MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • స్పెర్మ్ కౌంట్ తక్కువుంటే ఆ సమస్యలొస్తయ్.. దీన్ని సహజంగా పెంచడానికి ఇలా చేయండి..

స్పెర్మ్ కౌంట్ తక్కువుంటే ఆ సమస్యలొస్తయ్.. దీన్ని సహజంగా పెంచడానికి ఇలా చేయండి..

ఈ రోజుల్లో చాలా మంది మగవారు తక్కువ స్పెర్మ్ కౌంట్ తో ఇబ్బంది పడుతున్నారు. నాణ్యతలేని స్పెర్మ్, తక్కువ స్పెర్మ్ కౌంట్ వల్ల గర్భం దాల్చే అవకాశమే తక్కువుంటాయని నిపుణులు చెబుతున్నారు. వాతావరణ కాలుష్యం, ఒత్తిడి, ఫుడ్, నిద్రలేమి, పోషకాల లోపం వల్ల వీర్యకణాల సంఖ్య తగ్గిపోతుంది. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Nov 11 2022, 09:50 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

పేలవమైన జీవన శైలి, అలవాట్లు, నిద్రలేమి, కాలుష్యం వంటివన్నీ స్పెర్మ్ కౌంట్ తగ్గేలా చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల గర్భందాల్చడం కష్టమవుతుంది. అందుకే స్పెర్మ్ కౌంట్ పెరిగేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా మన లైఫ్ స్టైల్ లో కొన్ని మార్పులు చేసుకుంటే.. స్పెర్మ్ ఆరోగ్యంగా పెరుగుతుంది. వాటి నాణ్యత, పరిమాణం, చలనశీతల బాగుంటాయి. మరి ఇందుకోసం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం... 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27

బెర్రీలను తినాలి

బెర్రీల్లో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లను తీసుకోవడం వల్ల వీర్యకరణాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లు స్పెర్మ్ నాణ్యతను మెరుగుపర్చడానికి కూడా సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ యాంటీ యాక్సిడెంట్లు ఫ్రీరాడికల్స్ ను బయటకు పంపుతాయి. ఇవి మన శరీరానికి ఒక రక్షణ కవచంలా పనిచేస్తాయి. పుచ్చకాయ, టమాటాలు, చిలగడదుంపలు, గుమ్మడిగింజలు, క్యారెట్లు, చేపలు, వాల్ నట్స్, బ్లూ బెర్రీలు, దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లు స్పెర్మ్ కౌంట్ ను పెంచడంలో సహాయపడతాయి. 
 

37

బచ్చలికూర

స్పెర్మ్ కౌంట్ ను పెంచడానికి అవసరమయ్యే అత్యంత ముఖ్యమైన యాంటీ ఆక్సిడెంట్లలో లిపోయిక్ ఆమ్లం ఒకటి. ఇది బచ్చలికూరలో పుష్కలంగా ఉంటుంది. బంగాళాదుంపల్లో కూడా ఉంటుంది. వీటిని తీసుకుంటే వీర్యకణాల సంఖ్య బాగా పెరుగుతుంది. 

47

చికెన్

సెలీనియం, విటమిన్ ఇలు ఆర్ బీసీకి ఆక్సీకరణ నష్టాన్ని నిరోధిస్తాయి. అలాగే ఐవిఎఫ్ చికిత్సకు ముందు స్పెర్మ్ మొబిలిటీని పెంచడానికి కూడా సహాయపడతాయి. ఈ  సెలీనియం స్థాయిలను పెంచడానికి కాలెయ మాంసం, గుడ్లు, పౌల్ట్రీని తినండి. పొద్దు తిరుగుడు నూనెలో విటమిన్ ఇ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. 
 

 

57

నట్స్

స్పెర్మ్ కౌంట్ పెరగాలన్నా.. అది హెల్తీగా ఉండాలన్నా.. జింక్ చాలా అవసరం. ఈ ఖనిజం గుల్లల్లో పుష్కలంగా ఉంటుంది. అలాగే రెడ్ మీట్, పౌల్ట్రీలో కూడా బాగానే ఉంటుంది. పీతలు, బీన్స్, ఎండ్రికాయలు, గింజలు, తృణధాన్యాలు, పాల ఉత్పత్తుల్లో జింక్ పుష్కలంగా ఉంటుంది. 
 

67

హైడ్రేట్ గా ఉంచుకోండి

రోజూ పుష్కలంగా నీటిని తాగుతూ ఉండాలి. ఎందుకంటే నీరే మన శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించడానికి సహాయపడతాయి. అలాగే వీర్యం కూడా నీటి ఆధారితమైందే.  ద్రవాలను తీసుకోవడం వల్ల స్పెర్మ్ కౌంట్, వీర్యం నాణ్యత మెరుగుపడుతుంది. అందుకే మిమ్మల్ని మీరు హైడ్రేట్ గా ఉంచుకోవడానికి ఎప్పుడూ మీతో ఒక వాటర్ బాటిల్ ను ఉంచుకోండి. 
 

77

గాఢనిద్ర

నిద్రతో కూడా స్పెర్మ్ కౌంట్ ను పెంచుకోవచ్చు. తక్కువగా నిద్రపోయే వారిలో వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉంటుంది. వీర్యకణాల సంఖ్య పెరగాలంటే ప్రతిరోజూ ఒకే సమయానికి పడుకోండి. ఒకే సమయానికి నిద్ర లేవండి. ఇది  మీ జీవక్రియను మెరుగుపరుస్తుంది. గాఢనిద్ర మిమ్మల్ని శక్తివంతంగా, హుషారుగా చేస్తుంది. అలాగే మీ స్పెర్మ్ కౌంట్ ను పెంచుతుంది. 

  

 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Plants: ఈ మొక్కలు కిచెన్ లో పెడితే.. దుర్వాసన అనేదే ఉండదు..!
Recommended image2
Bihari Mangalsutra: బిహారీ మంగళసూత్రాలు కొత్త డిజైన్లతో మెరిసిపోతాయి
Recommended image3
Paithani Saree: సిల్క్ పైతానీ చీరలు.. ఎవరికైనా అందంగా నప్పుతాయి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved