MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Life
  • AC Alternatives: ఇదొక్కటి ఇంట్లో ఉంటే ఏసీ కన్నా సూపర్ కూలింగ్

AC Alternatives: ఇదొక్కటి ఇంట్లో ఉంటే ఏసీ కన్నా సూపర్ కూలింగ్

AC Alternatives: వేసవి ఉక్కపోత నుంచి ఉపశమనం పొందాలంటే ఏసీలు, కూలర్లపై ఆధారపడి డబ్బులు వృథా చేయడం కంటే, ఇల్లు కట్టుకునేటప్పుడే ఈ చిన్న మార్పులు చేసుకుంటే డబ్బు ఆదా చేయొచ్చు. వేడి ఎంత పెరిగినా కూడా ఇల్లు చల్లగా ఉంటుంది. అదెలాగో తెలుసా?

2 Min read
Author : Nandini Arava
Published : May 15 2026, 02:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కోటా స్టోన్ ఫ్లోరింగ్ ఉంటే చాలు..
Image Credit : instagram

కోటా స్టోన్ ఫ్లోరింగ్ ఉంటే చాలు..

వేసవి ఉక్కపోత నుంచి ఉపశమనం పొందాలంటే ఏసీలు, కూలర్లపై ఆధారపడి డబ్బులు వృథా చేయడం కంటే, ఇల్లు కట్టుకునేటప్పుడే ఈ చిన్న మార్పులు చేసుకుంటే డబ్బు ఆదా చేయొచ్చు. వేడి ఎంత పెరిగినా కూడా ఇల్లు చల్లగా ఉంటుంది.

మండే ఎండల్లో ఇల్లు కూల్‍గా ఉంచడం చాలా కష్టం. ఇంట్లో ఏసీ, కూలర్ ఉన్నా, నేల నుంచి వచ్చే సెగ వల్ల ఇంట్లో ఉండలేక అల్లాడిపోతారు. అందుకే సరైన ఫ్లోరింగ్ ఎంచుకుంటే, ఇంట్లోని ఉష్ణోగ్రతను కంట్రోల్ చేయొచ్చు. అందుకే చాలా మంది ఈ ఏసీలు కొనడం కంటే…బడ్జెట్‍ ఫ్రెండ్లీలో అయిపోయే ప్రత్యమ్నాయాలు చూస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కోటా స్టోన్‌లో అంత స్పెషాలిటీ ఏముంది?
Image Credit : instagram

కోటా స్టోన్‌లో అంత స్పెషాలిటీ ఏముంది?

కోటా స్టోన్ అనేది సహజమైన రాయి. ఈ రాయిలో శరీరానికి చల్లదనాన్ని ఇచ్చే గుణాలు ఉన్నాయి. ముఖ్యంగా వేసవి కాలంలో ఇంటిని చల్లగా ఉంచేలా చేస్తుంది. ఇంట్లో ఉష్ణోగ్రతను బ్యాలెన్స్‌గా ఉంచుతుంది. అందుకే పాతకాలం నుంచి ఇళ్లు, పెద్ద భవనాల్లో ఫ్లోరింగ్ కోసం దీనికి మంచి డిమాండ్ ఉంది. ఏసీ లేకపోయినా కూడా ఇంట్లోకి రాగానే ఒక మంచి కూలింగ్ వాతావరణం ఉండటం వల్ల చాలా హాయిగా అనిపిస్తుంది.

Related Articles

Related image1
AC: ఏసీ కొనాలనుకుంటున్నారా? మోసపోకుండా సరైనది ఎంచుకోండి ఇలా..
Related image2
AC Risk: ఎండలో నుంచి ఇంటికి రాగానే ఏసీలో కి వెళ్తున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?
35
మార్బుల్ కన్నా చౌక
Image Credit : instagram

మార్బుల్ కన్నా చౌక

మామూలుగా మార్బుల్ ఫ్లోరింగ్ అనేది చాలా ఖరీదు. కానీ, కోటా స్టోన్ చాలా చవక. తక్కువ ధరలో మార్బుల్ లాంటి క్లాసీ, ప్రీమియం లుక్‌ను ఇస్తుంది. ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టకుండా మీ ఇంటికి ప్రీమియం లుక్ ఇవ్వాలనుకుంటే, ఈ ఫ్లోరింగ్ బెస్ట్ ఛాయిస్. కోటా స్టోన్ చూడటానికి అందంగా ఉండటమే కాదు, చాలా దృఢంగా కూడా ఉంటుంది. ఇది ఎక్కువ కాలం మన్నుతుంది. పగుళ్లు లేదా మరకలు పడే ప్రమాదం చాలా తక్కువ. దీనికి పెద్దగా మెయింటెనెన్స్ కూడా అవసరం లేదు.

45
అన్ని రకాల ఇంటీరియర్‌లకు సెట్ అవుతుంది
Image Credit : instagram

అన్ని రకాల ఇంటీరియర్‌లకు సెట్ అవుతుంది

ఇప్పుడు కోటా స్టోన్ పాలిష్డ్, మ్యాట్, యాంటీ-స్లిప్ వంటి రకరకాల ఫినిషింగ్‌లలో దొరుకుతోంది. పాలిష్డ్ ఫినిష్, మార్బుల్ లాంటి మెరిసే లుక్‌ను ఇస్తుంది. మ్యాట్ ఫినిష్ సింపుల్, డీసెంట్ లుక్‌ను అందిస్తుంది. ఇది మోడ్రన్, సంప్రదాయ ఇంటీరియర్ డిజైన్లకు సులభంగా సెట్ అవుతుంది. ఈ ఫ్లోరింగ్‌ను శుభ్రం చేయడం, మెయింటెయిన్ చేయడం చాలా సులభం. మామూలుగా తడిగుడ్డతో తుడిస్తే చాలు, చాలా ఏళ్లపాటు కొత్తదానిలా మెరుస్తూ ఉంటుంది.
55
వేసవిలో కరెంటు బిల్లు ఆదా
Image Credit : instagram

వేసవిలో కరెంటు బిల్లు ఆదా

కోటా స్టోన్ సహజమైన చల్లదనం వల్ల ఇంట్లోని ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. దీనివల్ల ఏసీ, కూలర్ వాడకం తగ్గుతుంది. ఇది మీ కరెంట్ బిల్లును కంట్రోల్‌లో ఉంచడంలో సహాయపడుతుంది. మీరు మీ ఇంటిని స్టైల్‌గా మార్చుకోవడంతో పాటు, చల్లగా ఉంచుకోవాలనుకుంటే, కోటా స్టోన్ ఫ్లోరింగ్ ఒక తెలివైన పెట్టుబడి. ఇది మీ ఇంటి అందాన్ని పెంచడమే కాకుండా, వేడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Birds: ఈ గ్రామంలో పక్షులన్నీ ఒకేసారి ఆత్మహత్య చేసుకుంటాయి.. అది కూడా సెప్టెంబర్ నెలలోనే.. ఎందుకో తెలుసా?
Recommended image2
ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఎవరూ వద్దు.. ఏమిటీ సోలో లివింగ్ ట్రెండ్?
Recommended image3
Blackheads: ముఖంపై బ్లాక్ హెడ్స్ పోవాలంటే వీటిని రాస్తే చాలు!
Related Stories
Recommended image1
AC: ఏసీ కొనాలనుకుంటున్నారా? మోసపోకుండా సరైనది ఎంచుకోండి ఇలా..
Recommended image2
AC Risk: ఎండలో నుంచి ఇంటికి రాగానే ఏసీలో కి వెళ్తున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved