస్తాయి. ఎండబెట్టిన దానిమ్మ తొక్కలను నీటిలో వేసి బాగా మరిగించుకోవాలి. చల్లగా అయ్యాక ఆ నీళ్లను వడగట్టాలి. ఆ నీటిని రోజూ తాగడం వల్ల కీళ్ల నొప్పుల సమస్య తగ్గుతుంది. అంతేకాదు ఈ నీళ్లను తాగడం వల్ల కీళ్ల వాపు, నొప్పులు రావని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
దంతాల సమస్యల నుంచి బయటపడేయడంలో ఈ తొక్కలు బాగా ఉపయోగపడాయి. ఈ తొక్కలను పౌడల్ చేసి అందులో పుదీనా, ఉప్పును కలిపి పళ్లను తోమాలి. ఇలా చేయడం వల్ల దంతాలు తలతల తెల్లగా మెరవడమే కాదు నోటి నుంచి వచ్చే దుర్వాస సమస్య కూడా తగ్గుతుంది.
పుండ్లు, గాయాలు త్వరగా మానేందుకు కూడా ఈ తొక్కలు ఎంతో సహాయపడతాయి. ఒట్టిగా ఎండిన తొక్కలను పేస్టు మాదిరిగా తయారుచేసుకోవాలి. దానిని గాయాలకు, పుండ్లకు రాస్తే అవి త్వరగా నయమవుతాయి.
మొటిమల సమస్యకు చెక్ పెట్టడంలో దానిమ్మ తొక్కలు బాగా ఉపయోగపడతాయి. దానిమ్మ తొక్కల పొడిలో నీళ్లు కలిపి పేస్టులా తయారుచేసుకుని దాన్నిరెండు రోజుకొకసాకి ముఖానికి అప్లై చేసుకోవాలి. ఒక అరగంట పాటు దానిని ఆరనిచ్చి ఆ తర్వాత ముఖాన్ని క్లీన్ చేసుకోవాలి. తరచుగా ఇలా చేస్తే పింపుల్స్ ప్రాబ్లం సాల్వ్ అయినట్టే.
ఊబకాయులకు, డయాబెటీస్ పేషెంట్లకు ఈ దానిమ్మ పొడి మంచి మేలు చేస్తుంది. ప్రతిరోజూ పడుకునే సమయంలో దానిమ్మ తొక్కలను నీళ్లలో వేసి బాగా మరిగించాలి. ఆ నీరు చల్లారిన తర్వాత వాటిని వడగట్టుకుని తాగాలి. ఇలా చేస్తే డయాబెటీస్ రోగులకు షుగర్ కంట్రోల్లో ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ఈ వాటర్ గుండె ఆరోగ్యానికి కూడా బాగా ఉపయోగపడుతుంది.
దానిమ్మ గింజల్లో ఎలా అయితే పోషకవిలువలుంటాయో.. అదే విధంగా దాని తొక్కలో కూడా పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు యాంటీ ఆక్సిడెంట్లు కూడా వీటిలో మెండుగా లభిస్తాయి. ఇవి మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతాయి. ఐరన్, విటమిన్ ఎ, సి, విటమిన్ బి6, కాల్షియం వంటివి పుష్కలంగా లభిస్తాయి. అందుకే ఈ పండు తొక్కలను .. తొక్కే కదా అని అస్సలు పడేయకండి. పైన చెప్పిన విధంగా ఈ తొక్కలను ఉపయోగించుకోండి.