MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • ఈ పానీయాలు ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతాయి.. తప్పకుండా తాగండి..

ఈ పానీయాలు ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతాయి.. తప్పకుండా తాగండి..

టీ, కాఫీల వల్ల ఎంతో కొంత ప్రయోజనం ఉన్నప్పటికీ.. వీటివల్ల కలిగే లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉంటాయి. అందుకే వీటికి బదులుగా ఆరోగ్యకరమైన పానీయాలనే తాగండి. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Sep 04 2022, 10:57 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

పోషకాహారాన్ని తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలియజేసేందుకు ప్రతి ఏడాది మన దేశంలో సెప్టెంబర్ 1 నుంచి 7 వరకు నేషనల్ న్యూట్రిషన్ వీక్ ను జరుపుకుంటారు. సమతుల్య, పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాలను తినడం వల్ల ఎన్నో దీర్ఘకాలిక ప్రయోజనాలున్నాయని నిపుణులు పదేపదే చెప్తూ వస్తున్నారు. అయినా ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఆహారాన్నే ఆహారాలనే ఎక్కువగా తింటున్నారు. 
 

27

సాధారణంగా మనలో చాలా మందికి ఆరోగ్యకరమైన ఆహారం కంటే ఆయిలీ, స్పైసీ, స్వీట్ ఫుడ్ ను తినడానికే ఇష్టపడతారు. కానీ ఈ కరోనా కాలంలో ఇలాంటి ఫుడ్ వల్ల మీ ఆరోగ్యం మరింత దెబ్బతింటుంది. ఇవి రోగాలను అడ్డుకునే ఇమ్యూనిటీ పవర్ ను తగ్గిస్తాయి. అందుకే ఇమ్యూనిటీ వ్యవస్థను బలంగా ఉంచే ఆహారాలనే తినండి. అయితే కొన్ని ఆరోగ్యకరమైన పానీయాలు రోగ నిరోధక శక్తిని పెంచేందుకు ఎంతో సహాయపడతాయి. 
 

37

ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో మీ శరీరానికి అవసరమయ్యే విటమిన్లు, ప్రోటీన్లు ఉండేట్టు చూసుకోండి. ఇవే మిమ్మల్ని రోజంతా ఆరోగ్యంగా, ఎనర్జిటిక్ గా ఉంచడానికి సహాయపడతాయి. అయితే ఎలాంటి పానీయాలు తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుందో తెలుసుకుందాం పదండి. 

47

బీట్ రూట్, క్యారెట్ జ్యూస్

క్యారెట్, బీట్ రూట్  జ్యూస్ లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ, కాల్షియం, ఇనుము అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి శరీరాన్ని ఎన్నో రోగాల నుంచి రక్షించడంతో పాటుగా రోగనిరోధక వ్యవస్థను బలంగా ఉంచడానికి సహాయపడతాయి. అలాగే మంటను తగ్గిస్తాయి. ఇందుకోసం ఈ జ్యూస్ లో పసుపు తో పాటుగా కొద్ది అల్లాన్ని కూడా జోడించండి. ఈ పానీయాలు రోగ నిరోధక శక్తిని పెంచే లక్షణాలను కలిగి ఉంటాయి. 
 

57

అవిసె గింజలు, కాలే స్మూతీ

అవిసెగింజలు,  పాలు, బాదం పలుకులతో తయారయ్యే ఈ కాలే స్మూతీలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, ట్రిప్టోఫాన్, ప్రోటీన్ వంటి పదార్థాలతో నిండి ఉంటుంది. ఈ కాలే స్మూతీకి కావాలనుకుంటే మీకు నచ్చిన పండ్లను కూడా జోడించొచ్చు. ఈ స్మూతీ ఎంతో ఆరోగ్యకరమైంది కూడా. ఎందుకంటే ఆవిసె గింజల ద్వారా మీ శరీరానికి ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు లభిస్తాయి. అలాగే ఫైబర్ తో పాటుగా యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా లభిస్తాయి. 
 

67


గ్రీన్ జ్యూస్

ఆకుకూరల ద్వారా మన శరీరానికి ఎన్నో రకాల విటమిన్లు అందుతాయి. వీటితో తయారుచేసిన జ్యూస్ ను తాగడం వల్ల మీరు ఆరోగ్యంగా, ఫిట్ గా ఉంటారు. ఇందుకోసం సెలెరీ, కాలే, నిమ్మకాయ, దోసకాయ, ఆపిల్, అల్లం కలిపి జ్యూస్ ను తయారుచేయండి. ఒకగ్లాస్ ఈ జ్యూస్ ను తాగడం వల్ల మీ శరీరానికి కావాల్సిన ఎన్నో రకాల పోషకాలు అందుతాయి. వీటికి కావాలనుకుంటే బచ్చలికూర లేదా మీకు నచ్చిన ఆకుపచ్చని కూరగాయలను జోడించొచ్చు. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటుగా బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయి. 
 

77

ఉసిరి తేనె రసం

ఇండియన్ గూస్ బెర్రీగా పేరుపొందిన ఉసిరిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.  ఉసిరి రసం పోషక భాండాగారం అని చెప్పాలి. దీనిలో ఉండే విటమిన్ సి మీ రోజు అవసరాన్ని తీర్చడానికి సరిపోతుంది. ఇది పొట్టను శుభ్రపర్చడంతో పాటుగా రోగ నిరోధక వ్యవస్థను బలంగా ఉంచుతుంది. దీనిలో యాంటీ వైరల్ లక్షణాలు కూడా ఉంటాయి. ఇవి ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను తగ్గించడానికి సహాయపడతాయి. 
 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Polki Earrings: పోల్కీ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే రాయల్ లుక్ మీదే!
Recommended image2
Holi Colour Removal: బట్టలపై పడిన హోలీ కలర్స్ వదిలించేదెలా?
Recommended image3
Kitchen Hack: ఇలా చేస్తే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఎప్పటికీ పాడవ్వవు..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved