Ration System రేషన్ వ్యవస్థ రద్దవుతోందా? డీలర్ల ఆందోళన.. సమ్మె షురూ!
కేంద్ర ప్రభుత్వం రేషన్ వ్యవస్థను రద్దు చేయనుందనే భయంతో రేషన్ డీలర్లు సమ్మెకు పిలుపునిచ్చారు. ఒకవేళ రేషన్ వ్యవస్థ రద్దయితే ఇకపై రేషన్ డీలర్ల అవసరం ఉండదు. లబ్దిదారులకు రేషన్ సరుకులకు బదులు డబ్బులు నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమవుతాయి. దీంతో డీలర్లంతా ఆందోళన బాట పడుతున్నారు.

రేషన్ డీలర్ల చలో దిల్లీ
కేంద్రం తీసుకుంటున్న చర్యలతో దేశంలో రేషన్ వ్యవస్థ రద్దు కావచ్చని డీలర్ల అభిప్రాయపడుతున్నారు. ఫిబ్రవరి 28న కేంద్ర ఆహార కార్యదర్శి సంజీవ్ చోప్రా ఈ అంశంపై చర్చించడానికి అన్ని రాష్ట్రాల కార్యదర్శులతో భేటీ అయ్యారు.
గతంలోనూ ఇలాంటివి జరిగాయి. రేషన్ వ్యవస్థ రద్దు అవుతుందంటూ వార్తలు వచ్చాయి. ఈసారి మాత్రం దేశంలో రేషన్ పంపిణీ వ్యవస్థను రద్దు చేసే పరిస్థితులు కచ్చితంగా కనిపిస్తున్నాయని ఆల్ ఇండియా ఫెయిర్ ప్రైస్ షాప్ డీలర్స్ ఫెడరేషన్ ఆరోపిస్తోంది. దీంతో రేషన్ డీలర్లు సమ్మెకు పిలుపునిచ్చారు. ఏప్రిల్ 1న ఢిల్లీలో పార్లమెంట్ దగ్గర నిరసన తెలియజేయనున్నారు.
రేషన్ కార్డులను ఆధార్‌తో లింక్ చేయాలని, ఆపై మొబైల్ నంబర్‌ను లింక్ చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఫిబ్రవరి 28న కేంద్ర ఆహార కార్యదర్శి సంజీవ్ చోప్రా దేశంలోని అన్ని రాష్ట్రాల ఆహార కార్యదర్శులతో సమావేశమయ్యారు.
ఒకవేళ వ్యవస్థ రద్దు అయితే సబ్సిడీ డబ్బు నేరుగా రేషన్ లబ్ధిదారుల ఖాతాలో జమ అవుతాయి. ఇకపై న్యాయమైన ధరల బదులు, వినియోగదారులు బహిరంగ మార్కెట్లో వస్తువులు కొనాల్సి ఉంటుంది. కేంద్ర సంస్థ సైతం రేషన్ కోసం అవసరమైన వస్తువులు కొనదు. ఖాతా లింక్ చేస్తే సబ్సిడీ డబ్బు నేరుగా ఖాతాలో వేస్తామని కేంద్రం చెబుతోంది.