MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • మన శరీరానికి విటమిన్లు, ప్రోటీన్లు అందకపోతే.. వచ్చే రోగాలు ఇవే..!

మన శరీరానికి విటమిన్లు, ప్రోటీన్లు అందకపోతే.. వచ్చే రోగాలు ఇవే..!

శరీరం సక్రమంగా పనిచేయడానికి ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు చాలా అవసరం. ఇవి అందకే మన దేశంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇవి పూర్తిగా అందకున్నా.. తక్కువగా తీసుకున్నా.. మీరు ఊహించని జబ్బులతో బాధపడాల్సివస్తది.. జాగ్రత్త..  

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Sep 02 2022, 04:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

మనం తీసుకునే ఆహారమే మనం ఆరోగ్యంగా ఉండాలా.. జబ్బుల పాలు కావాలా అన్న సంగతిని తేల్చేస్తుంది. అందుకే ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాలనే తినండి.. లేకపోతే మీరు ఎన్నటికీ కోలుకేలేని రోగాల బారిన పడాల్సి వస్తది. మీకు తెలుసా..? మన శరీరానికి కావాల్సిన విటమిన్లు, ప్రోటీన్లు అందితేనే శరీరం అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటుంది. సక్రమంగా పనిచేస్తుంది. ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. అలాగే కణాలను పునరుత్పత్తి చేస్తుంది. 
 

28

కానీ ప్రస్తుతం చాలా మంది ప్రోటీన్ల లోపంతో బాధపడుతున్నారు. వీరిలో పిల్లలే కాదు యుక్తవయసు వారు కూడా ఉన్నారు. శరీరంలో ప్రోటీన్ లోపం ఏర్పడితే పిల్లల శరీరక ఎదుగుదలే కాదు.. మానసిక ఎదుగుదల కూడా సరిగ్గా ఉండదు. ముఖ్యంగా దీనివల్ల పిల్లల్లో ఇమ్యూనిటీ వ్యవస్థ చాలా బలహీనంగా ఉంటుంది. దీంతో వీరికి ఎన్నో రకాల అంటువ్యాధులు, ఇతర వ్యాధులు చుట్టుకుంటాయి. ప్రోటీన్ లోపం వల్ల పిల్లలు చాలా బక్కగా ఉంటారు. వీళ్ల ఎముకలు చాలా బలహీనంగా ఉంటాయి. పగుళ్లు కూడా వస్తాయి.. అంతేకాదు చర్మం, గోళ్లు, జుట్టుకు సంబంధించిన ఎన్నో సమస్యలు వస్తాయి. 
 

38

అందుకే పిల్లలైనా.. పెద్దలైనా పోషకాహారం తప్పకుండా తీసుకోవాలి. మీరు రోజూ తినే ఆహారంలో ప్రోటీన్లు, విటమిన్లు, మంచి కొవ్వు, మినరల్స్, కార్భోహైడ్రేట్లు పుష్కలంగా ఉండేట్టు చూసుకోవాలి. మరి ఈ ప్రోటీన్లు, విటమిన్లు మనకు ఏ విధంగా సహాయపడతాయో తెలుసుకందాం పదండి.. 
 

48

ప్రోటీన్లు

ప్రోటీన్లు మన శరీరానికి ఎన్నో విధాలా సహాయపడతాయి. ఇది మన శరీర ఎదుగుదలకు సహాయడుతుంది. అలాగే కణాలను పునరుత్పత్తి చేస్తుంది. ఎముకలను, కండరాలను బలంగా ఉంచడానికి సహాయపడతుంది. అంతేకాదండోయ్ శరీరాన్ని సక్రమంగా పనిచేసేందుకు ప్రోత్సహిస్తుంది. అంటే హార్మోన్ల విధులు సక్రమంగా జరగడానికి తోడ్పడుతుందన్న మాట. ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం వల్ల మీకు ఎలాంటి ఇన్ఫెక్షన్లు సోకే అవకాశమే ఉండదు. అయితే రోజూ మనం ఎంత ప్రోటీన్ ను తీసుకోవాలన్న విషయం.. ఏజ్, జెండర్, బరువు, ఆరోగ్య పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. అయితే మనం ఎంత ఎక్కువ ప్రోటీన్ ను తీసుకున్నా.. అది శరీరంలో నిల్వ ఉండదు. అందుకే.. మీరు తినేదాంట్లో  ప్రోటీన్ ఉండేట్టు చూసుకోండి.

58

పాలు, పెరుగు, జున్ను, చీజ్, గుడ్లు, సీ ఫుడ్, మాంసం, మటన్, చికెన్, బాతు మాంసం, గింజలు, టోపు, చిక్కుళ్లు, ఆకుపచ్చ కూరగాయలు, బీన్స్ , బచ్చలి కూర, సోయా, బాదం, వాల్ నట్స్, పొద్దుతిరుగుడు గింజలు, గుమ్మడి గింజల్లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. 
 

68

విటమిన్లు

సూక్ష్మపోషకాలనే విటమిన్లు అంటారు. ఇవి మన శరీరానికి ప్రోటీన్ల కంటే తక్కువగానే అవసరం అవుతాయి. వీటిని శరీరం ఉత్పత్తి చేసుకోలేదు కాబట్టి.. మనం తినే వాటిలో విటమిన్లు ఉండేట్టు చూసుకోవాలి. విటమిన్లు శరీరం సక్రమంగా పనిచేసేందుకు సహాయపడతాయి. అలాగే ఎర్ర రక్తకణాలను పుట్టిస్తాయి. రోగ నిరోధక వ్యవస్థను బలంగా ఉంచడానికి సహాయపడతాయి. అలాగే శరీరానికి శక్తిని అందిస్తాయి. అంతేకాదు నాడీవ్యవస్థను కూడా ఆరోగ్యంగా ఉంచుతాయి. వీటితో పాటుగా ఎముకలను కూడా పటిష్టంగా ఉంచడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా ఇవి గాయలు త్వరగా మానడానికి సహాయపడతాయి. దంతాలను కూడా ఆరోగ్యంగా, గట్టిగా ఉంచుతాయి. 

78

విటమిన్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి హానిచేసే ఫ్రీరాడికల్స్ నుంచి రక్షిస్తాయి. అలాగే కంటి చూపు కూడా బాగుండటానికి సహాయపడతాయి. అంతేకాదు ప్రమాదకరమైన గుండె జబ్బులు, కొన్ని రకాల క్యాన్సర్ల రిస్క్ ను కూడా తగ్గించడానికి సహాయపడతాయి. అయితే ఈ విటమిన్లు కాలెయంలో ఎక్కువ రోజుల నిల్వ ఉంటాయి. మన శరీరంలో విటమిన్లు లోపిస్తే పుట్టుకతో కంటిచూపు లేకపోవడం, తగ్గడం, రక్తహీనత, వంగిన కాళ్లు, చర్మంపై దద్దుర్లు వంటి ఎన్నో సమస్యలు వస్తాయి.. 
 

88

బ్రౌన్ రైస్, ఓట్స్, చిక్కుళ్లు, కిడ్నీ బీన్స్, చిక్పీస్, టొమాటోలు, నిమ్మకాయలు, పుట్టగొడుగులు, క్యారెట్, బచ్చలికూర, బఠానీలు, గుమ్మడి గింజలు, ఫ్రెష్ కూరగాయలు, బ్లూబెర్రీస్, అరటిపండ్లు, కివి, జామకాయ, పుచ్చకాయ, సీతాఫలం, నారింజ, మామిడి పండ్లు, పిస్తాలు, చియా విత్తనాలు, బాదం పప్పులు, రొయ్యలు, పాలు, పెరుగు, చేపలు వంటి ఆహారాల్లో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.  


 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
జీవనశైలి
Latest Videos
Recommended Stories
Recommended image1
Manthena Hair Care Tip: ఈ సీక్రెట్‍తో వద్దన్నా కూడా జుట్టు పెరిగిపోతుంది
Recommended image2
Crispy Dosa: హోటల్ స్టైల్ లో దోశలు క్రిస్పీగా రావాలా? పిండిలో ఇదొక్కటి కలిపితే చాలు
Recommended image3
Curry Leaves: కరివేపాకు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే ఏం చేయాలి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved