MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health tips: గుడ్లను వీటితో కలిపి తినకూడదు. తిన్నారో మీ పని మటాషే..!

Health tips: గుడ్లను వీటితో కలిపి తినకూడదు. తిన్నారో మీ పని మటాషే..!

Health tips: 'సండే అయినా.. మండే అయినా.. ప్రతిరోజూ తినండి గుడ్లు’ అని టీవీ యాడ్ లలో ప్రతీ రోజూ చూస్తూనే ఉంటాం. గుడ్లు సంపూర్ణ ఆహారం అయినప్పటికీ వీటిని ఎలా తినాలో సరైన మార్గం తెలిసి ఉండాలి అంటున్నారు ఆరోగ్య నిపుణులు.అంటే గుడ్డును వేటితో తినాలి.. వేటితో కలిపి తినకూడదు వంటి విషయాలు తెలియాలి. ఎందుకంటే గుడ్డును కొన్ని రకాల ఆహార పదార్థాలతో తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇంతకి ఎలాంటి  గుడ్డును వేటితో కలిపి తినకూడదో తెలుసుకుందాం పదండి.  

1 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 02 2022, 11:13 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

చేపలు (Fish):  గుడ్లను, చేపలను కలిపి తినడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు.. ముఖ్యంగా ఉడకబెట్టిన గుడ్లతో  చేపలను తినకూడదు. దీని వల్ల స్కిన్ అలర్జీ (Skin allergy)లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

జున్ను (Cheese): గుడ్డు, జున్ను రెండింటో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. కానీ గుడ్డును,  జున్నును రెండింటినీ ఒకేసారి తినడం వల్ల జీర్ణ సమస్యలు (Digestive problems)వస్తాయి, ఎందుకంటే ప్రోటీన్ జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది.

37

అరటి పండ్ల (Bananas): అరటి పండ్లను గుడ్లతో లేదా గుడ్లు తిన్న తరువాత ఎన్నడూ తినకూడదు. ఇలా తింటే మలబద్ధకం, గ్యాస్ ,ప్రేగు సంక్రమణకు దారితీస్తుంది.

47

నిమ్మకాయ (Lemon): ఉడకబెట్టిన గుడ్లుపై లేదా ఆమ్లెట్లపై  నిమ్మకాయ రసం, ఉల్లిపాయలు వేసుకుని తింటూ ఉంటారు. కానీ గుడ్లతో నిమ్మకాయను తినడం ప్రమాదకరమని పలు నివేదికలు చెబుతున్నాయి. ఇది గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది.
 

57

చక్కెర (Sugar): గుడ్లతో చేసిన తీపి ఫ్రెంచ్ టోస్ట్ ను తినడం ఇష్టమైతే ఈ అలవాటును వెంటనే మానుకోవడం మంచిది. ఎందుకంటే ఇది మీ ఆరోగ్యానికి హానికరం.  వాస్తవానికి చక్కెర, గుడ్ల నుంచి వెలువడే అమైనో ఆమ్లాలు మన శరీరానికి విషపూరితమైనవి. ఇవి మన శరీరంలో రక్తం గడ్డకట్టేలా చేస్తాయి. 

67

టీ (Tea)): బ్రేక్ ఫాస్ట్ లో చాలా మంది టీతో గుడ్లను తింటూ ఉంటారు. కానీ గుడ్లను టీ తో కలపడం వల్ల ఉదర సమస్యలు వస్తాయి. ఇది మలబద్ధకం, కడుపు నొప్పి, అజీర్ణానికి దారితీస్తుంది.
 

77

గుడ్లతో పాటు పుచ్చకాయలు (Watermelons), జున్ను (Cheese), పాలు, పాల ఉత్పత్తులు (Dairy products) , బీన్స్ (Beans) కూడా తీసుకోకూడదు. ఇవన్నీ కలిసి శరీరానికి హానిచేస్తాయి. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Silver Om Pendant: అదిరిపోయే వెండి ఓం లాకెట్లు.. ధర కూడా తక్కువే!
Recommended image2
Snakes : వర్షాకాలంలోనే పాములు ఇళ్ళలోకి ఎందుకు వస్తాయి? రాకూడదంటే ఏం చేయాలి..?
Recommended image3
Milk Benefits: నైట్ నిద్రపట్టడం లేదా? అమ్మమ్మల నాటి ఈ చిట్కా ట్రై చేయండి, హాయిగా నిద్రపట్టేస్తుంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved